మహిళలు స్వేచ్ఛగా, సంతోషంగా, సేఫ్టీగా ఉండాలి
మహిళలు స్వేచ్ఛగా, సంతోషంగా, సేఫ్టీగా ఉండాలి
రాష్ట్రంలో లక్ష మంది మహిళలను వ్యాపారవేత్తలుగా తయారు చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ల మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు.
విశాఖపట్టణం సీఐఐ సమ్మిట్ లో లింగ సమానత్వ స్పందన: సమగ్ర భవిష్యత్ ను నిర్మిస్తున్నాం (Gender-Responsive Innovation: Building Inclusive Futures) అనే అంశంపై చర్చా గోష్టిలో మంత్రి గుమ్మిడి సంధ్యా రాణి శనివారం సాయంత్రం పాల్గొని మాట్లాడుతూ దేశంలోని అన్ని రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ వైపు చూసేలా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ర్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నారన్నారు. మహిళాభివృద్ధికి ముఖ్యమంత్రి ఎంతో కృషి చేస్తున్నారన్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు వరదలా వస్తున్నాయంటే అందుకు ముఖ్యమంత్రి పై ఉన్న నమ్మకమేనన్నారు. ఆయన లీడర్ షిప్ లో పనిచేస్తున్నాం కాభట్టే మాకు ఎంతో గౌరవం ఉందన్నారు. లక్ష ఎకరాల్లో కాఫీ పంట పండిస్తున్నారని, కాఫీని ప్యాక్ చేయడం వల్ల మహిళలకు ఆదాయం వస్తుందని, అది మహిళలకు ముఖ్యమంత్రి అందిస్తున్న ఆదాయ మార్గమన్నారు.
విశాఖకు గూగుల్ సంస్థ వస్తుందంటే పక్క రాష్ట్రాలు ఎంతో ఇబ్బంది పడ్డాయని అయినా ముఖ్యమంత్రి, మంత్రి నారా లోకేష్ లు ఎంతో పట్టుదలగా వ్యవహరించి రాష్ట్రానికి తీసుకొచ్చారన్నారు. గతంలో రాష్ట్రం పేరు చెపితే పరుగెత్తిన సంస్థలు ఇప్పుడు రాష్ట్రానికి తిరిగి వస్తున్నాయని అందుకు ముఖ్యమంత్రి పాలనే కారణం అని కొనియాడారు. భవిష్యత్ తరాలు బాగుండాలని వారి అభివృద్ధి సంక్షేమానికి ముఖ్యమంత్రి కంకణబద్దులై పనిచేస్తున్నారన్నారు. నేను వెనుకబడిన ప్రాంతానికి చెందిన మహిళగా నేను చెపుతున్నానని మహిళాభివృద్ధికి చెందిన ప్రభుత్వంగా, ఒక మంచి ప్రభుత్వంగా పనిచేస్తున్నామన్నారు. మహిళాభివృద్ధికి ముఖ్యమంత్రి నాయకత్వంలోని ప్రభుత్వం మహిళావృద్ధికి అనేక చర్యలు తీసుకుంటుందని, రాష్ట్రంలో అందరు మహిళలు స్వేచ్ఛగా, సంతోషంగా, సేఫ్టీగా ఉండాలని పనిచేస్తుందన్నారు..
మహిళా కమిషన్ చైర్మన్ రాయపాటి శైలజ మాట్లాడుతూ మేము మహిళల హక్కుల కోసం అంకిత భావంతో పనిచేస్తామన్నారు. మహిళల సమస్యలపట్ల ప్రభుత్వానికి సలహాదారులుగా కూడా ఉంటామన్నారు. ఇన్నావేషన్ పాలసీలపై మహిళలు అవగాహనతో ముందుకెళ్లాలన్నారు. డిజిటల్ గవర్ననెన్స్ ను ఆకళింపు చేసుకుని ముందుకెళ్లాలన్నారు. ఏపీ మహిళా పక్షపాత ప్రభుత్వం అన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి చెందిన మహిళా శక్తిని తయారు చేస్తున్నామన్నారు. లింగ వివక్ష పోవాలంటే పట్టణాలు, గ్రామాల్లో అనే క్యాంపులు పని మహిళల్లో చైతన్యం తీసుకురావాలన్నారు. మహిళలకు ఆన్ లైన్ సేఫ్టీ, అక్షరాస్యత పెంచడం, మహిళలపై దాడులను అరికట్టే విధంగా ప్రభుత్వాలు పనితీరు మెరుగ్గా అభిప్రాయపడ్డారు. అప్పుడే మహిళల సాధికారత సాధ్యమౌవడానికి ఈ చర్యలు దోహదపడతాయన్నారు.
షారన్ బ్యూటుయో (Sharon Buteau, Executive Director LEAD, at Krea University) చర్చా గోష్టిలో మాట్లాడుతూ మహిళలు ముఖ్యంగా నైపుణ్యం లేదా అవగాహన లేదా సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలన్నరు. డిజిటల్ సాధనాలను స్వీకరించడానికి వారిని బాగా సన్నద్ధం చేయాలని తెలిపారు.
మిహీలా జోరిచ్వో (Mihaela Gjorchava, Founder and CEO, Kinoverzuim, North Macedonia, North Macedonia) చర్చా గోష్టిలో మాట్లాడుతూ సాంకేతిక విద్య మహిళల జీవితాల్లో మార్పును తీసుకొస్తుందన్నారు.
లింగ సమానత్వ స్పందన: సమగ్ర భవిష్యత్ ను నిర్మిస్తున్నాం (Gender-Responsive Innovation: Building Inclusive Futures) అనే అంశంపై నిర్వహించిన చర్చా గోష్టికి మోడరేటర్ గా సిఐఐ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు జి. మురళీ కృష్ణ వ్యవహరించారు.
