టేక్ హోమ్ రేషన్ పంపిణీ మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించాలి
టేక్ హోమ్ రేషన్ పంపిణీ మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించాలి
ఏలూరు, సెప్టెంబరు,03:
మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సప్లిమెంటరీ న్యూట్రిషన్ ప్రోగ్రాం బాల సంజీవని కార్యక్రమాలపై జిల్లా స్థాయి / ఐ.టి.డి.ఏ. స్థాయి మానిటరింగ్ అండ్ రివ్యూ కమిటీ సమావేశం బుధవారం స్థానిక కలెక్టరేట్, జాయింట్ కలెక్టర్ వారి చాంబర్ లో నందు జాయింట్ కలెక్టర్ , ఎస్ఎన్పి కమిటీ చైర్ పర్సన్ పి.దాత్రిరెడ్డి వారి అధ్యక్షతన జరిగింది. ప్రాజెక్ట్ స్థాయిలో మరియు అంగన్వాడి కార్యకర్తలు, లబ్దిదారులకు టేక్ హోమ్ రేషన్ పంపిణీ మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించాలని, సకాలంలో డెలివరీ మరియు జవాబు దారీతనం ఉండేలా చూడాలని ప్రాజెక్ట్ డైరెక్టర్ , సిడిపివోలను జాయింట్ కలెక్టరు ఆదేశించారు. గుడ్లు, కిట్లు, పాల సరఫరా స్థితి మరియు నాణ్యతనను సమీక్షించారు. ప్రతీ నెలా గుడ్లు, బాల సంజీవని కిట్లు మరియు పాల మూడు గోడౌన్ లను పి.డి., మరియు సి.డి.పి.ఓ.లు సందర్శించి, సందర్శన రిమార్కులను గోడౌన్ నందు ఉంచిన రిజిష్టర్ నందు నమోదు చేయాలన్నారు. సరఫరా చేయబడిన కోడిగుడ్ల కలర్ స్టాంపింగ్ కలిగి ఉండాలని, సాంద్రత, తాజాదనం తెలుసుకొనుటకు
కోడిగుడ్లను నీటిలో వేసి నాయిడ నిర్ధారించాల న్నారు. పాలు, బాలసంజీవని కిట్లు ప్యాకింగ్, ఆహార భద్రత మరియు ప్రమాణాల నిబంధనల ప్రకారము ఉండాలని ఆదేశించారు. అంగన్వాడి కేంద్రాలకు సరఫరా చేయబడిన కలర్ కోడ్ స్టాంపు లేని కోడి గుడ్లను అంగన్వాడి కార్యకర్తలు స్టాకు తీసుకునే క్రమంలో తిరస్కరించాలన్నారు.
ఐ.టి.డి.ఎ. పివో చిన్న సైజు గుడ్లు సరఫరా అవుతున్నాయని జాయింట్ కలెక్టర్ వారి దృష్టికి తేగా ఈ విషయమై జాయింట్ కలెక్టర్ స్పందిస్తూ ప్రతి గుడ్డు 50 గ్రా.లు. బరువు ఉండాలని , మరియు వేయింగ్ మిషన్ లు లీగల్ మెట్రాలజీ డిపార్ట్మెంటు వారు సీల్ వేసిన మిషన్లు మాత్రమే కోడి గుడ్డు బరువు ప్రమాణాలను నిర్దేశించటానికి వాడాలని దిశ నిర్దేశాలు జారీ చేసారు. ప్రాజెక్ట్ డైరెక్టర్ మరియు సి.డి.సి.ఓ.లు తప్పనిసరిగా ప్రతీ అంగన్వాడి సెంటర్ ను సందర్శించాలని, ఆహార పంపిణీ మార్గ దర్శకాలను, నాణ్యతా ప్రమాణాలను సందర్శన సమయంలో పరిశీలించాలని ఆదేశించారు.
ఈ సమావేశంలో ఐటిడిఏ పివో కె.రాములు నాయక్, ఐసీడీఎస్ పిడి పి.శారద, జిల్లా పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ శివరామమూర్తి, డిఎస్ వో విల్సన్, సిడిపిఓ లు తదితరులు పాల్గొన్నారు.