రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

మారుతీ సరికొత్త చరిత్ర..

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news
Mounikadesk

మారుతీ సరికొత్త చరిత్ర..

న్యూఢిల్లీ, నవంబర్‌ 5 (పీపుల్స్ మోటివేషన్):

దేశంలోనే అతిపెద్ద కార్ మేకర్.. మారుతీ సుజుకీ రోజురోజుకూ రికార్డులు బద్ధలు కొడుతూ వెళ్తోంది. ఇటీవల నవరాత్రి పండగ సీజన్‌లో నెల రోజుల వ్యవధిలోనే 4 లక్షల బుకింగ్స్‌తో చరిత్ర సృష్టించగా.. ఇప్పుడు మొత్తం 3 కోట్లకుపైగా కార్ల విక్రయాలు జరిపింది. ఇందులో ఆల్టో మోడల్.. అత్యధికంగా అమ్ముడైన కార్ల జాబితాలో ఉంది. పూర్తి వివరాలు ఇప్పుడు మనం చూద్దాం.కొంత కాలంగా జనం అభిరుచి మారిపోయింది. ఒకప్పుడు కారు కొనుగోలు చేయాలంటే.. లక్షలకు లక్షలు వెచ్చించాలి.. ఇది ధనవంతులే కొనగలుగుతారన్నట్లు ఉండేది. ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. సామాన్యులకు కూడా అందుబాటు ధరల్లో.. కార్ల తయారీ కంపెనీలు మోడళ్లను తీసుకొస్తుండగా జనం విపరీతంగా కొనుగోలు చేస్తున్నారు. కనీసం ఇంటికి ఒక కారు ఉండేలా చూసుకుంటున్నారని చెప్పొచ్చు. ముఖ్యంగా సిటీల్లో ఇది ఎక్కువగా కనిపిస్తుంటుంది. రోడ్లపైకి వెళ్తే.. ఎన్ని కార్లు కనిపిస్తాయో అంతా చూసే ఉంటారు. మరోవైపు.. కొద్ది రోజుల కిందట కేంద్రం జీఎస్టీ రేట్లను చిన్న కార్లపై 28 నుంచి 18 శాతానికి తగ్గించింది. దీంతో ఆయా కార్ల ధరలు భారీగా దిగొచ్చాయి. దీనికి తోడు.. పండగ సీజన్ నేపథ్యంలో.. ఎంట్రీ లెవెల్ మోడల్స్ ఎక్కువగా విక్రయించేందుకు వాటిపై అదనపు డిస్కౌంట్లు ప్రకటించాయి.జీఎస్టీ రేట్లు తగ్గించిన నేపథ్యంలో.. దేశంలోనే అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ అప్పుడు చరిత్ర సృష్టించింది. నవరాత్రి సీజన్‌లో నెల వ్యవధిలోనే ఏకంగా 4 లక్షలకుపైగా బుకింగ్స్‌తో నం.1గా నిలిచింది. ఇంకా 2.50 లక్షలకుపైగా కార్లను విక్రయించింది. ఇప్పుడు మారుతీ సుజుకీ మరో చరిత్ర సృష్టించింది. 42 ఏళ్ల కిందట ప్రారంభమైన మారుతీ సుజుకీ.. దేశీయంగా రికార్డు స్థాయిలో 3 కోట్లకుపైగా కార్లను విక్రయించింది. ఈ మైల్‌స్టోన్ చేరిన తొలి భారతీయ కార్ల తయారీ కంపెనీగా నిలిచింది. ఇప్పటివరకు మరే కంపెనీ ఇంతటి స్థాయిలో కార్లను విక్రయించలేదు. ఇక్కడ టయోటా ఇండియా వంటి వాటికి విక్రయించినవి కూడా ఉన్నాయి. మారుతీ సుజుకీ ఇటీవలి కాలంలో తన కార్ సేల్స్‌ను భారీగా పెంచుకుంటూ వెళ్లింది.మొదటి కోటి కార్లను విక్రయించేందుకు 28 సంవత్సరాల 2 నెలల సమయం పట్టగా.. తర్వాతి కోటి కార్ల విక్రయాల్ని చేరుకునేందుకు కేవలం 7 సంవత్సరాల 5 నెలలు పట్టింది. తర్వాత మరో కోటి మార్కును చేరుకునేందుకు 6 సంవత్సరాల 4 నెలల సమయం పట్టింది. ఇది సుజుకీ పట్ల విశ్వసనీయతను, మార్కెట్ లీడర్‌షిప్‌ను చాటిచెబుతోంది.3 కోట్ల కార్ల విక్రయాల్లో మారుతీ సుజుకీ.. అన్నింటికంటే ఎక్కువగా ఆల్టో మోడల్ కార్లు విక్రయించింది. దీని వాటానే ఏకంగా 47 లక్షలకుపైగా ఉంది. మారుతీ సుజుకీ వ్యాగన్ ఆర్ మోడల్ కార్లు.. 34 లక్షలకుపైగా అమ్ముడుబోయాయి. మారుతీ సుజుకీ స్విఫ్ట్ కార్లను 32 లక్షలకుపైగా యూనిట్లు విక్రయించింది. ఇంకా కంపెనీ బెస్ట్ కాంపాక్ట్ SUV లుగా ఉన్న బ్రెజా, ఫ్రాంక్స్ వంటి మోడల్స్ కూడా టాప్- 10 బెస్ట్ సెల్లింగ్ మోడళ్లుగా ఉన్నాయి.ఈ కంపెనీ విషయానికి వస్తే.. 1983, డిసెంబర్ 14న ప్రారంభమైంది. మారుతీ 800 తొలి మోడల్. దశాబ్దాలుగా వినియోగదారుల ప్రాధాన్యత, అభిరుచికి అనుగుణంగా మారుతూ.. కంపెనీ 19 మోడళ్లలో 170కిపైగా వేరియంట్లను అందిస్తోంది.

Comments

-Advertisement-