రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

క్షిపణి రక్షణ వ్యవస్థలకు అందని అస్త్రం: 'పొసైడాన్' వాహక నౌక 'ఖబారోవెస్క్'ను ప్రారంభించిన రష్యా"..

Current Affairs Today Current Affairs news Current Affairs PDF Current Affairs of India Today Current Affairs PDF Daily current affairs Latest GK&CA
Mounikadesk

క్షిపణి రక్షణ వ్యవస్థలకు అందని అస్త్రం: 'పొసైడాన్' వాహక నౌక 'ఖబారోవెస్క్'ను ప్రారంభించిన రష్యా"..

అంతర్జాతీయ భద్రతా సమీకరణాలను సమూలంగా మార్చగల శక్తివంతమైన, సరికొత్త అణు జలాంతర్గామిని రష్యా ప్రారంభించింది. 'ఖబారోవ్స్క్' (KHABAROVSK) అనే ఈ జలాంతర్గామి, 'పొసైడాన్' (POSEIDON) అనే అణుశక్తితో నడిచే, అణ్వాయుధాలను మోసుకెళ్లగల అండర్ వాటర్ డ్రోన్కు "మదర్షిప్" (వాహక నౌక)గా పనిచేయడానికి ప్రత్యేకంగా రూపొందించబడింది.

జలాంతర్గామి ప్రత్యేకత: ఇది సాధారణ జలాంతర్గామి కాదు. ఇది ప్రత్యేకంగా 'పొసైడాన్' వంటి నీటి అడుగున సంచరించే ఆయుధాలు మరియు రోబోటిక్ వ్యవస్థలను మోసుకెళ్లడానికి మరియు ప్రయోగించడానికి రూపొందించబడింది.

ముఖ్య ఉద్దేశ్యం: సముద్ర సరిహద్దుల రక్షణ మరియు ప్రపంచ మహాసముద్రాలలో రష్యా యొక్క వ్యూహాత్మక ప్రయోజనాలను కాపాడటం.

పొసైడాన్:

దీనిని 'డూమ్స్ క్షిపణి' (DOOMSDAY MISSILE) (రష్యా భద్రతా మండలి డిప్యూటీ ఛైర్మన్ దిమిత్రీ మెద్వదేవ్ అభివర్ణించారు).

గత వారం విజయవంతంగా పరీక్షించినట్లు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రకటించారు.

ప్రయోగ విధానం: జలాంతర్గామి (ఖబారోవెస్క్ వంటివి) నుండి దీనిని ప్రయోగిస్తారు. పొసైడాన్ అనేది కేవలం టార్పెడో లేదా డ్రోన్ కాదు; ఇది ఒక మానవరహిత నీటి అడుగున (UNMANNED UNDERWATER VEHICLE - UUV) మరియు ఇది ఒక వ్యాహాత్మక అణు ఆయుధం.

ఇంజిన్ (PROPULSION): దీని ప్రత్యేకత అణుశక్తితో నడవడం. ఇది జలాంతర్గామి రియాక్టర్ కంటే 100 రెట్లు చిన్నదైన సూక్ష్మ అణు రియాక్టర్ (MINIATURE NUCLEAR REAC-TOR) ను కలిగి ఉంటుంది.

అపరిమిత పరిధి (UNLIMITED RANGE): అణు ఇంధనాన్ని వాడటం వలన, ఇది ఖండాంతర దూరాలు, అంటే వేలాది కిలోమీటర్లు, సముద్ర గర్భంలో ప్రయాణించి, ప్రపంచంలో ఏ తీరాన్నైనా చేరుకోగలదు.

సామర్థ్యాలు:

అధిక వేగం: ఆధునిక టార్పెడోలు, జలాంతర్గాముల కంటే వేగంగా ప్రయాణిస్తుంది.

లోతు: చాలా లోతులో ప్రయాణించగలదు, దీనివల్ల ప్రత్యర్థి సోనార్ వ్యవస్థలు (SONAR SYSTEMS) దీనిని గుర్తించడం దాదాపు అసాధ్యం.

అణ్వాయుధ పేలోడ్: ఇది భారీ అణ్వాయుధాలను (MEGATON-CLASS) మోసుకెళ్లగలదు.

2.ఖబారోవ్స్క్ '(PROJECT 09851)

'ఖబారోవ్స్క్' ఒక ప్రత్యేక ప్రయోజన జలాంతర్గామి (SPECIAL PURPOSE SUBMARINE). ఇది బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించే సబ్మెరైన్ (SSBN) కాదు.

దీని ఏకైక ప్రయోజనం ఆరు 'పొసైడాన్' డ్రోన్లను మోసుకెళ్లి, ప్రయోగించడం. ఇది సముద్ర గర్భంలో ఒక నిశ్శబ్ద "వాహక నౌక" (MOTHERSHIP) వలె పనిచేస్తుంది

3. వ్యవహాత్మక ప్రాముఖ్యత (STRATEGIC IMPLICATIONS) 

1. క్షిపణి రక్షణ వ్యవస్థలను ఛేదించడం (BYPASSING MISSILE DEFENSE);

అమెరికా మరియు నాటో (NATO) దేశాలు థాడ్ (THAAD), ఏజిస్ (AEGIS) వంటి అత్యంత అధునాతన బాలిస్టిక్ క్షిపణి రక్షణ (BMD) వ్యవస్థలను అభివృద్ధి చేశాయి. ఇవి ఆకాశం నుండి వచ్చే క్షిపణులను అడ్డుకుంటాయి.

పొసైడాన్, సముద్ర గర్భంలో, రాడార్లకు అందకుండా ప్రయాణించడం ద్వారా, ఈ బిలియన్ డాలర్ల రక్షణ వ్యవస్థలను పూర్తిగా నిరుపయోగం చేస్తుంది. ఇది నీటి అడుగున నుండి వేసే "వ్యూహాత్మక చదరంగం" (STRATEGIC CHESS MOVE).

2. ప్రతీకార దాడి (SECOND STRIKE CAPABILITY):

అణు యుద్ధ సిద్ధాంతంలో "సెకండ్ స్ట్రైక్" చాలా కీలకం. అంటే, ఒకవేళ శత్రు దేశం మొదటి అణుదాడితో దేశంలోని అన్ని క్షిపణి స్థావరాలను నాశనం చేసినా, సముద్రంలో రహస్యంగా దాగి ఉన్న జలాంతర్గాములు తిరిగి ప్రతీకార దాడి చేయగలగాలి.

'ఖబారోవ్స్క్' వంటి జలాంతర్గామి, పొసైడాన్ డ్రోన్లతో కలిసి ఈ ప్రతీకార దాడి హామీని మరింత బలోపేతం చేస్తుంది.

3. లక్ష్యాలు (TARGETS) - 'డూమ్స్ డే'

దీని ప్రధాన లక్ష్యాలు కేవలం సైనిక స్థావరాలు కావు.

తీరప్రాంత నగరాలు: న్యూయార్క్, లాస్ ఏంజిల్స్ వంటి పెద్ద తీరప్రాంత నగరాల దగ్గర ఈ అణ్వాయుధాన్ని పేల్చడం ద్వారా, భారీ "రేడియోధార్మిక సునామీ"ని సృష్టించి, నగరాన్ని నాశనం చేయడం దీని ఉద్దేశ్యం. అందుకే దీనికి "డూమ్స్ డే" ఆయుధం అని పేరు

విమాన వాహక నౌకలు (AIRCRAFT CARRIERS): అమెరికా నావికాదళానికి వెన్నెముక అయిన విమాన వాహక నౌక బృందాలను (CARRIER STRIKE GROUPS) సముద్ర గర్భం నుండే ధ్వంసం చేయడం.

4. రష్యా యొక్క "సూపర్ వెపన్స్" (SUPER WEAPONS)

పొసైడాన్ మరియు బురెవెస్ట్నిక్ (అణుశక్తితో నడిచే క్రూజ్ క్షిపణి) అనేవి 2018లో అధ్యక్షుడు పుతిన్ ప్రకటించిన ఆరు అత్యాధునిక "సూపర్ వెపన్స్"లో భాగం. మిగిలినవి: అవన్గార్డ్ (HYPERSONIC GLIDE VEHICLE), కింజల్ (AIR-LAUNCHED HYPERSONIC MISSILE), శర్మ (HEAVY ICBM), మరియు పర్స్వేట్ (LASER WEAPON

Comments

-Advertisement-