రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

రైతులకు గుడ్‌న్యూస్....ఈ నెల 19న ‘అన్న దాత సుఖీభవ’-పీఎం కిసాన్‌ నిధుల జమకు రంగం సిద్ధం

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news
Mounikadesk

రైతులకు గుడ్‌న్యూస్....ఈ నెల 19న ‘అన్న దాత సుఖీభవ’-పీఎం కిసాన్‌ నిధుల జమకు రంగం సిద్ధం

  • అర్హ‌త ఉన్న ప్ర‌తి ఒక్క‌ర‌కి అన్నదాత సుఖీభ‌వ పథకం అమ‌ల‌య్యేలా చ‌ర్య‌లు చేప‌ట్టండి
  • అధికారులను ఆదేశించిన రాష్ట్ర వ్య‌వ‌సాయ శాఖ మంత్రి కింజ‌రాపు అచ్చెన్నాయుడు
  • వ్య‌వ‌సాయ శాఖ ముఖ్య కార్య‌ద‌ర్శి, డైరెక్ట‌ర్‌, అన్ని జిల్లాల జేడీల‌తో స‌మీక్ష నిర్వహించిన మంత్రి అచ్చెన్న
  • రైతులు అర్హ‌త వివ‌రాలు ఆన్‌లైన్‌లో సుల‌భ‌తరంగా న‌మోదు చేసుకునే అవ‌కాశం క‌ల్పించాల‌ని ఆదేశం
  • రెండో విడత 5 వేలు.. పీఎం కిసాన్‌ 2 వేలుతో కలిపి మొత్తం 7 వేలు రైతుల ఖాతాల్లో జ‌మ చేయ‌నున్న కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news

టెక్కలి, నవంబర్ 17 :
అన్నదాత సుఖీభవ’ పథకాన్ని ఈ నెల 19న రెండో విడ‌త నిధులు జ‌మ చేయ‌నున్న నేప‌థ్యంలో రాష్ట్ర వ్య‌వ‌సాయ శాఖ మంత్రి కింజ‌రాపు అచ్చెన్నాయుడు సోమ‌వారం టెక్కలి నియోజకవర్గంలోని నిమ్మాడ క్యాంప్ కార్యాల‌యం నుంచి రాష్ట్ర వ్యవ‌సాయ శాఖ ముఖ్య కార్య‌ద‌ర్శి , డైరెక్ట‌ర్, 26 జిల్లాల జేడీల‌తో టెలీకాన్ఫెరెన్స్ నిర్వ‌హించారు. ఈ సంద‌ర్బంగా మంత్రి ప‌లు సూచ‌ల‌ను అధికారులకు జారీ చేశారు. కేంద్ర ప్ర‌భుత్వం పీఎం కిసాన్ నిధులు అదేరోజు విడుద‌ల చేయ‌నున్న నేప‌థ్యంలో రాష్ట్ర ప్ర‌భుత్వం వాటా క‌లిపి రైతుల ఖాతాల్లో జ‌మ చేయనున్న నేప‌థ్యంలో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల వాటాతో కలిపి మొత్తం రూ.7వేలు అందించనున్నామ‌ని తెలిపారు. రాష్ట్రంలో అర్హులైన ప్రతి రైతుకూ అన్నదాత సుఖీభవ పథకం లబ్ధి అందాలని, రైతులకు చేయూతనివ్వడం భారం కాదు.. బాధ్యత అని గుర్తెరగాల‌ని అన్నారు. అన్నదాత సుఖీభవ-పీఎం కిసాన్‌ పథకం రెండో విడ‌త అమలు కార్యక్రమం పండుగ వాతావరణంలో జరగాల‌ని అందుకు అవ‌స‌ర‌మైన చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని ఆదేశించారు. రాష్ట్ర ముఖ్య మంత్రి చంద్ర‌బాబు నాయుడు ఈ నెల 19న వైయస్సార్ జిల్లా కమలాపురం నియోజకవర్గంలో అధికారులు, ప్రజా ప్రతినిధులతో కలిసి రైతుల ఖాతాల్లో నగదు జమ చేసేందుకు ఏర్పాటు చేసిన కార్యక్రమానికి అవ‌స‌ర‌మైన చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని వ్యవ‌సాయ శాఖ అధికారుల‌ను మంత్రి ఆదేశించారు. NPCAలో ఇన్ యాక్టివ్ గా ఉన్న ఖాతాలను యాక్టివేట్ చేయాలని క్షేత్ర స్ధాయిలో వ్యవసాయ శాఖ అధికారులు స‌న్వ‌యం చేసుకుని ప‌ర్య‌వేక్ష‌ణ చేసి వాటిని సరిచేయాల‌ని సూచించారు. ఆర్హులైన రైతులు చనిపోయిన పక్షంలో వారి వారసులకు డెత్ మ్యూటేషన్ చేసి ఈ పథకం వర్తించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అన్నదాత సుఖీభవ పథకం అర్హత ఉన్నవారు ఆన్లైన్లో రైతులు నమోదు చేసుకునే విధానాన్ని సులభతరం చేయాల‌ని అధికారుల‌కు సూచించారు. రాష్ట్రంలో అన్నదాత సుఖీభవ-పీఎం కిసాన్ పథకం కింద రెండో విడత 46,62,904, లక్షల మంది రైతులకు ప్రయోజనం చేకూరనుందని అధికారులు మంత్రికి వివ‌రించారు. అన్నదాత సుఖీభవ-పీఎం కిసాన్ పథకం కింద రూ.3077.77 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేయనున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిధులు విడుద‌ల చేయ‌నున్నాయని చెప్పారు. ఈ పథకంపై సందేహాల నివృత్తి కోసం టోల్‌ఫ్రీ నంబరును అందుబాటులో ఉంచాలని అధికారులకు మంత్రి ఆదేశించారు. అన్నదాత సుఖీభవ అందుకునే రైతుల సెల్‌ఫోన్లకు ఒక రోజు ముందే ‘ సందేశాలు వెళ్లాలి. రైతులు తమ ఖాతాలను యాక్టివేట్‌ చేసుకునేలా వారికి అవగాహన కల్పించాలి’’ అని తెలిపారు. తొలి విడ‌త‌లో జ‌మ‌కానివి రైతుల నుంచి వ‌చ్చిన పిర్యాదులు ప‌రిశీలించి అర్హ‌త ఉన్న వారికి అన్నదాత సుఖీభ‌వ ప‌థ‌కం అందేలా అధికారులు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా పండ‌గ వాతావ‌ర‌ణంలో జ‌ర‌గాల‌ని అధికారుల‌కు సూచించారు. వెబ్‌ల్యాండ్‌లో న‌మెదు కానివి, అర్హ‌త ఉన్న‌వారికి అంద‌లేద‌ని రైతుల నుంచి వ‌స్తున్న ఫిర్యాదులు ప‌రిశీలించి అర్హ‌త ఉన్న రైతుల‌కు ప‌థ‌కం అందేలాచ‌ర్య‌లు తీసుకోవాల‌ని సూచించారు. కింది స్ధాయి సిబ్బంది గ్రామాల్లో ప‌ర్య‌టించి రైతులకు ప్ర‌త్యేక అవ‌గాహన కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించాల‌ని ఆదేశించారు.

Comments

-Advertisement-