ఉపాధ్యాయులు విద్యార్థులకు విలువలతో కూడిన విద్యనందించాలి
ఉపాధ్యాయులు విద్యార్థులకు విలువలతో కూడిన విద్యనందించాలి
- రాష్ట్ర న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ ఎం డి ఫరూక్
- రాష్ట్ర ప్రభుత్వం విద్యాభివృద్ధికి అనేక కార్యక్రమాలు చేస్తుంది
- ఘనంగా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి గురుపూజోత్సవం వేడుకలు
- 48 మందికి జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాల ప్రధానం
నంద్యాల, సెప్టెంబర్ 05 (పీపుల్స్ మోటివేషన్):-
ఉపాధ్యాయులు విద్యార్థులకు విలువలతో కూడిన విద్యను అందించాలని రాష్ట్ర న్యాయ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ పేర్కొన్నారు.
శుక్రవారం ఉపాధ్యాయ దినోత్సవం - 2025 కార్యక్రమాన్ని కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాల్ నందు అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్, జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా, డీఈవో జనార్దన్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమం ప్రారంభించారు. భారతరత్న డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జయంతి సందర్భంగా ముఖ్య అతిథులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.
ఈ సందర్భంగా రాష్ట్ర న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ ఎం డి ఫరూక్ మాట్లాడుతూ.... ఉపాధ్యాయులు ప్రస్తుతం పెరుగుతున్న టెక్నాలజీకి అనుగుణంగా విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించి వారిని మంచి పౌరులుగా తీర్చిదిద్దాలన్నారు.
ప్రభుత్వ పాఠశాలలలో కార్పొరేట్ స్థాయి సౌకర్యాలు కల్పించి విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు కూటమి ప్రభుత్వం, చిత్తశుద్ధితో కృషి చేస్తున్నారన్నారు. ఉపాధ్యాయులు ప్రతి విద్యార్థి చక్కగా చదివి మంచి మార్కులతో ఉత్తీర్ణులయ్యే విధంగా వారిని తీర్చిదిద్దాలన్నారు. ఈసారి పదవ తరగతిలో నంద్యాల జిల్లా రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఉండేటట్లు చూడాలన్నారు. తల్లికి వందనం పథకం ద్వారా ప్రతితల్లికీ ఆర్థిక సహాయం అందించి తద్వారా వారి పిల్లలకు ఆర్థిక సమస్యలు తలెత్తకుండా వారి విద్యాభ్యాసం కొనసాగించేందుకు తల్లులను ప్రోత్సహించడం జరుగుతుందన్నారు.
1వ తరగతి నుండి 12వ తరగతి వరకు
ప్రతి కుటుంబంలో ఎంతమంది పిల్లలు చదువుతున్నా అందరికీ ఈ పథకం వర్తిస్తుందన్నారు. ఈ పథకం ద్వారా ఒక్కొక్కరికి 13 వేల రూపాయలు చొప్పున మంజూరు చేయడం జరిగిందన్నారు. మహిళల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని స్త్రీ శక్తి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించడం జరిగిందన్నారు. డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజన పథకం ద్వారా విద్యార్థులకు నాణ్యమైన భోజనం ఇవ్వడం జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా మంత్రివర్యులు ఉపాధ్యాయులు అందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీతలకు సన్మానం
జిల్లా వ్యాప్తంగా 48 మంది ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీతలను రాష్ట్ర న్యాయ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ ఎం డి ఫరూక్, జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా, లు స్కత్కరించి, జ్ఞాపికా ప్రశంస పత్రం అందజేశారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఉపాధ్యాయులందరికీ పేరుపేరునా ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో అధికారులు, డిప్యూటీ డిఈఓలు, మండల విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయ సంఘ నేతలు, ఉపాధ్యాయులు, ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.
