బిజినెస్ ఎక్స్ పో ను విజయవంతం చేయాలి
బిజినెస్ ఎక్స్ పో ను విజయవంతం చేయాలి
• పరిశ్రమల స్థాపనకు రాష్ట్రం ఎంతో అనుకూలం
- సమాచార పౌర సంబంధాలు, గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి
డిసెంబర్ 12,13,14 తేదీల్లో ఏపీ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఫెడరేషన్ ఆధ్వర్యంలో బిజినెస్ ఎక్స్ పో ను నిర్వహిస్తున్నట్లు సమాచార పౌర సంబంధాలు, గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు.
ఏపీ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఫెడరేషన్ ఆధ్వర్యంలో డిసెంబర్ 12 నుండి 14 తేదీల్లో మూడు రోజుల పాటు విజయవాడ ఎస్ ఎస్ కన్వెన్షన్ లో నిర్వహించనున్న బిజినెస్ ఎక్స్ పో కు సంబంధించిన బ్రోచర్, ఏవీ లోగో ను లాంఛనంగా మంగళవారం గుణదలలోని హోటల్ హయత్ లో విడుదల చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిధిగా మంత్రి కొలుసు పార్థసారథి హాజరై మాట్లాడుతూ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే పారిశ్రమికవేత్తలను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సానుకూలతతో ముందుకు వెళ్లుతుందన్నారు. శాంతియుత వాతావరణంలో రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించేందుకు రాష్ట్రంలో పెట్టేందుకు ముందుకు వచ్చే వారి కోసం అనేక రాయితీలతో కొత్తగా పారిశ్రామిక పాలసీలను ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చిందన్నారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారధ్యం లో కూటమి ప్రభుత్వం రాష్ట్రానికి పెట్టుబడులను తీసుకొచ్చేందుకు అహర్నిశలు కృషి చేస్తుందన్నారు. పెట్టుబడులు తీసుకొచ్చేందుకు ప్రతి ఒక్కరూ కలిసి పనిచేయాలని ముఖ్యమంత్రి పిలుపినిచ్చారని ఈ నేపథ్యంలో ఏపీ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఫెడరేషన్ ముందుకు రావడం అభినందనీయమన్నారు. నూజివీడు లాంటి అభివృద్ధి చెందుతున్న పట్టణాల్లో పరిశ్రమల స్థాపనకు అనేక సానుకూల అంశాలు, మౌలిక వసతులు అందుబాటులో ఉన్నాయని, ఆ ప్రాంతంలో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రమిక వేత్తలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. బిజినెస్ ఎక్స్ పో ను పారిశ్రామిక వేత్తలు, వ్యాపారులు, ప్రజలు సద్వినియోగం చేసుకుని రాష్ట్రంలో పెట్టుబడుల ప్రవాహాన్ని పెంచేలా విజయవంతం చేయాలని దీనికి రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణ మద్దతు అందిస్తుందని మంత్రి పార్థసారథి పేర్కొన్నారు.
బిజినెస్ ఎక్స్ పో ప్రత్యేకతలు: గత సంవత్సరం బిజ్ నెస్ ఎక్స్ పో కంటే మెరుగ్గా ఈ ఏడాది నిర్వహించనున్నారు. ఈ వేదిక ద్వారా కొత్త ఉత్పత్తులను ఆవిష్కరించడం, పర్యాటక రంగం, ఫుడ్ ప్రాసెసింగ్, హాస్పిటాలటీ వంటి సెక్టార్స్ ఉంటాయన్నారు. సెమినార్ల నిర్వహణ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అనేకరకాల ఉత్పత్తులను ఈ వేదిక ద్వారా ప్రమోట్ చేయనున్నారు. ప్రతి రోజూ సాయంత్రం అనేక రకాల సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి.
కార్యక్రమంలో ఏపీ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఫెడరేషన్ అధ్యక్షులు పొట్లూరి భాస్కరరావు, జనరల్ సెక్రటరీ రావూరి సుబ్బారావు, కోశాధికారి ఎస్. అక్కయ్య నాయుడు, ఏపీ స్టార్ హోటల్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఆర్వీ స్వామి, తదితరలు పాల్గొన్నారు.
