రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

వికారాబాద్‌లో బస్సు ప్రమాదం

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news
Mounikadesk

వికారాబాద్‌లో బస్సు ప్రమాదం 


– సిమెంట్ లారీని ఢీకొన్న కర్ణాటక బస్సు

వికారాబాద్: 04 నవంబర్ 2025 (పీపుల్స్ మోటివేషన్):

తెలుగు రాష్ట్రాల్లో వరుసగా బస్సు ప్రమాదాలు చోటుచేసుకుంటూ ప్రజల్లో ఆందోళన కలిగిస్తున్న నేపథ్యంలో, మరో ఘటన వికారాబాద్ జిల్లాలోని టాండూరు వద్ద నమోదైంది. కర్ణాటకానికి చెందిన ఆర్టీసీ బస్సు సిమెంట్ లారీని ఢీకొట్టిన ఈ ప్రమాదంలో పలువురు గాయపడ్డారు.

కర్ణాటకలోని కలబురిగి నుంచి టాండూరు వైపు ప్రయాణిస్తున్న ఆర్టీసీ బస్సు, టాండూరు సమీపంలో ఎదురు దిశ నుంచి వస్తున్న సిమెంట్ లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒక ప్రయాణికుడి తలకు గాయం కాగా, బస్సు డ్రైవర్, కండక్టర్‌కు స్వల్ప గాయాలు అయ్యాయి. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని వాహనాలను తొలగించి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. ప్రమాదంతో రహదారిపై కొద్ది సేపటి పాటు రాకపోకలు అంతరాయం ఏర్పడ్డాయి.

ఇటీవలి కాలంలో కర్నూలు, చేవెళ్ల ప్రాంతాల్లో బస్సు ప్రమాదాలు సంభవించిన నేపథ్యంలో, వికారాబాద్ ఘటన స్థానికుల్లో ఆందోళన పెంచింది. రోడ్డు భద్రతపై అధికారులు మరింత అప్రమత్తంగా ఉండాలని ప్రజలు కోరుతున్నారు.

Comments

-Advertisement-