పొగాకు కంపెనీలు రైతులతో ఎంఓయు చేసుకోవాలి
పొగాకు కంపెనీలు రైతులతో ఎంఓయు చేసుకోవాలి
-జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి
కర్నూలు, నవంబర్ 15 (పీపుల్స్ మోటివేషన్):-
నవంబర్ 30 వ తేది నాటికి పొగాకు కంపెనీలు అన్ని రకాల (HD BRG / HD Burley / Black Burley మినహాయించి) పొగాకు పంట సాగు కి సంబంధించిన రైతులతో తప్పనిసరిగా ఎంఓయు చేసుకొని కాపీ లను రైతులకు అందచేయాలని జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి పొగాకు కంపెనీలను ఆదేశించారు..
శనివారం కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్ లో జిల్లాలో పొగాకు కు సంబంధించిన జిల్లా టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశాన్ని కలెక్టర్ నిర్వహించారు..
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం సూచనల మేరకు రాబోయే రబీ 2025-26 సీజన్‌లో జిల్లాలో HD BRG / HD Burley / Black Burley రకాల పొగాకు పంట సాగును పూర్తిగా నిషేధించబడినట్లు కలెక్టర్ తెలిపారు. అందువలన అన్ని పొగాకు కంపెనీలు / ఎగుమతిదారులు రైతులను ఈ నిషేధిత రకాల పొగాకు సాగు చేయడానికి ప్రోత్సహించకూడదు, అలాగే రైతులతో ఎటువంటి ఒప్పందం (MoU) లేదా కొనుగోలు ఒప్పందం (Buyback Agreement) కుదుర్చుకోరాదు అని కలెక్టర్ ఆదేశించారు.
వైట్ బర్లీ రకం పొగాకు పంట సాగుపై నియంత్రణ అమలులో ఉందని, రైతులు మరియు పొగాకు కంపెనీలు తప్పనిసరిగా 100% బైబ్యాక్ ఒప్పందం (Buyback Agreement) కలిగిన అధికారిక ఒప్పందం లేదా చట్టబద్ధమైన MoU కుదుర్చుకోవాలని తెలిపారు. నవంబర్ 30 వ తేది నాటికి అన్ని రకాల (HD BRG / HD Burley / Black Burley మినహాయించి) పొగాకు పంట సాగు కి సంబంధించి పొగాకు కంపెనీలు రైతులతో తప్పనిసరిగా ఎంఓయు చేసుకొని కాపీ లను రైతులకు అందచేయాలని మరియు సంబంధిత వివరాలను వ్యవసాయ శాఖ అధికారులకు కూడా ఇవ్వాలని కలెక్టర్ పొగాకు కంపెనీ ప్రతినిధులను ఆదేశించారు..
పొగాకు సంబంధించిన టాస్క్ ఫోర్స్ కమిటీ లు డివిజన్, మండల స్థాయిలో కూడా జరిగే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు.. అదే విధంగా రైతుల నుండి కూడా ఒకరు ఈ కమిటీ సమావేశంలో పాల్గొనే విధంగా చూడాలన్నారు.. తద్వారా రైతులకు ఏమైనా సమస్యలు ఉంటే వారు ఇక్కడ ప్రస్తావించినట్లయితే వాటిని పరిష్కరించే దిశగా చర్యలు తీసుకునేందుకు వీలవుతుందని కలెక్టర్ తెలిపారు...
సమావేశంలో అదనపు ఎస్పీ (అడ్మిన్) హుస్సేన్ పీరా, జిల్లా వ్యవసాయ అధికారి వరలక్ష్మి, డి ఎమ్ హెచ్ ఓ డా.భాస్కర్ రాజు, సహాయ వ్యవసాయ సంచాలకులు మరియు పొగాకు కంపెనీ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
