రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

వాట్సప్ గవర్నెన్స్ సేవలను వినియోగించుకునేలా నేటి నుండి ఇంటింటి ప్రచారం

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news
Mounikadesk

వాట్సప్ గవర్నెన్స్ సేవలను వినియోగించుకునేలా నేటి నుండి ఇంటింటి ప్రచారం

  • గ్రామ,వార్డు సచివాలయాల సిబ్బంది ద్వారా ప్రతి శుక్రవారం వాట్సప్ గవర్నెన్స్ సేవల వినియోగంపై అవగాహన
  • సచివాలయాల ఉద్యోగులు వారి పరిధిలో ఇంటింటికీ వెళ్లి వాట్సప్ గవర్నెన్స్ సేవలు వినియోగించుకునేలా అవగాహన కల్పించాలి 
  • -జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news

కర్నూలు, నవంబర్ 07 (పీపుల్స్ మోటివేషన్):-

జిల్లాలోని వంద శాతం కుటుంబాలు వాట్సప్ గవర్నెన్స్ సేవలను వినియోగించుకునేలా నేటి (7 వ తేదీ) నుండి ప్రతి శుక్రవారం ఇంటింటి ప్రచారం నిర్వహించడం జరుగుతోందని, సచివాలయాల ఉద్యోగులు వారి పరిధిలో ఇంటింటికీ వెళ్లి అన్ని కుటుంబాలు వాట్సప్ గవర్నెన్స్ సేవలు వినియోగించుకునేలా అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి అధికారులను ఆదేశించారు.

ప్రతి కుటుంబం మన మిత్ర యాప్ ద్వారా వాట్సప్ గవర్నెన్స్ సేవలు వినియోగించుకునేలా సచివాలయ ఉద్యోగులు ప్రతి శుక్రవారం ఇంటింటికీ వెళ్లి అవగాహన కల్పించాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ మేరకు మున్సిపల్ కమిషనర్ లు, ఎంపిడిఓ లు చర్యలు తీసుకోవాలని, జడ్పీ సీఈవో, డివిజనల్ లెవెల్ డెవలప్మెంట్ అధికారులు(డీఎల్డివో లు)ఈ అంశంపై పూర్తిస్థాయిలో పర్యవేక్షణ చేయాలని కలెక్టర్ ఆదేశించారు.

గ్రామ,వార్డు సచివాలయ సిబ్బంది ఇంటింటికీ వెళ్లి వాట్సప్ సేవలు ఎలా వినియోగించుకోవాలి అని డెమో(ప్రదర్శన) చేసి, వారితో ఒక సర్వీస్ అయినా చేయించాలని కలెక్టర్ ఆదేశించారు. అలాగే ఆ సర్వీస్ కు సంబంధించిన ఫోటోలను employee mobile application లో అప్లోడ్ చేయాలన్నారు. క్యూ ఆర్ కోడ్ లు డిస్ప్లే చేయాలని, కరపత్రాలు పంపిణీ చేయాలని కలెక్టర్ ఆదేశించారు. పంచాయతీ సెక్రటరీలు, వార్డ్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీలు, ఇతర సచివాలయ సిబ్బందితో సమన్వయపరచుకుని, అన్ని కుటుంబాలకు అవగాహన కల్పించేలా చర్యలు తీసుకోవాలన్నారు.. అలాగే వీఆర్వోలు, విలేజ్ సర్వే అసిస్టెంట్లు, వార్డ్ రెవెన్యూ సెక్రటరీలు వాట్స్అప్ గవర్నెన్స్ ద్వారా అందుతున్న రెవెన్యూ, భూ సంబంధిత సేవల గురించి అవగాహన కల్పించాలని కలెక్టర్ ఆదేశించారు..ఎనర్జీ అసిస్టెంట్స్, ఎనర్జీ సెక్రటరీలు విద్యుత్ శాఖకు సంబంధించి బిల్లు పేమెంటు,కొత్త కనెక్షన్, తదితర అంశాల మీద అవగాహన కల్పించాలన్నారు.. అలాగే వ్యవసాయం, ఉద్యాన శాఖ, సెరికల్చర్,పశుసంవర్ధకం, ఫిషరీస్, ఏఎన్ఎం, వార్డ్ హెల్త్ సెక్రటరీలు ఆయా శాఖలకు సంబంధించి వాట్సప్ గవర్నెన్స్ సేవల గురించి ప్రజలకు అవగాహన కల్పించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరగకుండా సులభంగా ఆన్లైన్ ద్వారా సేవలు అందించాలన్నది ప్రభుత్వ ఉద్దేశ్యమని, వంద శాతం కుటుంబాలు ఈ సేవలను వినియోగించుకునేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.

Comments

-Advertisement-