అంగన్వాడీ కేంద్రాలు అన్ని అంశాల పురోగతిలో ముందుండాలి
అంగన్వాడీ కేంద్రాలు అన్ని అంశాల పురోగతిలో ముందుండాలి
- ప్రతినెలా కరెక్ట్ సమయానికి అంగన్వాడి సెంటర్లో ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ జరగాలి
- టీనేజ్ ప్రెగ్నెన్సీలో బాగా తగ్గించాలి
- బాల్య వివాహాలు జరగకుండా విరివిగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి
శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ శ్యాం ప్రసాద్
పుట్టపర్తి, సెప్టెంబరు 26:
అంగన్వాడి కేంద్రాలలో జరిగే అన్ని పురోగతిని చూపి జిల్లాను ముందంజలో ఉండేలా ప్రగతిని చూపాలని జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్ ఐసిడిఎస్ అధికారులను ఆదేశించారు.
శుక్రవారం స్థానిక కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాల్ నందు జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్ అధ్యక్షతన మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖపై సమీక్ష సమావేశం నిర్వహించారు.
తొలుత కార్యక్రమంలో ఐసీడీఎస్ పీడీ ప్రమీల పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మహిళాభివృద్ధి సంక్షేమ శాఖ ప్రగతిని కలెక్టర్ కు వివరించారు. సీడీపీఓలు, అనుబంధ విభాగాల సిబ్బంది హాజరయ్యారు. కలెక్టర్ శ్యాంప్రసాద్ మాట్లాడుతూ అంగన్వాడి కేంద్రాలలో ఉన్న అన్ని అంశాల పురోగతిలో ముందుండాలని, ప్రగతిని చూపాలని అన్నారు. బాధ్యతగా పనిచేయాలని కచ్చితంగా క్షేత్రస్థాయి పర్యటనలు చేయాలని సిడిపిఓ లకు సూపర్వైజర్లకు ఆదేశించారు. అంగన్వాడి కేంద్రాలలో వచ్చు పిల్లలకు చదువు చెప్పి సమయానికి ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ చేయాలని అన్నారు. పౌష్టిక ఆహారం సరఫరాలో ఏవైనా నోట్లు పాట్లు ఉంటే వెంటనే సరి చేయాలని అన్నారు. అంగన్వాడి కేంద్రాలపై సిడిపిఓలు సూపర్వైజర్లకు శిక్షణ ఇవ్వాలని అన్నారు. అంగన్వాడి కేంద్రాలలో నీటి వసతిని కల్పించాలని అన్నారు. అంగన్వాడి కేంద్రాలను తరచూ సందర్శించి పర్యవేక్షించాలని అన్నారు. అవ్వ అంగన్వాడి కేంద్రాలలో ఉద్యాన మొక్కలను నాటి పెంచాలని పిల్లలకు మంచి కూరగాయల కూరలను పంపిణీ చేయాలని పౌష్టిక ఆహారాన్ని అందించాలని అన్నారు. తప్పక హాజరు ను పర్యవేక్షించాలని అన్నారు ఎక్కువ శాతం హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ విషయంలో ప్రతినెల కరెక్ట్ సమయానికి అంగన్వాడి సెంటర్లో ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ జరగాలని, ప్రతి సెంటర్ నందు ఆకుకూరలను వెజిటబుల్స్ ను పెంచేలాగా చర్యలు తీసుకోవాలని సూచించారు అంతేకాకుండా ప్రతి ఐసిడిఎస్ సూపర్వైజర్లు అంగన్వాడి వర్కర్స్ తల్లిదండ్రులకు పిల్లలకు న్యూట్రిషన్ ఫుడ్ యొక్క ఆవశ్యకతను తల్లిదండ్రులకు తెలియజేయాలని, అంతేకాకుండా బాల్య వివాహాలు జరగకుండా విరివిగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని మరియు టీనేజ్ ప్రెగ్నెన్సీలో బాగా తగ్గించాలని తెలియజేశారు. ప్రతినెల మహిళాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ పైన సమీక్ష సమావేశం జరుగుతుందని, సమీక్షించడం జరుగుతుందని తెలియజేశారు.
