జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పేరు ఇనుమడించేలా ఉద్భవ్-2025 నిర్వహిస్తాము.
జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పేరు ఇనుమడించేలా ఉద్భవ్-2025 నిర్వహిస్తాము.
- ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలల 6వ జాతీయ సాంస్కృతిక ఉత్సవాలకు వేదికగా ఆంధ్రప్రదేశ్
- కెఎల్ యూనివర్సిటీ ప్రాంగణంలో డిసెంబర్ 3 నుండి 3 రోజుల పాటు నిర్వహణ
- 22 రాష్ట్రాల నుండి 1800 మంది విద్యార్థులు హజరు
- గుమ్మిడి సంధ్యారాణి, మహిళా శిశు సంక్షేమం, గిరిజన సంక్షేమ శాఖామాత్యులు
అమరావతి, నవంబర్ 25 : జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పేరు ఇనుమడించేలా ఉద్భవ్-2025 నిర్వహించడానికి సర్వం సిద్ధం చేశామని మహిళా శిశు సంక్షేమం, గిరిజన సంక్షేమ శాఖామాత్యులు గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. ఏకలవ్య మోడల్ రెసిడెన్షియాల్ పాఠశాలల ఆధ్వర్యంలో డిసెంబర్ 3 నుండి 3 రోజుల పాటు నిర్వహించే 6 వ జాతీయ సాంస్కృతిక ఉత్సవాలను పండగ వాతావరణంలో నిర్వహించనున్నామని మంత్రి సంధ్యారాణి చెప్పారు. ఏపీ సచివాలయం 3వ బ్లాక్ లోని మంత్రి కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి గుమ్మిడి సంధ్యారాణి మాట్లాడుతూ గిరిజన విద్యార్థుల్లో దాగిఉన్న ప్రతిభను వెలికితీయడం, వారిలో జాతీయ సమైఖ్యతను ప్రోత్సహించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం డిసెంబర్ 3,4,5 తేదీల్లో కెఎల్ యూనివర్సిటీ ప్రాంగణంలో నిర్వహించడానికి సమాయత్తమవుతున్నామని వివరించారు. ఈ ఉత్సవాలను ఉద్భవ్-2025 పేరుతో నిర్వహిస్తున్నామన్నారు. ఉత్సవ్ 2025కు దేశవ్యాప్తంగా 22 రాష్ట్రాలకు చెందిన 405 ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ నుండి 1800 మంది విద్యార్థులు హజరుకానున్నారని పేర్కొన్నారు. మన రాష్ట్రం నుండి 110 మంది విద్యార్థులు ఈ వేడుకలకు హాజరుకానున్నారు. విద్యార్థులతో పాటు ఆయా రాష్ట్రాల నుండి ఉన్నతాధికారులు, ఉపాధ్యాయులు, సంరక్షకులు, కంటింజెంట్ మేనేజర్స్ హజరవుతారన్నారు.
వేడుకల్లో కల్చరల్ యాక్టివిటీస్ తో పాటు ఆటపాటలు, గిరిజన ముఖచిత్రం ప్రతిబింబించేలా ఆర్ట్స్, లిటరేచర్ ప్రదర్శనలు ఉంటాయని మంత్రి సంధ్యారాణి తెలిపారు. ఇందుకోసం కెఎల్ యూనివర్సిటీలో 12 వేదికలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో రాష్ట్ర స్థాయిలో ప్రతిభ కనపర్చి జాతీయ పోటీలైన ఉద్భవ్2025కు ఎంపికైన విద్యర్థులందరూ ఒకే వేదికగా కలవబోతున్నారన్నారు. పోటీల్లో ప్రతిభ చూపిన విద్యార్థులకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు, మెరిట్ సర్టిఫికెట్ లు అందచేస్తామన్నారు. ఉద్భవ్ 2025 ఉత్సవాలకు 6 వ తరగతి నుండి 12వ తరగతి చదువుతున్న విద్యార్థులు హజరకానున్నారన్నారు. గురుకులాల విద్యార్థుల నైపుణ్యాన్ని వెలికితీయడంతో పాటు వారిలో ఆత్మస్థైర్యాన్ని పెంపోందించే ఇలాంటి జాతీయ స్థాయి సమ్మెళనాలు మరెన్నో జరగాలన్నారు. 6వ జాతీయ ఉత్సవాలను మన రాష్ట్రంలో నిర్వహించడం మన అదృష్టమన్నారు. ఈ ఉత్సవాలు విద్యార్థుల్లో పర్యాటక అనుభూతిని కలిగించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు.
ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలల (ఈఎంఆర్ఎస్ )విద్యార్థులు నీట్, ఐఐటీ, ఎన్ఐటీలలో ఎక్కువ మంది ఎంపికవుతున్నారని, అలాగే విదేశీ విద్యకు ఎక్కువ మంది ఎంపికయ్యేలా ఇప్పటి నుండే చర్యలు తీసుకుంటున్నామని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు. గిరిజన విద్యార్థులను చురుకుగా తయారు చేయడమే మా లక్ష్యమన్నారు. ఇటువంటి జాతీయ స్థాయి ఉత్సవాలు ఇతర రాష్ట్రాల ఆహార అలవాట్లు, సంస్కృతి, భాషల వైవిధ్యంపై అవగాహన పెంచుతాయన్నారు. జాతీయ స్థాయిలో మన విద్యార్థులు ఎందులోనూ తక్కువ కాదని నిరూపిస్తున్నారని, వారిలోని ఉత్సాహానికి ఇటువంటి వేదికలు నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు.
గిరిజన ప్రాంతాల్లో డోలీ మోతలకు చెక్ పెట్టేలా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, దశల వారీగా రహదారుల నిర్మాణాలు శరవేగంగా జరుగుతున్నాయని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. గిరిజన ప్రాంతాల్లో ఇప్పటి వరకు రూ. 1300 కోట్లు ఖర్చు చేశామని, అల్లూరి సీతారామరాజు జిల్లాకు రూ. వెయ్యి కోట్లు కేటాయించినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబుకు మంత్రి సంధ్యారాణి ధన్యావాదాలు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వసతి గృహాల్లో ఆర్ వో ప్లాంట్ లు ఏర్పాటు చేశామన్నారు. అలాగే టాయిలెట్లు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఐటీడీఏ లను బలోపేతం చేయడంలో భాగంగా రాష్ట్రంలోని అన్ని ఐటీడిఏలకు ఐఏఎస్ లను నియామకం చేయడం జరిగిందన్నారు. దీంతో ఐటీడీఏ లు మరింత సమర్ధవంతంగా తయారయ్యాయని తెలిపారు. హస్టల్స్ లో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం రూ. 105 కోట్లు కేటాయించిందన్నారు. ట్రైకార్ లో దరఖాస్తు చేసుకున్న గిరిజనులకు రుణాలు మంజూరు చేస్తున్నామన్నారు. అలాగే గోకులాల ఏర్పాటు చేసుకునేందుకు రుణాలు విరివిగా అందిస్తున్నామన్నారు. అంగన్వాడీలకు కిట్లు పంపిణీ చేయడానికి సిద్ధం చేస్తున్నామన్నారు.
ముందుగా 6వ జాతీయ స్థాయి వేడులు ఉద్భవ్ 2025 పోస్టర్, లోగో లను మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ఆవిష్కరించారు. కార్యక్రమంలో గురుకులం కార్యదర్శి ఎం. గౌతమి, ట్రైబల్ వెల్ఫేర్ సెక్రెటరీ ఎస్. భార్గవీ, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
