రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

తాటి ముంజలకూ కష్టకాలం..

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news
Mounikadesk

తాటి ముంజలకూ కష్టకాలం.. 
General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news

ప్రకృతి మనకు ఎంతో చేస్తోంది. ఎన్నో ఆరోగ్యవంతమైన చెట్లు, పండ్లు, ఆకులను ఇస్తుంది. అయితే వాటిని గుర్తించడంలోనే మనిషి విఫలమవుతున్నాడు. అందుబాటులో ఉన్నవానిని సద్వినియోగం చేసుకోలేక.. ఏ చిన్న ఆరోగ్య సమస్య వచ్చిన వేల రూపాయలు ఆస్పత్రికి ఖర్చు పెడుతున్నారు. ఉచితంగా, సహజంగా అందే వాటిని దూరం పెడుతన్నారు. అయితే వైద్యులు కూడా సీజనల్‌ ఫ్రూట్స్‌ తీసుకోవాలని సూచిస్తుంటారు. కానీ, వాటిని పెద్దగా పట్టించుకోకుండా జంక్‌ ఫుడ్‌కు అలవాటు పడుతున్నారు. వయసుతో సంబంధం లేకుండా అందరూ రెడీమేడ్‌ ఫుడ్‌కు ప్రాధాన్యం ఇస్తున్నారు. తాటి ముంజలు దొరకవా.. ఇక ప్రస్తుతం తాటి ముంజల సీజన్‌. పది ఇరవై ఏళ్ల క్రితం వరకు తాటి ముంజలు మార్కెట్‌లో విరివిగా లభించేవి. ఇక ఊళ్లకు వెళితే.. గౌడన్నలు ఫ్రీగా కోసి ఇచ్చేవారు. చెట్టు మీది తాటి ముంజలు తింటే వచ్చే టేస్టే వేరు. కానీ, ప్రస్తుత పరిస్థితి చూస్తే తాటి ముంజలు కూడా రానురాను దొరకవేమో అనిపిస్తోంది. కోసేవారు లేక.. గ్రామాల్లో గీత కార్మికులు తగ్గిపోతున్నారు. గౌడ కుటుంబాలు ఉన్నా తాటి చెట్లు ఎక్కేవారు తగ్గిపోతున్నారు. ఒకప్పుడు ఊళ్లో ప్రతీ గౌడ కుటుంబంలో ఒకరిద్దరు గీత కార్మికులు ఉండేవారు. ఇప్పుడు ఊరికి కూడా ఇద్దరు ముగ్గురు మించి ఉండడం లేదు. దీంతో కల్లు గీసేవారు, తాటి ముంజలు కోసేవారు తగ్గిపోతున్నారు. సీజనల్‌గా తాటి ముంజలు అమ్మేవారు ఇబ్బంది పడుతన్నారు.

పెరుగుతున్న ధర.. తాటి ముంజలు కోసేవారు తగ్గిపోవడంతో తాటి ముంజల ధర కూడా పెరుగుతోంది. ఊళ్లో ఉండే ఇద్దరు ముగ్గురు గీత కార్మికులు తాటి చెట్టు ఎక్కి ముంజలు కోసి ఇవ్వడానికి డబ్బులు తీసుకుంటున్నారు. ఒకప్పటిలా ఫ్రీగా కోసి ఇవ్వడం లేదు. దీంతో వాటిని మార్కెట్‌కు, ఊళ్లకు తీసుకువచ్చి అమ్మేవారు ఎక్కువ ధరకు అమ్ముతున్నారు. ఒకప్పుడు రూపాయి, రెండు రూపాయలు ఉన్న ముంజలు ఇప్పుడు పది రూపాయలకుపైగా పలుకుతోంది. ముంజలు తీయడం ఇబ్బందే.. ఇక గీత కార్మికులు తాటికాయలు మాత్రమే కోసి ఇస్తున్నారు. ముంజలు తీయడం లేదు. దీంతో వాటిని అమ్మేవారే అమ్మే స్థలంలోనే కోసి ఇస్తున్నారు. గీత కార్మికులు నేర్పరితో కోయడం వలస సులభంగా ముంజలు తీస్తారు. కానీ మహిళలు ఒక కాయ కోడానికి ఐదు నిమిషాలు పడుతుంది. దీంతో కొనేవారు వేచి ఉండలేక వెళ్లిపోతున్నారు. నాణ్యత కూడా దెబ్బతింటోంది.

Comments

-Advertisement-