సంక్షేమ వసతి గృహాలలో విద్యార్థులకు అన్ని సౌకర్యాలు ఉండాలి
సంక్షేమ వసతి గృహాలలో విద్యార్థులకు అన్ని సౌకర్యాలు ఉండాలి
జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి
కర్నూలు,అక్టోబర్ 18 :- సంక్షేమ వసతి గృహాలలో విద్యార్థులకు అన్ని సౌకర్యాలు ఉండాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి అధికారులను ఆదేశించారు.
శనివారం జిల్లా కలెక్టర్ ఛాంబర్ లో సంక్షేమ శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. సంక్షేమ వసతి గృహాలలో విద్యార్థులకు ఉండవలసిన వసతుల పై జిల్లా కలెక్టర్ పలు సూచనలు జారీ చేశారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ...వసతి గృహాలలో విద్యార్థులకు పౌష్టికాహారము, సరైన గదులు, బాత్రూమ్స్, టాయిలెట్స్ తో పాటు మంచి వాతావరణం ఉండాలన్నారు. అవసరమైన అదనపు గదులు, టాయిలెట్ల నిర్మాణాలు లేదా మరమ్మత్తులకు సంబంధించిన ప్రతిపాదనలు పంపాలని కలెక్టర్ ఆదేశించారు. వసతి గృహాలలో నిరంతరం కరెంటు సౌకర్యం , నీటి సదుపాయం ఉండాలన్నారు.. నీటి ట్యాంకులను 15 రోజులకు పరిశుభ్రం చేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. వసతి గృహాలకు సరఫరా చేసే నీటి నమూనాలను సేకరించి పరీక్షలు ఆర్డబ్ల్యూఎస్ శాఖ ఇంజనీర్ ను ఆదేశించారు. వసతి గృహాలలో రాత్రులలో అవసరమైన వెలుతురు ఉండే విధంగా లైట్లు, వసతి గృహాల పరిసరాలలో వీధి దీపాలు, పరిసరాలలో సీసీ కెమెరాల ఏర్పాటుతో పాటు పిచ్చి మొక్కలు లేని విధంగా పరిసరాలు పరిశుభ్రంగా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
వసతి గృహాలకు అవసరమైన మరమ్మతులు, నిర్మాణాలకు సొంత శాఖల ద్వారా నే కాకుండా సి ఎస్ ఆర్ ఫండ్స్ రూపంలో, ఎంపీ లాడ్స్ ద్వారా కూడా చేపట్టేలా తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.
సమావేశంలో సాంఘిక సంక్షేమ శాఖ జెడి రాధిక , బీసీ సంక్షేమ శాఖ అధికారి ప్రసూన , సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ హాస్టల్స్ కోఆర్డినేటర్ శ్రీదేవి, మైనార్టీ వెల్ఫేర్ అధికారి సబీహ పర్వీన్ ,డీఈవో శామ్యూల్ పాల్ , ఇన్ఫ్రాస్ట్రక్షన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నాగిరెడ్డి, అడిషనల్ చైల్డ్ డెవలప్మెంట్ అధికారి రేవతి జోత్స్న , ఆర్డబ్ల్యూఎస్ డీఈ అమల, ఏపీ రెసిడెన్షియల్ స్కూల్స్ కోఆర్డినేటర్ పుష్పరాజ్ , వెల్ఫేర్ శాఖల సూపరింటెండెట్ లు పాల్గొన్నారు.