జిల్లాలో వర్షాల నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తం కావాలి
జిల్లాలో వర్షాల నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తం కావాలి
- ఎలాంటి ప్రమాదాలు జరుగకుండా ముందస్తు చర్యలు చేపట్టండి
- రిజర్వాయర్లు,చెరువులు,వంకలు, వాగులు, లోతట్టు ప్రాంతాలు, పాత బ్రిడ్జి లు పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలి
- రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు సమన్వయంతో పనిచేయాలి
- జిల్లా కలెక్టర్ పి. రంజిత్ బాషా
కర్నూలు, సెప్టెంబర్ 11 (పీపుల్స్ మోటివేషన్):-
జిల్లాలో అధికంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తం కావాలని జిల్లా కలెక్టర్ పి. రంజిత్ బాషా ఆదేశించారు.
జిల్లాలో వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై గురువారం సబ్ కలెక్టర్ ఆర్డీవోలు తహసీల్దార్లు, ఎంపిడిఓ లు, ఇరిగేషన్ అధికారులతో జిల్లా కలెక్టర్ టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గూడూరు,మద్దికెర, చిప్పగిరి, హాలహర్వి, నందవరం, పెద్ద కడుబూరు మండలాల్లో వర్షం అధికంగా కురిసిందని, రాబోయే సి.బెలగల్, గూడూరు, చిప్పగిరి మండలాల్లో వర్షం వచ్చే సూచనలు ఉన్నాయని, ఆయా మండలాల అధికారులు అప్రమత్తమై, ముందు జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.. అదే విధంగా కలెక్టరేట్, డివిజన్,మండల హెడ్ క్వార్టర్ లలో కంట్రోల్ రూమ్ లు ఏర్పాటు చేసుకొని, పరిస్థితి నియంత్రణ లో ఉండేలా పర్యవేక్షించాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు.
ఇరిగేషన్ అధికారులు బ్రిడ్జి లను తనిఖీ చేసి ఎక్కడైనా ఓవర్ ఫ్లో ఉంటే, వెంటనే సమాచారం ఇవ్వాలని కలెక్టర్ ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు.. హెచ్ఎన్ఎస్ఎస్ కెనాల్, గాజులదిన్నె ప్రాజెక్టు కింద ఉన్న మండలాల ఇరిగేషన్ ఏఈ లు, విఆర్ఓ లు జాయింట్ టీమ్ గా ఏర్పడి స్ట్రక్చర్ లను తనిఖీ చేసి ఏమైనా మరమ్మతులు ఉంటే రిపోర్ట్ చేయాలని, అదే విధంగా అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు..వంకలు, వాగుల వద్ద, హంద్రీ నీవా కాలువలు ఉన్న మండలాల్లో నీటి ప్రవాహం అంశంలో అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. నిన్నటి నుండి ఎక్కువ శాతం వర్షపాతం నమోదైన నేపథ్యంలో మంత్రాలయం, మద్దికెర, గూడూరు, నందవరం, చిప్పగిరి, మండలాల తహసీల్దార్ లతో చర్యలు తీసుకుంటున్నారు అనే వివరాలను కలెక్టర్ సబ్ కలెక్టర్, ఆర్డీవో లను అడిగి తెలుసుకున్నారు.ఆదోని, కర్నూలు, పత్తికొండ డివిజన్ లలో తీసుకుంటున్న చర్యల గురించి సబ్ కలెక్టర్, ఆర్డీవోలు కలెక్టర్ కు వివరించారు.
గూడూరు పెంచికలపాడు మధ్య ఉన్న వక్కెర వాగు ప్రవహిస్తున్నప్పటికీ ఎపీఎస్ఆర్టీసీ డ్రైవర్ వినకుండా అలాగే వెళ్ళడంతో బస్ మధ్యలో ఇరుకుపోయిందని తహసీల్దార్ తెలుపడంతో, సంబంధిత డ్రైవర్ మీద తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఎపీఎస్ఆర్టీసీ ఆర్ఎం ను ఆదేశించారు.. అలా వెళ్లకుండా డ్రైవర్ లకు ఆదేశాలు జారీ చేయాలని కలెక్టర్ ఎపీఎస్ఆర్టీసీ ఆర్ఎం ను ఆదేశించారు..
ఎర్లీ ఖరీఫ్ లో పంట వేసి 100 రోజులు పూర్తయి, 15 రోజులు ఆరబెట్టిన ఉల్లి పంట మాత్రమే మార్కెట్ కి తీసుకొని రావాలనే విషయాన్ని రైతులకు చెప్పాలని కలెక్టర్ తహసిల్దార్ లను ఆదేశించారు... ఆ మేరకు వెరిఫై చేసి సర్టిఫికేషన్ ఇవ్వాలని కలెక్టర్ హార్టికల్చర్ అధికారులను ఆదేశించారు.. పంటను తొందరగా తీసివేయకుండా బాగా పంట చేతికి వచ్చిన తర్వాత ఆరబెట్టుకుని తీసుకుని వస్తే మంచి రేటు వస్తుందనే విషయాన్ని వారికి తెలియచేయాలని కలెక్టర్ తహసిల్దార్ లను ఆదేశించారు.. ఆదోని సబ్ కలెక్టర్, కర్నూలు, పత్తికొండ ఆర్డీఓ లు ఈ అంశాన్ని పర్యవేక్షించాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు..
వచ్చే శని, ఆదివారాల్లో కర్నూలు మార్కెట్ యార్డ్ కు సెలవు ప్రకటించినందున జిల్లాలో ఉల్లి పండించిన రైతుకు తమ పంటను తాడేపల్లి గూడెం మార్కెట్ యార్డ్ కు తరలించాలని, తాడేపల్లి గూడెం మార్కెట్ యార్డ్ లో కూడా రాష్ట ప్రభుత్వం ఉల్లికి రూ.1200 మద్దతు ధర కల్పించిందని ఈ విషయాన్ని రైతులకు తెలియచేయాలని కలెక్టర్ తహసీల్దార్ లను ఆదేశించారు..
టెలి కాన్ఫరెన్స్ లో జాయింట్ కలెక్టర్ డా.బి.నవ్య, సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ ఆర్డీవోలు సందీప్ కుమార్, భరత్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.