భారీగా పతనమైన టమాట
భారీగా పతనమైన టమాట
- రూ. 8రూపాయలుకే కేజీ..
- గిట్టుబాటు లేక రైతుల ఆవేదన
- రైతులను నట్టేట ముంచుతున్న దళారులు
- నిమ్మకి నీరెత్తినట్లు కూర్చున్న సంబంధించిన అధికారులు
ప్యాపిలి, సెప్టెంబర్ 05 (పీపుల్స్ మోటివేషన్):-
ప్యాపిలి మండలకేంద్రంలో గత 18 సంవత్సరాల నుండి
రాయలసీమలోనే నెంబర్ వన్ స్థానం సంపాదించిన టమోటా మార్కెట్ గతంలో గుంటూరు, హైదరాబాద్,బెంగళూరు అలాంటి ప్రాంతాలకు వెళ్లే రైతులు ప్యాపిలి పట్టణంలో మార్కెట్ ఏర్పడ్డాక ఇక్కడే అమ్మకాలు కొనసాగిస్తున్నారు కానీ ఏమి ఎరుగని రైతులతో కష్టపడి పెట్టుబడి పెట్టి పండిస్తున్న రైతులను.. దళారులు మో సాలకు పాల్పడుతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు . కొండెక్కిన రేట్లతో సామాన్యుడ్ని నెలలపాటు ముప్పుతిప్పలు పెట్టిన టమాటా ధర.. అమాంతం పడిపోయింది. ఒకానొక టైంలో కేజీ 300 దాకా చేరుకుని చుక్కలు చూపించింది. అయితే, ఊహించినట్లుగా.. ధరలు పడిపోతూ వస్తున్నాయి. ఈ క్రమంలో... ఒక్కసారిగా ధరలు నేలకు పడిపోయాయి. నిత్యావసర సరకుల్లో ఒకటైన టమాటా ధరలు సాధారణ స్థాయికి చేరుకున్నాయి. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో కిలో టమాటా ధర రూ. 50 లోపుకి చేరుకుంది. చాలా చోట్ల కేజీకి రూ.15, రూ.20 ఇలా దొరుకుతోంది కూడా. హైదరాబాద్లోనూ కేజీ రూ.20 దాకా పలుకుతోంది. అయితే.. టమాట మార్కెట్ యార్డ్ కేజీ టమాట రూ. 8రూపాయలు పలుకుతోంది. గిట్టుబాటు ధర లేకపోవడంతో రైతుల ఆవేదన చెందుతున్నారు. సరఫరాలో అంతరాయం కలగడం, టమాటాను ఎక్కువగా సాగుచేసే ప్రాంతాల్లో ప్రతికూల వాతావరణం ఏర్పడటంతో ఆ మధ్య అన్ని ప్రధాన నగరాల్లో టమాటాలు సెంచరీని దాటేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికైనా టమోటా పండించే రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వెంగళాంపల్లి ,ప్యాపిలి... రైతు వేల్పుల సుధాకర్ ఆవేదన
గత నెల రోజుల నుంచి దళారులు. టమోటో మార్కెట్లో టమోటాలు విక్రయిస్తున్నారు. విక్రయిస్తున్న రోజు నుంచి వేలంపాటలో 80బాక్సులు గాను 16బాక్సులు తీసివేసి 64 బాక్సులకు వేలం పాట పాడుతారు. వేలం పాడిన అమౌంటులో 500రూపాయలకు గాను 50రూ తగ్గించి450రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ఇన్ని రోజులు సర్దుకున్నారు కానీ శుక్రవారం రోజు రైతువి కనీసం 60 రూపాయల కన్నా తీసుకోకుండా సరుకు ను వెనక్కి తీసుకువెళ్లాలి అని చెప్పడం జరిగింది. రైతు కోపం తట్టుకోలేక బాధపడుతూ ఇన్నాళ్లు చేసిన దోపిడీ కన్నా ఈరోజు 60, 70 రూపాయలు ఏమీ తక్కువ ఏం కాదని, రైతు గొడవపడి టమోటా పండ్లను మార్కెట్లోనే కింద పడి వేయడం జరిగింది. మార్కెట్ యాజమానులు తో పాత్రికేయులు ఈ విషయాన్ని గమనించి కనీసం రవాణా, కూలి ఖర్చులైనా ఇప్పిస్తారని. పాత్రికేయులకు రైతు ఆవేదన.. విన్నపించుకుంటున్నానుఅని బోరున ఏడుస్తున్నారు.
