యూరియా సరఫరాలో అక్రమాలు జరిగితే కేసులు నమోదు చేయండి
యూరియా సరఫరాలో అక్రమాలు జరిగితే కేసులు నమోదు చేయండి
జిల్లా కలెక్టర్ టి.ఎస్.చేతన్
పుట్టపర్తి, సెప్టెంబర్ 07 : యూరియా సరఫరాలో అక్రమాలు జరిగినా, నిర్దేశిత ధరాలకన్నా అధిక ధరలకు విక్రయించినా 6A కేసులు నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ టి.ఎస్.చేతన్ సంబంధిత అధికారులను ఆదేశించారు.
ఆదివారం స్థానిక కలెక్టర్ కార్యాలయంలోని మినీ కాన్ఫరెన్స్ హాలులో, జిల్లా కలెక్టర్ టి.ఎస్. చేతన్ యూరియా స్టాక్ , సరఫరా, తదితర అంశాలపై ఆర్డీవోలు, ఏడీఏలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ..యూరియా సరఫరాలో అక్రమాలు జరిగితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. నిర్దేశిత ధరాలకన్నా అధిక ధరలకు విక్రయించినట్లు వార్తలు వస్తున్నాయని, దీనిపై విచారణ చేసి 6A కేసులు నమోదు చేయాలన్నారు.
ఆర్టీవోలు, ఏడీఏలు క్షేత్రస్థాయిలో పర్యటించి ఆర్ఎస్కేల వారీగా పంట నమోదు వివరాలు సేకరించి అందులో యూరియా వేయుపంటలకు ఎంత విస్తీర్ణంలో ఎంత మోతాదులో వేయాలో రైతులకు అవగాహన కల్పించాలన్నారు. రోజువారీగా రాబోవు 30 రోజులకు యూరియా సరఫరా పై ప్రణాళిక సిద్ధం చేయాలన్నారు.
యూరియా నిల్వలు ఆర్ఎస్కేకు రాకముందే ఆ గ్రామంలో ముందుగా రైతులకు సమాచారం అందించి ఎంత మోతాదు వస్తున్నది ఎంత మంది రైతులకు సరిపోతుందని తెలియజేసి ముందుగా అవసరం ఉన్న రైతులకు టోకెన్ల వారిగా పంపిణీ చేయాలి.ఈ పంపిణీ అంతా వ్యవసాయ అధికారులు దగ్గర ఉండి పర్యవేక్షించాలన్నారు.
ప్రస్తుతం స్టాక్ ఎంత ఉంది..ఆ స్టాక్ ను ఎంతమందికి సరఫరా చేయగలం అనే ప్లాన్ ముందుగానే అధికారులు రూపొందించుకోవాలన్నారు. ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం లిమిటెడ్ (PACS) కేంద్రాలనుండి IFMS పోర్టల్ నందు తప్పకుండా ప్రభుత్వం నిర్దేశించిన వివరాలను నమోదు చేయాలన్నారు. డిమాండ్ ..సప్లై మేరకు వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. ఇందుకు ఆర్డీవోలు, వ్యవసాయ అధికారులు ప్రణాళికాబద్దంగా పనిచేయాలన్నారు.
