తెలంగాణ పునర్నిర్మాణంలో మీరందరూ భాగస్వామ్యం కావాలని
తెలంగాణ పునర్నిర్మాణంలో మీరందరూ భాగస్వామ్యం కావాలని
-రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి
ఆదివారం శిల్పకళా వేదికలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి లైసెన్స్డ్ సర్వేయర్ లుగా శిక్షణ పొందిన సర్వేయర్లకు లైసెన్స్ లు అందజశారు.
ఈ సందర్భంగా సిఎం మాట్లాడుతూ తెలంగాణలో ప్రతీ పోరాటం భూమి చుట్టూనే జరిగిందని, భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం నాడు నాటి సాయుధ రైతాంగ పోరాటం జరిగిందని తెలిపారు. భూమిని కన్న తల్లిలా మనమంతా సాధిస్తామని, భూ యజమానుల హక్కులను కాపాడి, భూ సరిహద్దులను నిర్ణయించే బాధ్యత మీపై పెట్టబోతున్నామన్నారు.
మీరు తప్పు చేస్తే మీకే కాదు.. ప్రభుత్వానికి కూడా చెడ్డపేరు వస్తుందని, అందుకే ప్రతీ ఒక్కరు బాధ్యతగా పని చేయాలని ఆయన అన్నారు.
గత ప్రభుత్వంలో తెచ్చిన ధరణి చట్టం కొద్ది మందికే చుట్టంగా మారిందని, అధికారంలోకి వచ్చాక ధరణి దరిద్రాన్ని వదిలిస్తామని ఆనాడు మేం మాట ఇచ్చాం
ఇచ్చిన మాట ప్రకారం అధికారంలోకి రాగానే ధరణి భూతం నుంచి విముక్తి కల్పించామని తెలిపారు.
పదేళ్లుగా ఉద్యోగ నియామకాలపై గత పాలకులు నిర్లక్ష్యం వహించారు. ప్రజా ప్రభుత్వంలో ఉద్యోగ నియామక ప్రక్రియను చేపట్టి నిరుద్యోగుల కళ్లల్లో ఆనందం చూస్తున్నామని అన్నారు.
2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్ధిక వ్యవస్థగా తెలంగాణను తీర్చిదిద్దడమే మా లక్ష్యం, ఆ దిశగా ముందుకెళ్లేందుకు మీ సహకారం ఉండాలి అని తెలిపారు. రైతే దేశానికి వెన్నెముక, అలాంటి రైతుకు అండగా ఉండండి, తెలంగాణ అభివృద్ధిలో మీరు భాగస్వాములు కావాలని ఆయన అన్నారు.
మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ శిక్షణ పొందిన 3456 మంది సర్వేయర్లకు నేడు లైసెన్స్ అందించడం జరుగుతుందని, మీ యొక్క విధులు ఎలాంటి అవకతవకలు జరగకుండా, చిత్త శుద్ధితో పని చేయాలని, ప్రజాపాలన లో మీరంతా మంచిగా పని చేసి రెవెన్యూ శాఖకు మంచి పేరు తీసుకురావాలని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో చీఫ్ విప్ పట్నం మహెందర్ రెడ్డి, పరిశ్రమల సంస్థల ఛైర్మన్ నిర్మల దేవి, శాసన సభ్యులు అరికెపూడి గాంధీ, మందులు సామెల్, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి,జిహెచ్ఎంసి మేయర్ గద్వాల విజయలక్ష్మి, జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.