భారత్-రష్యా బంధానికి బౌద్ధ దౌత్యం: రష్యాలోని కల్మికియాలో బుద్ధుడి అవశేషాల ప్రదర్శన..
భారత్-రష్యా బంధానికి బౌద్ధ దౌత్యం: రష్యాలోని కల్మికియాలో బుద్ధుడి అవశేషాల ప్రదర్శన..
భారతదేశం యొక్క "సాఫ్ట్ పవర్" మరియు సాంస్కృతిక దౌత్యంలో భాగంగా గౌతమ బుద్ధుని పవిత్ర అవశేషాలను రష్యాలోని బౌద్ధులు అధికంగా ఉన్న ప్రాంతంలో ప్రదర్శన కోసం పంపారు.
ఈ కార్యక్రమానికి 90,000 మందికి పైగా భక్తులు హాజరయ్యారు ఇది ఇరు దేశాల మధ్య సాంస్కృతిక సంబంధాలను బలోపేతం చేయడంలో ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలిచింది.
గౌతమ బుద్ధుని పవిత్ర అవశేషాలను (Holy Relics) భారతదేశం నుండి రష్యాకు ప్రత్యేక ప్రదర్శన కోసం తీసుకెళ్లారు. ఈ అవశేషాలు ఢిల్లీలోని జాతీయ మ్యూజియం (National Museum) లో భద్రపరచబడి ఉన్నాయి.
భారత వాయుసేన (IAF)కు చెందిన ప్రత్యేక విమానంలో ఈ అవశేషాలను తరలించారు. ఇది ఈ కార్యక్రమానికి భారత ప్రభుత్వం ఇచ్చిన ఉన్నత స్థాయి ప్రాధాన్యతను సూచిస్తుంది.
రష్యాలోని కల్మికియా (Kalmykia) రిపబ్లిక్ రాజధాని అయిన ఎలిస్టా (Elista) నగరంలోని ప్రధాన బౌద్ధ ఆశ్రమం (Monastery).
ఈ కార్యక్రమానికి జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా నేతృత్వం వహించారు.
ఈ ప్రదర్శన రెండు దేశాల (భారత్-రష్యా) ప్రజల మధ్య చారిత్రక మరియు సాంస్కృతిక సంబంధాలను మరింత బలోపేతం చేస్తుందని భారత ప్రతినిధి బృందం పేర్కొంది.
1. పవిత్ర అవశేషాలు (పిప్రాహ్వా స్తూపం)
ఈ అవశేషాలు ఢిల్లీ నేషనల్ మ్యూజియంలో ఉన్న "పిప్రాహ్వా అవశేషాలు" (Piprahwa Relics).
గౌతమ బుద్ధుని మహాపరినిర్వాణం (మరణం) తరువాత, ఆయన అస్థికలను 8 భాగాలుగా విభజించి, 8 రాజ్యాలకు (అజాతశత్రువు, శాక్యులు, కోలియులు మొదలైనవారు) పంచారు.
బుద్ధుని వంశమైన శాక్యులు తమకు దక్కిన భాగాన్ని తమ రాజధాని అయిన కపిలవస్తులో ఒక స్తూపాన్ని నిర్మించి భద్రపరిచారు.
1898లో పురావస్తు శాస్త్రవేత్తలు ఉత్తర ప్రదేశ్లోని పిప్రాహ్వా వద్ద తవ్వకాలు జరిపినప్పుడు, ఒక రాతి పేటికలో ఈ అస్థికలు లభించాయి. ఈ పిప్రాహ్వా ప్రాంతమే నాటి కపిలవస్తు అని చాలా మంది చరిత్రకారులు నిర్ధారించారు.
అందువల్ల ఇవి గౌతమ బుద్ధుని యొక్క అసలైన, అత్యంత ప్రామాణికమైన అవశేషాలుగా (శారీరక ధాతువులు) ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాయి.
2. "సాంస్కృతిక దౌత్యం (Cultural Diplomacy)
ఇది భారతదేశ విదేశాంగ విధానంలో ఒక ముఖ్యమైన భాగం. భారతదేశం తన "సాఫ్ట్ పవర్" (Soft Power)ను ఉపయోగించి అంటే సైనిక లేదా ఆర్థిక బలానికి బదులుగా తన సాంస్కృతిక మరియు చారిత్రక వారసత్వం ద్వారా ఇతర దేశాలతో సంబంధాలను బలోపేతం చేసుకోవడం.
భారతదేశం బౌద్ధమతం పుట్టిన గడ్డ. ఈ ఉమ్మడి బౌద్ధ వారసత్వాన్ని శ్రీలంక, థాయ్లాండ్, జపాన్, మంగోలియా, వియత్నాం మరియు రషయాలోని కొన్ని ప్రాంతాల వంటి దేశాలతో సంబంధాలను పెంపొందించుకోవడానికి భారత్ ఉపయోగిస్తుంది.
ఈ అవశేషాలను రష్యాకు పంపడం అనేది ఈ "బౌద్ధ దౌత్యం"లో ఒక భాగమే. ఇది భారత్-రష్యా మధ్య ఉన్న "ప్రత్యేక మరియు విశేష వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని" (Special and Privileged Strategic Partnership) సాంస్కృతిక కోణంలో మరింత బలోపేతం చేస్తుంది.
3. కల్మికియా రిపబ్లిక్:
కల్మికియా అనేది రష్యన్ ఫెడరేషన్లోని ఒక రిపబ్లిక్ (రాష్ట్రం). ఇది కాస్పియన్ సముద్రం వాయువ్య తీరంలో దక్షిణ రష్యాలో ఉంది.
కల్మికియా ఐరోపా ఖండంలోనే బౌద్ధమతం అధికారిక మతంగా (మెజారిటీ) ఉన్న ఏకైక ప్రాంతం.
ఇక్కడి ప్రజలు (కల్మిక్ ప్రజలు) మంగోలియన్ తెగలకు చెందినవారు మరియు వీరు 17వ శతాబ్దంలో ఈ ప్రాంతానికి వలస వచ్చారు.
వీరు ప్రధానంగా టిబెటన్ బౌద్ధమతాన్ని ఆచరిస్తారు.
అందువల్ల రష్యాలోని మిగతా ప్రాంతాల కంటే కల్మికియాలోని ఎలిస్టా నగరంలో ఈ ప్రదర్శనను ఏర్పాటు చేయడం అత్యంత వ్యూహాత్మకమైన మరియు సాంస్కృతికంగా కీలకమైన నిర్ణయం.
4. జాతీయ మ్యూజియం, న్యూఢిల్లీ (National Museum, New Delhi)
స్థాపన: 1949. ఇది భారత ప్రభుత్వ సాంస్కృతిక మంత్రిత్వ శాఖ (Ministry of Culture) ఆధ్వర్యంలో పనిచేస్తుంది.
ఇది భారతదేశంలో అతిపెద్ద మ్యూజియంలలో ఒకటి. హరప్పా నాగరికతకు చెందిన "డాన్సింగ్ గర్ల్" విగ్రహం, పిప్రాహ్వా బౌద్ధ అవశేషాలు, సూక్ష్మ చిత్రాలు (Miniature Paintings) మరియు అనేక అమూల్యమైన కళాఖండాలకు ఇది నిలయం.