నాలుక మీద తారక మంత్రం వందేమాతరం
నాలుక మీద తారక మంత్రం వందేమాతరం
- స్ఫూర్తితో స్వాతంత్ర సమరయోధుల రణ నినాదం
- -డాక్టర్ ఉదయ శంకర్
నంద్యాల, నవంబర్ 07 (పీపుల్స్ మోటివేషన్):-
వందేమాతరం 150 సంవత్సరాల జ్ఞాపకార్థం దేశవ్యాప్తంగా వేడుకలు ప్రకటించిన నేపథ్యంలో స్థానిక శ్రీ రామకృష్ణ అటానమస్ డిగ్రీ కళాశాలలో వివేకానంద స్వామి ఆడిటోరియంలో శుక్రవారం రోజు న వందేమాతరం 150 సంవత్సరాల వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమానికి కళాశాల చైర్మన్ డాక్టర్ రామకృష్ణారెడ్డి అధ్యక్షత వహించారు.శ్రీ రామకృష్ణ డిగ్రీకళాశాల మరియునంద్యాల నేషనలిస్ట్ ఎలైట్ ఫోరం సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా ప్రముఖ వైద్యులు డాక్టర్ ఉదయ్ శంకర్ మాట్లాడుతూ... ఆనాడు వందేమాతరం నినాదంతో యావత్ భారతదేశం ఒకటి అయి స్వాతంత్ర స్ఫూర్తితో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడి దేశానికి స్వాతంత్రం తెచ్చారని. ఆస్ఫూర్తితో మళ్లీ 150 సంవత్సరాల పూర్తి చేసుకున్న సందర్భంగా దేశవ్యాప్తంగా వేడుకలు జరుగుతున్నాయి. విద్యార్థులు భారత దేశ చరిత్రను క్షుణ్ణంగా తెలుసుకోవాలని మన దేశ స్వాతంత్ర సంగ్రామానికి ఉజ్వలమైన ప్రేరణగా నిలిచినది ఈ గీతం. ఇది కేవలం ఒక పాట మాత్రమే కాదు మనకు భారత మాత పట్ల ఉన్న ప్రేమ, గౌరవం, త్యాగ స్ఫూర్తి ఐక్యత కు నిదర్శనం అని చెప్పారు.
రామకృష్ణ విద్యా సంస్థల అధినేత ప్రొఫెసర్ రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ... 1875లో బంకింగ్ చంద్ర చటర్జీ ఆనంద మఠం గ్రంథంలో వందేమాతరం రచించారు ఇది కేవలం ఒక సాహిత్య సృష్టి మాత్రమే కాదు. స్వతంత్ర పోరాటంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ప్రేరణగా నిలిచి స్వతంత్ర ఉద్యమానికి అంకితం అయ్యే విధంగా శక్తివంతంగా ప్రభావితము అయిన గానము ఈ వందేమాతరం. ఈ వందేమాతరం పాట భరతమాతకు వందనం అని మాత్రమే కాదు ఆమె సంస్కృతి, సహనాన్ని సాంప్రదాయాన్ని వైవిధ్యాన్ని కాపాడే బాధ్యత మన అందరిదీ. భరతమాత భూమిని దేశాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిదీ ఆ స్ఫూర్తి ఆ ఐక్యత మనకు కలగాలి ఈ వేడుకల ముఖ్య ఉద్దేశం కూడా ఇదే మన దేశం కోసం మనమంతా ఒక మంచి ఆలోచన చేద్దాం ఒక మంచి కార్యము, మంచి విలువలను ఆచరించినప్పుడు మాత్రమే మనము నిజమైన వందనం చేసినట్లు అవుతుందని అన్నారు. నూతన విద్యా విధానం పాలసీలో విద్యార్థులు నిజమైన దేశ చరిత్రను చదవాలని మన దేశ ఆచార వ్యవహారాలు సంస్కృతి ప్రాచీన భారతీయ విద్యా విధానం అమూల్యమైన వేదాలు పురాణాలు చదవాలని కళలు వాస్తు ఖగోళం ఆరోగ్యం వంటి అంశాలపై ప్రాచీన గ్రంధాలు భగవద్గీత, చరక సంహిత, సుశ్రుత సంహిత, పతంజలి యోగ సూత్రాలు వంటి గ్రంధాలు చదివినప్పుడు లేదా తెలుసుకున్నప్పుడు మీలో నిజమైన వ్యక్తిత్వము ఏర్పడుతుందని భరతమాతకు సేవ చేయాలని ఆలోచన మీకు కలుగుతుందని అన్నారు. డాక్టర్ హరినాథ్ మాట్లాడుతూ వందేమాతరం ఐక్యతకు నిదర్శనమని అన్నారు. డాక్టర్ నర్మదా మాట్లాడుతూ స్వాతంత్ర సమరంలో జాతిని జాగృతం చేసిన ప్రేరణ గీతం అని అన్నారు.
కళాశాల ప్రిన్సిపల్ సుబ్బయ్య మాట్లాడుతూ... భారతదేశానికి స్వాతంత్రం రావడానికి వందేమాతరం నినాదం ఎంతో శక్తివంతంగా పనిచేస్తుందని ఈనాడు దేశానికి స్వాతంత్రం వచ్చిన తరువాత మనమందరం ఐక్యమత్యంతో సువిశాల భారతావని అభివృద్ధిలో విద్యార్థులందరూ భాగస్వాములు కావాలంటే గొప్ప వ్యక్తిత్వంతో చదివి ముందుకు వెళ్లాలని హితవు పలికారు. శ్రీమతి ప్రగతి రెడ్డి మాట్లాడుతూ అమ్మ నేను నీకు నమస్కరిస్తున్నాను అని మన తల్లికి భూమికి నమస్కరిస్తూ భరతమాత వైభవాన్ని ఈ పాటలో పరమార్ధాన్ని కలిగి ఉందని అన్నారు. జాతీయోద్యమం మహనీయులకు నివాళులర్పిస్తూ ఐక్యత భావంతో దేశాభివృద్ధికి పునరంకితం అవుతామని ఈరోజు విద్యార్థులందరూ ముక్తకంఠముతో ముందుకు వెళ్లాలి అని ఆకాంక్షించారు.
కళాశాల విద్యార్థుల ప్రసంగం ఆసక్తికరంగా సాగింది. ఉదయము10 గంటలకు కళాశాల విద్యార్థులు వందేమాతరం పాటను ఆలపిస్తుంటే వారితోపాటు వారితో పాటు కార్యక్రమానికి వచ్చిన నేషనలిస్ట్ ఎలైట్ ఫోరం సభ్యులు అందరూ చక్కగా ఆలతించారు. విద్యార్థుల వందేమాతరం నృత్యం అందరిని ఆకట్టుకున్నది. కార్యక్రమంలో నేషనలిస్ట్ ఎనైట్ ఫోరం సభ్యులు డాక్టర్ హరినాథ్ రెడ్డి, డాక్టర్ విజయబాబు, డాక్టర్ నర్మదా డాక్టర్ మనోహర్ డాక్టర్ నేట్ల మహేశ్వర్ రెడ్డి డాక్టర్ సత్యవతి, రాంప్రసాద్ కళాశాల అధ్యాపకులు విద్యార్థులు పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేశారు.


