జీఎస్టీ సంస్కరణలు సామాన్యులకు ఒక వరం
General News
Latest news
Fast telugu news
Telugu short news
Telugu intresting news
Intresting facts
Telugu daily updates
Andhra Pradesh
Telangana news
By
Mounikadesk
జీఎస్టీ సంస్కరణలు సామాన్యులకు ఒక వరం
- జీఎస్టీ సంస్కరణలతో మన దేశ ఉత్పత్తులకు ప్రపంచ స్థాయి మార్కెటింగ్ సౌకర్యాలు మరింత మెరుగుపడతాయి
- సూపర్ జీఎస్టీ తో దేశంలో పెరిగిన వస్తువుల అమ్మకాలు
- సూపర్ జీఎస్టీ.. సూపర్ సేవింగ్స్ అవగాహనలో భాగంగా బైక్ ర్యాలీ లో పాల్గొన్న రాష్ట్ర సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారధి
ఏలూరు/నూజివీడు, అక్టోబర్, 19 : జీఎస్టీ సంస్కరణలు కారణంగా మన దేశ ఉత్పత్తులకు ప్రపంచ స్థాయి మార్కెటింగ్ సౌకర్యాలు మరింత మెరుగుపడతాయని రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి చెప్పారు. 'సూపర్ జీఎస్టీ.. సూపర్ సేవింగ్స్ ' కార్యక్రమంలో భాగంగా ఆదివారం నూజివీడు పట్టణంలో ఉత్సాహపూరిత వాతావరణంలో పెద్ద ఎత్తున జరిగిన బైక్ ర్యాలీ లో మంత్రి పార్థసారథి పాల్గొన్నారు. ఈ సందర్భంగా తాను స్వయంగా బైక్ ని నడుపుతూ ప్రజలను మరింత ఉత్సాహ పరిచారు. బైక్ ర్యాలీ నూజివీడు జంక్షన్ రోడ్డులోని పోతిరెడ్డిపల్లి టర్నింగ్ వద్ద గల ఎన్టీఆర్ విగ్రహం నుండి ప్రారంభమై చిన్న గాంధీ బొమ్మ సెంటర్, పెద్ద గాంధీ బొమ్మ సెంటర్ మీదుగా సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు పెద్ద ఎత్తున సాగింది. అనంతరం సబ్ కలెక్టర్ కార్యాలయం సమావేశపు హాలులో జరిగిన కార్యక్రమాన్ని మంత్రి జ్యోతి వెలిగించి ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభ్యలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న మంత్రి పార్థసారధి మాట్లాడుతూ జీఎస్టీ సంస్కరణలు సామాన్యులకు ఒక వరమని, ప్రజల ఆర్థికాభివృద్ధి లక్ష్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జీఎస్టీ సంస్కరణలు తీసుకువచ్చాయన్నారు. ప్రజలకు మేలు జరిగేలా, ప్రజల జీవనవిధానం మెరుగుపడి, ఆర్థికంగా అభివృద్ధితో సంతోషంగా ఉండాలన్నది ఆశయంతో జీఎస్టీ స్లాబులను గణనీయంగా తగ్గించాయన్నారు. జీఎస్టీ సంస్కరణలతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వేల కోట్ల రూపాయలలో నష్టం వచ్చినప్పటికీ, ప్రజలలో కొనుగోలు శక్తి ని పెంచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నాయన్నారు. జీఎస్టీ సంస్కరణల కనరణంగా మనం ఇంట్లో వినియోగించే నిత్యావసర వస్తువులైనా పాలు నుండి వాహనాలు, రైతులు సాగుకు వినియోగించే వస్తువులు, టాక్టర్లు వంటి యంత్ర పరికరాలు, భారీ వాహనాలు లక్షల రూపాయలలో తగ్గాయన్నారు. జీఎస్టీ తగ్గింపుతో ముడిసరుకులు ధరలు తగ్గి, వస్తువులు తయారీ తగ్గడంతో మన దేశ ఉత్పత్తులు తక్కువధరలకే నాణ్యమైన వస్తువులు లభించడంతో ప్రపంచ స్థాయిలో మన ఉత్పత్తులకు మరింత గిరాకీ పెరిగి మార్కెటింగ్ సౌకర్యాలు మరింత పెరుగుతాయన్నారు. ఔషదాలపై 5 శాతానికి జీఎస్టీ తగ్గించడం, కేన్సర్ వంటి దీర్గకాలిక రోగాలకు వాడే ఔషదాలపై జీఎస్టీని పూర్తిగా మినహాయించడంతో వాటిని వినియోగించేవారి ఎంతో స్వాంతన కలుగుతుందన్నారు. అంతేకాక జీవిత, ప్రమాద, ఆరోగ్య భీమాల ప్రీమియంలపై జీఎస్టీ ని పూర్తిగా తొలగించడం జరిగిందన్నారు. వీటిని ప్రజలందరూ పూర్తిగా తెలుసుకునేలా, జీఎస్టీ సంస్కరణల ఫలాలు ప్రతీ కుటుంబానికి అందేలా, వాటిని ప్రజలు సద్వినియోగం చేసుకునేలా వాటిపై ప్రజలకు మరింత అవగాహన కలిగించేందుకు గత నెల రోజుల నుండి వివిధ అంశాలపై గ్రామ/వార్డ్ సచివాలయాలు, రైతు సేవా కేంద్రాలు, పాఠశాలలు, ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించామన్నారు. సూపర్ జీఎస్టీ.. సూపర్ సేవింగ్స్ పై జిల్లాలోని 7 లక్షల కుటుంబాలకు ప్రతీ ఇంటికి వెళ్లి అవగాహన కలిగించడం జరిగిందన్నారు. సూపర్ జీఎస్టీ.. సూపర్ సేవింగ్స్ ను ప్రజలందరూ సద్వినియోగం చేస్తుకుంటున్నారని, నెలరోజుల్లోనే షుమారు లక్ష కోట్ల రూపాయలకు పైగా అమ్మకాలు పెరిగాయన్నారు. పాత జీఎస్టీ ధరలకు వస్తువులను అమ్మే వారిని ప్రజలు ప్రశ్నించాలని, వారిపై ఫిర్యాదు చేస్తే వెంటనే చర్యలు తీసుకుంటామన్నారు.
నూజివీడు సబ్ కలెక్టర్ బొల్లిపల్లి వినూత్న మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న జీఎస్టీ సంస్కరణలపై ప్రజలకు అవగాహన కలిగించేందుకు, జీఎస్టీ ఫలాలు ప్రతీ కుటుంబానికి అందాలన్న లక్ష్యంతో నెల రోజులపాటు అవగాహన కార్యక్రమాలు నిర్వహించామన్నారు. జీఎస్టీ సంస్కరణలతో అన్ని రకాల వస్తువుల ధరలు తగ్గడంతోపాటు ప్రజల కొనుగోలు శక్తి కూడా పెరుగుతుందన్నా
కార్యక్రమంలో జిల్లా పరిషత్ సీఈఓ ఎం. శ్రీహరి, నూజివీడు మునిసిపల్ వైస్ చైర్మన్ పగడాల సత్యనారాయణ, కో ఆప్షన్ మెంబెర్ సిహెచ్. దుర్గ ప్రసాద్, నియోజకవర్గంలోని మండల తహసీల్దార్లు, ఎంపిడిఓలు, టిడిపి పార్టీ నూజివీడు పట్టణ అధ్యక్షులు జగదీశ్, ప్రముఖులు వాసు, ప్రభు, ఆది, ఇళయరాజా, ప్రసాద్, వేణు, వివిధ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
Comments