జిల్లాలో ప్రధానమంత్రి పర్యటన విజయవంతం
జిల్లాలో ప్రధానమంత్రి పర్యటన విజయవంతం
- అధికారులను అభినందించిన జిల్లా కలెక్టర్
- ఒక అబ్బాయి చనిపోవడం బాధాకరం
జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి
కర్నూలు, అక్టోబర్ 18: జిల్లాలో ప్రధానమంత్రి పర్యటన విజయవంతం చేశారని, గ్రామ స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు అధికారులందరూ కష్టపడి పని చేశారని జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి అధికారులను అభినందించారు.
శనివారం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించిన జిల్లా అధికారులతో నిర్వహించిన సమావేశంలో ప్రధానమంత్రి పర్యటన విజయవంతం అయిన నేపథ్యంలో కలెక్టర్ మాట్లాడారు.
జిల్లాలో ప్రధానమంత్రి పర్యటన సందర్భంగా ఏర్పాట్లు బాగా చేశారని ముఖ్యమంత్రి, ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు అందరూ అభినందిస్తున్నారని తెలిపారు..ఇందుకోసం కృషిచేసిన అధికారులు అందరికీ అభినందనలు అని కలెక్టర్ తెలిపారు.
సీపీఓ పీపీటీ లు బాగా చేశారని, ఆర్ అండ్ బి ఎస్ ఈ హెలిపాడ్, రోడ్ల నిర్మాణం, బారికేడింగ్ తదితర ఏర్పాట్లు బాగా చేశారని, అలాగే కర్నూలు ఆర్డీఓ బాగా సమన్వయం చేశారని, అలాగే పత్తికొండ ఆర్డీఓ, కర్నూలు అర్బన్, రూరల్, కల్లూరు తహసీల్దార్లు అకామడేషన్ కల్పించడం లో బాగా కృషి చేశారని కలెక్టర్ ప్రత్యేకంగా అభినందించారు. అలాగే ఆర్టీసీ ఆర్ఎం, డిటిసి లు బస్సులు ఏర్పాటు చేయడం లో మంచి చర్యలు తీసుకున్నారని, అలాగే డిఆర్వో కూడా నిరంతరం అందుబాటు లో ఉండి ఎప్పటికప్పుడు అధికారులకు విధులు కేటాయిస్తూ ప్రొసీడింగ్స్ ఇచ్చారని, డిపివో పారిశుధ్యం బాగా నిర్వహించారని కలెక్టర్ అభినందించారు. అలాగే పార్కింగ్ ఇంచార్జి లు హౌసింగ్ పిడి, ఇరిగేషన్ ఎస్ ఈ, హంద్రీనీవా ఎస్ ఈ, పంచాయతీరాజ్ ఎస్ ఈ, డిఇఓ, ఏపీఎస్పీ డీసీఎల్, మున్సిపల్ కమిషనర్లు, ఐ అండ్ పి ఆర్, డిప్యూటీ కలెక్టర్లు, తహసీల్దార్లు, ఎంపిడిఓ లు, ఐఏఎస్ అధికారులకు నియమించిన లైజన్ ఆఫీసర్లు అందరూ బాగా పని చేశారని కలెక్టర్ అధికారులందర్నీ అభినందించారు.
ప్రధానమంత్రి పర్యటన ప్రోగ్రాం స్పెషల్ ఆఫీసర్ వీర పాండియన్ మంచిగా మార్గదర్శకత్వం చేశారని కలెక్టర్ పేర్కొన్నారు.
ఒక అబ్బాయి చనిపోవడం బాధాకరం
పర్యటన లో ఒక అబ్బాయి చనిపోవడం బాధాకరం అని కలెక్టర్ ఆవేదన వ్యక్తం చేశారు.. ఈ సంఘటన దురదృష్టకరం అని, ఇలా జరిగి ఉండకూడదని బాధను వ్యక్తం చేశారు.
సమావేశంలో డీఆర్వో వెంకట నారాయణమ్మ, జిల్లా అధికారులు పాల్గొన్నారు.