ఎస్సీ, ఎస్టీ యువతకు ఉచితంగా యూపీఎస్సి సివిల్స్ కోచింగ్
ఎస్సీ, ఎస్టీ యువతకు ఉచితంగా యూపీఎస్సి సివిల్స్ కోచింగ్
దరఖాస్తు కి ఆఖరు తేది 26.11.2025
నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవాలి
అంబేద్కర్ స్టడీ సర్కిల్ డైరెక్టర్, IAS వి.ప్రసన్న వెంకటేష్
అమరావతి, నవంబర్, 23 : ఎస్సీ,ఎస్టీ నిరుద్యోగ యువతకు యూపీఎస్సీ సివిల్స్ ఉచిత శిక్షణ ఇస్తున్నామని అర్హులైన వారు సద్వినియోగం చేసుకోవాలని అంబేద్కర్ స్టడీ సర్కిల్ డైరెక్టర్ ఐఏఎస్ వి.ప్రసన్న వెంకటేష్ ఆదివారం నాడు విడుదల చేసిన పత్రిక ప్రకటనలో పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రాష్ట్రంలోని 340 మంది నిరుద్యోగ ఎస్సీ, ఎస్టీ యువతకు యూపీఎస్సి సివిల్స్ ప్రిలిమినరీ ఎగ్జామ్ కి ఉచిత శిక్షణ ఇవ్వనున్నాం.విజయవాడ,విశాఖపట్నం, తిరుపతి డా.బి.ఆర్ అంబేద్కర్ స్టడీ సర్కిళ్లలో ఈ శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. 4 నెలల శిక్షణా కాలంలో (10.12.2025 నుంచి 10.04.2026 వరకు) అభ్యర్థులకు ఉచిత వసతి, భోజన సౌకర్యం కల్పిస్తాం. ఈ నెల 13 నుంచి 26 వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించబడతాయి. దరఖాస్తుకు మరో మూడు రోజులలే మిగిలి ఉన్నందున అభ్యర్థులు త్వరగా చేసుకోవాలి. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు 30.11.2025 న స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించి మెరిట్ ఆధారంగా సీట్లు కేటాయిస్తాం. మహిళలకు 33 శాతం సీట్లు కేటాయిస్తాం. అర్హులైన వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి, మరిన్ని వివరాలకు https://apstudycircle.apcfss.in వెబ్ సైట్ ని సంప్రదించాలని అంబేద్కర్ స్టడీ సర్కిల్ డైరెక్టర్ వి.ప్రసన్న వెంకటేష్ తెలిపారు.
