రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణా కార్యక్రమాల ద్వారా ఉద్యోగావకాశాలు
రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణా కార్యక్రమాల ద్వారా ఉద్యోగావకాశాలు
- సీడాప్ ఆధ్వర్యంలో త్వరలో డీడీయూజీకేవై 2.0 శిక్షణా కార్యక్రమాలు
- 15000 గ్రామీణ నిరుద్యోగ యువతకు మార్కెట్ అవసరాలకు అనుగుణంగా నైపుణ్య శిక్షణ
- ఆరోగ్యం, ఆటొమొబైల్, లాజిస్టిక్స్, హాస్పటాలిటీ, ఎలక్ట్రానిక్స్ సహా ప్రధాన రంగాల్లో శిక్షణ
- 3 నెలలపాటు ఉచిత శిక్షణ మరియు హాస్టల్ వసతి, శిక్షణ అనంతరం ఉద్యోగాల కల్పన
- ప్రాజెక్ట్ ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీలతో విస్తృత సమావేశం
రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణా కార్యక్రమాల ద్వారా ఉద్యోగావకాశాలు కల్పించేందుకు సీడాప్ (సొసైటీ ఫర్ ఎంప్లాయ్‌మెంట్ జనరేషన్ అండ్ ఎంటర్‌ప్రైజ్ డెవలప్‌మెంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్)మరిన్ని చర్యలు చేపట్టింది.
రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలతో గ్రామీణ యువతకు మార్కెట్ డిమాండ్ కు తగినట్టు నైపుణ్య శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు కల్పించడమే సీడాప్ ప్రధాన లక్ష్యమని అధికారులు తెలిపారు. ఇందులో భాగంగా సీడాప్ ఆధ్వర్యంలో అమలు చేస్తున్న డీడీయూ జీకేవై 2.0 కార్యక్రమం ద్వారా 15,000 గ్రామీణ యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చి ఉద్యోగావకాశాలు కల్పించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది.
ఇందుకోసం ప్రాజెక్టు ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీలతో (పీఐఏలు) సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రధానంగా పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా, యువతకు ఏఏ కోర్సుల్లో శిక్షణ ఇవ్వాలి, ఎలాంటి మౌలిక వసతులు కల్పించాలి అనే విషయాలపై చర్చించారు.
ఇందులో భాగంగా మార్కెట్ లో డిమాండ్ ఉన్న ఆరోగ్య రంగం, రిటైల్, లాజిస్టిక్ట్స్, ఎలక్ట్రానిక్స్, ఐటి మరియు ఐటిఈఎస్, హాస్పిటాలిటీ, ఆటోమొబైల్, సోలార్, బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్, నిర్మాణ రంగంలో శిక్షణ ఇవ్వాలని ప్రతిపాదించారు.
త్వరలో జరగనున్న ప్రాజెక్ట్ అప్రూవల్ కమిటీ సమావేశంలో వీటికి తుది అనుమతులు ఇవ్వనున్నారు. ఆయా రంగాల్లో (3) నెలల పాటు ఉచితంగా నివాసం, భోజనం, యూనిఫాం, స్టడీమెటీరియల్ కూడిన శిక్షణ ఇస్తారు.
శిక్షణ పూర్తయ్యాక అందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారు.
పూర్తి వివరాలకు www.seedap.gov. in ను సందర్శించగలరు
