జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలపై కాంగ్రెస్ సమీక్షా సమావేశం
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలపై కాంగ్రెస్ సమీక్షా సమావేశం
హైదరాబాద్, నవంబర్ 3 (పీపుల్స్ మోటివేషన్):
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో గాంధీభవన్‌లో కాంగ్రెస్ పార్టీ నాయకులు సమీక్షా సమావేశం నిర్వహించారు. నియోజకవర్గ ఇంచార్జ్‌లు, బూత్ పరిశీలకులతో ఈ సమీక్షా కార్యక్రమం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల వ్యూహాలపై దృష్టి సారించింది.
ఈ సమావేశంలో ముఖ్య అతిథులుగా ఏఐసీసీ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రి కొండా సురేఖ, ఏఐసీసీ కార్యదర్శులు విశ్వనాథన్, సంపత్‌కుమార్ పాల్గొన్నారు. అదనంగా ఎంపీలు, ఎమ్మెల్యేలు, చైర్మన్‌లు, పార్టీ నాయకులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
ఉప ఎన్నికల నిర్వహణ, బూత్ స్థాయి బలపరిచే చర్యలపై తన అభిప్రాయాలు వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ పార్టీ ఈ సమావేశం ద్వారా ఉప ఎన్నికల్లో పార్టీ విజయానికి అవసరమైన వ్యూహరచన, స్థానిక బలహీనతల సవరణ, బూత్ మేనేజ్‌మెంట్ పట్ల నాయకులకు మార్గదర్శకత్వం ఇవ్వడం లక్ష్యంగా పెట్టుకుంది.
