పరిశోధన, ఆవిష్కరణలకు కొత్త దిశగా భారత్ అడుగులు
పరిశోధన, ఆవిష్కరణలకు కొత్త దిశగా భారత్ అడుగులు
— ప్రధాని మోదీ
న్యూఢిల్లీ, నవంబర్ 3 (పీపుల్స్ మోటివేషన్):
దేశంలో సైన్స్, టెక్నాలజీ, ఇన్నోవేషన్ రంగాలను మరింత బలోపేతం చేయాలన్న లక్ష్యంతో న్యూఢిల్లీలోని భారత్ మండపంలో నిర్వహించిన “ఎమర్జింగ్ సైన్స్, టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ కాన్‌క్లేవ్ (ESTIC) 2025” కార్యక్రమాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు.
ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ, భారత్ వేగంగా ఒక సజీవమైన పరిశోధన, అభివృద్ధి ఎకోసిస్టమ్‌ను నిర్మిస్తోందని అన్నారు. సైన్స్, విద్య, పరిశోధన, ఇన్నోవేషన్ రంగాల్లో ఉన్న ప్రముఖులను ఈ వేదిక ఒక చోటికి తీసుకువచ్చిందని తెలిపారు.
కార్యక్రమంలో భాగంగా రిసెర్చ్, డెవలప్‌మెంట్ అండ్ ఇన్నోవేషన్ స్కీమ్ ఫండ్ ను కూడా ఆయన ప్రారంభించారు. ఈ పథకం ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న పరిశోధకులు, శాస్త్రవేత్తలు తమ ఆవిష్కరణలకు ఆర్థిక మద్దతు పొందే అవకాశం ఉందని ప్రధాని వివరించారు.
భారత యువత సృజనాత్మకత, పరిశోధనా చాతుర్యంతో ప్రపంచానికి మార్గదర్శకులుగా నిలుస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. సాంకేతికత ఆధారంగా “వికసిత్ భారత్” సాధ్యమవుతుందన్న నమ్మకాన్ని ప్రధాని మోదీ ఈ సందర్బంగా వ్యక్తం చేశారు.
