రైతులకు జాయింట్ కలెక్టర్ విజ్ఞప్తి
రైతులకు జాయింట్ కలెక్టర్ విజ్ఞప్తి
- వచ్చే శని ఆదివారాల్లో కర్నూలు మార్కెట్ యార్డ్ కు సెలవు ప్రకటించినందున ఉల్లిని తాడేపల్లి గూడెం మార్కెట్ యార్డ్ కు తరలించండి
- తాడేపల్లి గూడెం మార్కెట్ యార్డ్ లో కూడా రాష్ట ప్రభుత్వం ఉల్లికి రూ.1200 మద్దతు ధర కల్పించింది
- ఉల్లి పంట పక్వానికి వచ్చిన తర్వాత మాత్రమే కోయాలి
- రైతులకు జాయింట్ కలెక్టర్ డా.బి.నవ్య విజ్ఞప్తి
కర్నూలు, సెప్టెంబర్ 11 (పీపుల్స్ మోటివేషన్):-
వచ్చే శని, ఆదివారాల్లో కర్నూలు మార్కెట్ యార్డ్ కు సెలవు ప్రకటించినందున జిల్లాలో ఉల్లి పండించిన రైతుకు తమ పంటను తాడేపల్లి గూడెం మార్కెట్ యార్డ్ కు తరలించాలని, తాడేపల్లి గూడెం మార్కెట్ యార్డ్ లో కూడా రాష్ట ప్రభుత్వం ఉల్లికి రూ.1200 మద్దతు ధర కల్పించిందని జాయింట్ కలెక్టర్ డా.బి.నవ్య ఒక ప్రకటనలో తెలిపారు.
రైతులు తమ ఉల్లి పంటను తాడేపల్లి గూడెం మార్కెట్ కు తీసుకుని వెళ్ళేటపుడు ఆధార్, బ్యాంక్ పాస్ బుక్, ఈ క్రాప్ నమోదు ఒరిజినల్ సర్టిఫికెట్, పొలం పాసు పుస్తకం తీసుకువెళ్లాలని జాయింట్ కలెక్టర్ రైతులకు విజ్ఞప్తి చేశారు.
అలాగే మే నుండి జూన్ 15 వ తేదీ వరకు ఉండి, పక్వానికి వచ్చిన ఉల్లి పంట ను మాత్రమే కోయాలని జేసీ సూచించారు. జూలై లో వేసిన పంటను అక్టోబర్ వరకు వేచి ఉండి కోరాలని సూచించారు. పొలంలో కనీసం వంద రోజులు ఉండాలని, కోసిన తర్వాత బాగా ఆరబెట్టుకుని, గ్రేడింగ్ చేసి మార్కెట్ కు తీసుకువస్తే పంటకు మంచి ధర వస్తుందని, ముందే కోయడం వల్ల ఉల్లి నాణ్యతగా ఉండదని, తద్వారా మార్కెట్లో సరైన ధర లభించదని జాయింట్ కలెక్టర్ రైతులకు సూచించారు.