టీ20 మహిళల విజేతల జట్టు.. మోదీని కలవనుంది!
టీ20 మహిళల విజేతల జట్టు.. మోదీని కలవనుంది!
న్యూఢిల్లీ, నవంబర్ 5 (పీపుల్స్ మోటివేషన్):
చరిత్ర సృష్టించిన భారత మహిళల క్రికెట్ జట్టు ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసింది. ప్రపంచకప్ విజేతలుగా దేశానికి గర్వకారణంగా నిలిచిన మహిళా జట్టును ప్రధాని స్వయంగా అభినందించి, ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ, ఈ విజయం భవిష్యత్ తరాలకు, ముఖ్యంగా బాలికలకు గొప్ప స్ఫూర్తినిస్తుందని పేర్కొన్నారు. ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో దక్షిణాఫ్రికాపై అద్భుత విజయం సాధించి తొలి ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్‌ను గెలుచుకున్న జట్టు, కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ నేతృత్వంలో ఢిల్లీకి చేరుకుంది. ప్రధానమంత్రి కార్యాలయం ఆహ్వానం మేరకు సాయంత్రం 6 గంటలకు మోదీని కలిసిన జట్టును ఆయన స్వయంగా అభినందించారు. “ఈ విజయం కేవలం క్రీడా మైదానానికే పరిమితం కాదు. ఇది దేశంలోని నారీశక్తి పెరిగిన ఆత్మవిశ్వాసానికి, బలానికి ప్రతీక. చిన్న పట్టణాల నుంచి వచ్చిన ఈ కూతుళ్లు భవిష్యత్ ఛాంపియన్లకు స్ఫూర్తిగా నిలుస్తారు,” అని ప్రధాని పేర్కొన్నారు. భారత మహిళల జట్టు చారిత్రక విజయంపై దేశవ్యాప్తంగా ఆనందం వెల్లివిరుస్తోంది. గతంలో 1983లో పురుషుల జట్టు సాధించిన విజయం భారత క్రికెట్‌కు మలుపుతిప్పిన విధంగానే, ఈ విజయం మహిళల క్రికెట్ చరిత్రలో ‘సువర్ణాధ్యాయం’గా నిలిచిపోనుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ అద్భుత విజయాన్ని గుర్తించి, బీసీసీఐ మహిళా జట్టుకు, సహాయక సిబ్బందికి రూ. 51 కోట్ల భారీ నగదు బహుమతిని ప్రకటించింది. మహిళా క్రికెట్‌కు ఇది ఒక నూతన యుగానికి నాంది పలుకుతోందని క్రీడా నిపుణులు విశ్లేషిస్తున్నారు.

