చల్లని నీళ్లు తాగుతున్నారా?
చల్లని నీళ్లు తాగుతున్నారా?
వేసవి ఆరంభంలోనే రాష్ట్ర వ్యాప్తంగా 40 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. అత్యవసరం అయితే తప్పా.. ఇళ్లలోంచి ఎవరూ బయటకు రాకూడదంటూ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తోంది.పగటి పూట మాత్రమే కాకుండా రాత్రి కూడా ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఇండియాతో పాటు ప్రస్తుతం మలేషియా, ఇండోనేషియా, సింగపూర్, ఇతర దేశాలు ‘హీట్ వేవ్’ను ఎదుర్కొంటున్నాయి. ఈ క్రమంలోనే వైద్యులు ఎప్పుడుపడితే అప్పుడు చల్లని లేదా ఐస్ వాటర్ తాగడం మానుకోవాలని సూచిస్తున్నారు. వైద్యులు సూచిస్తున్న అంశాలేవో ఇప్పుడు చూద్దాం..
1. ఉష్ణోగ్రత 40 డిగ్రీలకు చేరుకున్నప్పుడు ఐస్ వాటర్ తాగకూడదు. ఒకవేళ అలా చేస్తే మన శరీరంలోని చిన్న రక్తనాళాలు పగిలిపోయే అవకాశం ఉంది. కాగా, ఇటీవలే ఓ వ్యక్తి తీవ్రమైన ఎండలో తన స్నేహితుడి ఇంటికి వెళ్లాడు. వెళ్లి వెళ్లగానే తాను చల్లబడేందుకు నీళ్లతో కాళ్లు, చేతులను శుభ్రంగా కడుక్కోగా అతడు అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. దీంతో ఇంట్లో వారు అతడిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.
2. ఆరుబయట ఉష్ణోగ్రత 38 డిగ్రీలకు చేరుకున్నప్పుడు చల్లని నీళ్లు కాకుండా.. గోరువెచ్చని నీటిని కాస్త నెమ్మదిగా తాగాలని వైద్యులు సూచిస్తున్నారు. అదేవిధంగా వ్యక్తి కాళ్లు, చేతులు వేడికి గురైనట్లయితే వెంటనే కడుక్కోవద్దని తెలిపారు. ఎండలో వెళ్లొచ్చాక స్నానం చేయాలనుకుంటే కనీసం అరగంటైనా వేచి ఉండాలని చెబుతున్నారు.
3. బాడీలో హీట్‌ను తగ్గించుకునేందుకు ఒకవేళ వెంటనే స్నానం చేస్తే.. దవడ గట్టిపడి, స్ట్రోక్ వచ్చే అవకాశం లేకపోలేదని డాక్టర్లు చెబుతున్నారు.
4. ఎండలో వెళ్లొచ్చి చన్నీళ్లు తాగితే.. మనిషి గుండెలోని సిరలు, రక్తనాళాలు చాలా ఇరుకుగా ఉంటాయని, ఏ క్షణమైనా స్ట్రోక్‌కు దారితీయవచ్చని వైద్యులు సూచిస్తున్నారు. ఏది ఏమైనా ఈ మండు వేసవిలో డీహైడ్రేషన్ బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకుందాం. వైద్యుల విలువైన సలహాలు, సూచనలు పాటించి ప్రాణాలను కాపాడుకుందాం.
