ఓటీటీలో సంచలనం సృష్టిస్తున్న తమిళ చిత్రం ‘బ్యాడ్ గర్ల్’
ఓటీటీలో సంచలనం సృష్టిస్తున్న తమిళ చిత్రం ‘బ్యాడ్ గర్ల్’
హైదరాబాద్, నవంబర్ 4 ( పీపుల్స్ మోటివేషన్):
ప్రముఖ తమిళ దర్శకుడు వెట్రిమారన్ నిర్మాణంలో, యువ దర్శకురాలు వర్ష భరత్‌కుమార్ దర్శకత్వంలో రూపొందిన ‘బ్యాడ్ గర్ల్’ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదలకు ముందు నుంచే ఈ సినిమా పెద్ద వివాదాన్ని రేపింది. బ్రాహ్మణ సమాజాన్ని తప్పుగా చూపించారనే ఆరోపణలతో సెన్సార్ బోర్డు దీని విడుదలను అడ్డుకుంది.
తదుపరి పలు సన్నివేశాలను తొలగించిన అనంతరం, ఈ చిత్రం సెప్టెంబర్ 5న థియేటర్లలో విడుదలై మంచి విజయాన్ని సాధించింది. తాజాగా ఈ చిత్రం ఓటీటీలో విడుదలైంది. ప్రముఖ డిజిటల్ వేదిక జియో హాట్‌స్టార్‌లో ఈ చిత్రం తమిళంతో పాటు తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది.
వెట్రిమారన్, అనురాగ్ కశ్యప్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాలో సమాజం విధించిన ఆంక్షల మధ్య తన జీవితాన్ని స్వేచ్ఛగా గడపాలని కోరుకునే మధ్యతరగతి యువతి కథను చూపించారు. మహిళా స్వేచ్ఛ, సామాజిక కట్టుబాట్ల మధ్య జరిగే సంఘర్షణలను ఈ చిత్రంలో నిజ జీవితానికి దగ్గరగా చూపించారని విమర్శకులు అభిప్రాయపడ్డారు.
