ఆరునెలల్లో రాజధాని రైతుల సమస్యలన్నీ పరిష్కరిస్తాం
ఆరునెలల్లో రాజధాని రైతుల సమస్యలన్నీ పరిష్కరిస్తాం
- స్వార్ధం కోసం కొందరు చెప్పే మాటలు నమ్మవద్దు
- రైతుల త్యాగాలు,పోరాటాలు మా ప్రభుత్వం మరచిపోలేదు
- 98 శాతం మంది రైతులకు ప్లాట్ల కేటాయింపు పూర్తయింది
- గ్రీన్ ట్రిబ్యునల్ లో కేసు ఉండటం వల్లే లంక భూములు తీసుకోవడం లేదు
- త్వరలో రాజధాని గ్రామాల్లో మౌళిక వసతుల కల్పన పనులు ప్రారంభిస్తాం
- రైతుల సమస్యల పరిష్కార కమిటీ రెండో సమావేశంలో కీలక అంశాలపై చర్చ....
అమరావతి,రాజధాని రైతుల సమస్యలన్నీ ఆరునెలల్లోగా పరిష్కరిస్తామని త్రీమెన్ కమిటీ హామీ ఇచ్చింది...స్వార్ధం కోసం ఒకరిద్దరు చెప్పే మాటలు ఎవరూ నమ్మవద్దని కమిటీ సభ్యులు సూచించారు..ప్రతి రెండు వారాలకోసారి సమావేశమై రైతుల సమస్యలను పరిష్కరించేలా ముందుకెళ్తామని కమిటీ తెలిపింది...రాజధాని రైతుల సమస్యల
పరిష్కారంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నియమించిన కమిటీ రెండో సమావేశం అమరావతిలోని మున్సిపల్ శాఖ ప్రధాన కార్యాలయంలో జరిగింది...ఈనెల 10వ తేదీన జరిగిన మొదటి సమావేశంలో తీసుకున్న నిర్ణయాల అమలు పురోగతితో పాటు మరికొన్ని సమస్యలపై కమిటీలో కూలంకుశంగా చర్చించారు...వీలైనంతవరకూ సమస్యలను అప్పటికప్పుడే పరిష్కరించడంపై ఎక్కువగా దృష్టి సారించారు కమిటీ సభ్యులు...ఈ సమావేశానికి కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్,రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ,తాడికొండ ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ తో పాటు సీఆర్డీఏ కమిషనర్ కన్నబాబు,అదనపు కమిషనర్ భార్గవ్ తేజ,ఇతర అధికారులు,కాంట్రాక్ట్ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు...సమావేశం ముగిసిన తర్వాత కమిటీ సభ్యులు మీడియాతో మాట్లాడారు.
రెండు వారాలకోసారి సమావేశమై సమస్యలు పరిష్కరిస్తాం...కేంద్ర మంత్రి పెమ్మసాని.
గత ప్రభుత్వ విధానాలతో రైతులు రోడ్లపైకి వచ్చి పోరాటాలు చేసారని గుర్తు చేసారు కేంద్రమంత్రి పెమ్మసాని..రైతుల పోరాటాలు,త్యాగాలు ఎవరూ మరిచిపోలేదన్నారు...గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల కొన్ని ఇబ్బందులు వచ్చాయని...వాటిని ఒక్కొక్కటిగా పరిష్కరిస్తూ వస్తున్నామన్నారు..రైతుల ప్లాట్లకు సంబంధించి ఇంకా కేవలం 700 ఎకరాలకు సంబంధించి కొన్ని సమస్యలున్నాయన్నారు..ఇప్పటికే 98 శాతం ప్లాట్ల కేటాయింపు పూర్తయిపోయిందన్నారు.జరీబు,మెట్ట భూములకు సంబంధించి క్షేత్ర స్థాయిలో వెరిఫై చేసిన తర్వాత పరిష్కరిస్తామని తెలిపారు..ఇక గ్రామకంఠాల విషయంలో సీఆర్డీఏ నిబంధనలకు అనుగుణంగా ఉన్న వాటిని త్వరితగతిన పరిష్కరిస్తామని....గ్రామ కంఠాలకు సంబంధించి 370 మంది రైతులకు ఇబ్బంది ఉందన్నారు...మరోవైపు లంక అసైన్డ్ భూములకు సంబంధించి ప్రస్తుతం నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లో కేసు పెండింగ్ లో ఉందన్న మంత్రి....ఫిబ్రవరిలో తీర్పు వచ్చే అవకాశం ఉందన్నారు...అయితే లంక భూముల్లో ఎలాంటి అభివృద్ది చేయడానికి వీలులేదని...అయినప్పటికీ రైతులకు న్యాయం చేసే ఉద్దేశంతో ఉన్నామన్నారు.
దీంతో పాటు అసైన్డ్ భూముల రిజిస్ట్రేషన్ అంశం కేబినెట్ సబ్ కమిటీ తుది నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు.
90 రోజుల్లోగా ఈ సమస్యను పరిష్కరిస్తామని స్పష్టం చేసారు..జనవరి నుంచి 25 గ్రామాల్లో రోడ్లు,డ్రైనేజిలు,వీధి దీపాలు వంటి మౌళిక వసతుల కల్పన పనులు ప్రారంభిస్తామని తెలిపారు.
రాజధానిలో ప్రతి రైతుకూ న్యాయం చేస్తాం...నారాయణ,మంత్రి.
అమరావతిలో రైతులకు సంబంధించి అన్ని సమస్యలు 6 నెలల్లో పరిష్కరిస్తామని మంత్రి నారాయణ తెలిపారు.రాజధానిలో ప్రతి రైతుకూ న్యాయం చేస్తామని స్పష్టం చేసారు..రైతులకు కేటాయించిన రిటర్నబుల్ ప్లాట్లకు సంబంధించి రిజిస్ట్రేషన్లు వేగంగా జరుగుతున్నాయన్నారు...మరోవైపు భూములిచ్చిన రైతుల్లో ఇంకా కేవలం 719 మందికి మాత్రమే ప్లాట్లు కేటాయించాల్సి ఉందని తెలిపారు.స్వార్థం కోసం ఒకరిద్దరు చెప్పే మాటలను ఎవరూ నమ్మవద్దని మంత్రి కోరారు.
రైతుల ప్లాట్లలో హద్దు రాళ్లు వేయాలి....ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్.
రాజధాని ప్రాంతంలో ఉన్న లే ఔట్ల లో సరిహద్దు రాళ్లు వేయాలని కమిటీకి సూచించినట్లు ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ తెలిపారు.రాజధాని గ్రామాల్లో ప్రస్తుతం ఉన్న పైప్ లైన్లు పనికి రావని....తాగునీటితో పాటు అండర్ గ్రౌండ్ డ్రైనేజి వేసేలా ఇప్పటికే నిర్నయం తీసుకున్నామన్నారు...గ్రామాల్లో మౌళిక వసతుల కల్పనకు డీపీఆర్ సిద్దం చేస్తున్నారని....డిసెంబర్ నెలాఖరు నుంచి మౌళిక వసతుల పనులు ప్రారంభిస్తామని చెప్పారు.
