అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులకు పోషకాహారం లోపం లేకుండా మంచి పోషకాహారాన్ని
అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులకు పోషకాహారం లోపం లేకుండా మంచి పోషకాహారాన్ని అందించాలి
పిల్లలు వయసుకు తగ్గ బరువు, ఎత్తుకు తగ్గ బరువు ఉండేలా చర్యలు తీసుకోవాలి
పిల్లల ఇళ్ళకు వెళ్ళి తల్లులకు పిల్లల ఆరోగ్యంపై అవగాహన కలిగించాలి
అంగన్వాడీ కేంద్రాల్లో స్థలం ఉన్న చోట కచ్చితంగా కిచెన్ గార్డెన్స్ పెంచాలి
-జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి
కర్నూలు, నవంబర్ 15 (పీపుల్స్ మోటివేషన్):-
అంగన్వాడీ కేంద్రాల్లో ఉన్న చిన్నారులకు పోషకాహారం లోపం లేకుండా మంచి పోషకాహారాన్ని అందించాలని జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి సిడిపిఓ లను ఆదేశించారు.
శనివారం కలెక్టరేట్ నుండి మహిళా,శిశు సంక్షేమానికి సంబంధించిన అంశాలపై సిడిపిఓ లతో జిల్లా కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వెనుకబడిన కర్నూలు జిల్లాలో అంగన్వాడీ కేంద్రాలను సమర్థవంతంగా నిర్వహించి, పిల్లలకు మంచి పోషకాహారాన్ని అందించాల్సిన బాధ్యత ఉందని పేర్కొన్నారు. ఉదయం 9 గంటలకి అంగన్వాడీ కేంద్రాలను తెరవాలని, కేంద్రాలకు పిల్లలందరూ వచ్చేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. పిల్లలకు పోషకాహారం లోపం లేకుండా, ఎత్తుకు తగ్గ బరువు, వయసుకు తగ్గ బరువు ఉండేలా మంచి పోషకాహారాన్ని అందించాలన్నారు.. కేంద్రాలు శుభ్రంగా నిర్వహించాలని, అలాగే పిల్లలు కూడా శుభ్రంగా ఉండేలా తల్లులకు అవగాహన కల్పించాలని కలెక్టర్ సూచించారు. ఎత్తుకు తగ్గ బరువు, వయసుకు తగ్గ బరువు ను ఎప్పటికప్పుడు చెక్ చేయాలని, ఏదైనా సమస్య ఉంటే డాక్టర్ వద్దకు తీసుకెళ్లేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
పిల్లల ఇళ్ళకు వెళ్ళి తల్లులకు పిల్లల ఆరోగ్యంపై అవగాహన కలిగించాలని, అలాగే పోషకాహారం లోపం, ఎత్తుకు తగ్గ బరువు, వయసుకు తగ్గ బరువు లేని పిల్లల తల్లులతో వాట్సప్ గ్రూపులు క్రియేట్ చేసి, అందులో పోషకాహారానికి సంబంధించిన వీడియోలు పోస్ట్ చేసి అవగాహన కల్పించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. సిడిపిఓ లు, సూపర్ వైజర్లు అంగన్వాడీ కేంద్రాలను ఆకస్మిక తనిఖీ లు చేయాలన్నారు. వారితో తరచూ సమావేశాలు ఏర్పాటు చేసుకుని సమీక్షలు నిర్వహించుకోవాలన్నారు. స్టాక్ రిజిస్టర్ లు నిర్వహించాలని, తప్పుడు వివరాలు నమోదు చేస్తే చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు. శిథిలమైన భవనాల్లో పిల్లలను ఉంచవద్దని, అలాంటి భవనాలు ఉన్న చోటఅద్దె భవనం లోకి వెళ్లాలని కలెక్టర్ సూచించారు.
అంగన్వాడీ కేంద్రాల్లో స్థలం ఉన్న చోట కచ్చితంగా కిచెన్ గార్డెన్స్ పెంచాలని, అందులో పిల్లలకు పోషకాహారం కోసం ఆకు కూరలు, కాయగూరలు పండించాలని సూచించారు.అంగన్వాడీ కేంద్రాల్లో ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ ముఖ్యం అని, పిల్లల కోసం కొన్ని వీడియోలు తయారు చేస్తున్నామని, వాటిని అంగన్వాడీ కేంద్రాల్లో ఉన్న టీవీల్లో ప్రదర్శించి పిల్లలకు చూపాలని కలెక్టర్ ఆదేశించారు.
అలాగే గర్భవతులకు టేక్ హోమ్ రేషన్ కింద అందిస్తున్న 11 ఐటమ్స్ కచ్చితంగా అందించాలని కలెక్టర్ ఆదేశించారు. టేక్ హోమ్ రేషన్ వచ్చిన రెండు రోజుల్లోపే అందించాలన్నారు.
మద్దికెర, హాలహర్వి, మంత్రాలయం మండలాలలో పిల్లలు వయసుకు తగ్గ బరువు అంశంలో వెనుకబడి ఉన్నారని, అలాగే కృష్ణగిరి, కల్లూరు,హాలహర్వి మండలాల్లో ఎత్తుకు తగ్గ బరువు అంశంలో వెనుకబడి పఉన్నారని, ప్రీస్కూల్ ఎడ్యుకేషన్ అంశంలో మద్దికెర, ఆలూరు, కర్నూల్ అర్బన్ మండలాలు వెనుకబడి ఉన్నాయని, ఈ అంశాల్లో పురోగతి తీసుకొని రావాలని కలెక్టర్ ఆయా మండలాలకు సంబంధించిన సిడిపిఓ లను ఆదేశించారు. ఎత్తుకు తగ్గ బరువు, వయసుకు తగ్గ బరువు అంశాల్లో ప్రత్యేక దృష్టి పెట్టి, రెండు నెలల లోపు పిల్లలందరూ సరైన విధంగా ఉండేలా చూడాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
వీడియో కాన్ఫరెన్స్ లో ఐసిడిఎస్ పిడి విజయ, సిడిపివోలు, సూపర్వైజర్లు పాల్గొన్నారు.
