రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

వేదికపై రోడ్డు కోసం విన్నపం… సభ ముగిసేలోగా మంజూరు

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news
Mounikadesk

వేదికపై రోడ్డు కోసం విన్నపం… సభ ముగిసేలోగా మంజూరు 

  • నిమిషాల్లో పని పూర్తి చేసిన ఉప ముఖ్యమంత్రి  పవన్ కళ్యాణ్ 
  • అల్లూరి సీతారామరాజు జిల్లా నుంచి కానిస్టేబుల్ గా ఎంపికైన  లాకే బాబూరావు తన గ్రామానికి రోడ్డు సౌకర్యం కోరారు.
  • రోడ్డు బాధ్యతను ఉప ముఖ్యమంత్రివర్యులకు అప్పగించిన  సీఎం  చంద్రబాబు నాయుడు 
  • నిమిషాల్లో 2 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణానికి పరిపాలనా అనుమతులు 
  • రూ. 2 కోట్లు మంజూరు చేసిన  పవన్ కళ్యాణ్ 

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news

కానిస్టేబుల్ నియామక పత్రాల ప్రదానం కార్యక్రమం వేదికగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి  పవన్ కళ్యాణ్  విన్నపం విన్న నిమిషాల వ్యవధిలో రహదారి మంజూరు చేశారు. కానిస్టేబుల్ గా నియమితుడైన గిరిజన యువకుడు  లాకే బాబూరావు తన సక్సెస్ స్టోరీ వివరించే క్రమంలో తన గ్రామానికి రోడ్డు వేయించమని  ముఖ్యమంత్రి  చంద్రబాబు నాయుడు ని కోరారు.  బాబూరావు కోరిక మేరకు అతని గ్రామానికి రోడ్డు వేసే బాధ్యతను వేదికపై ఉన్న ఉప ముఖ్యమంత్రివర్యులకు అప్పగించారు. అల్లూరి సీతారామరాజు జిల్లా, జీకే వీధి మండలం, దేవరపల్లి పంచాయతీ పరిధిలోని తెనుములబండ గ్రామానికి చెందిన బాబూరావు చెప్పిన వివరాల మేరకు  పవన్ కళ్యాణ్  అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. తక్షణం రోడ్డు నిర్మాణానికి అవసరమైన అంచనాలు రూపొందించి, అనుమతులు ఇవ్వాలని స్పష్టం చేశారు. ఉపముఖ్యమంత్రివర్యుల ఆదేశాలతో ఆఘమేఘాలపై కదిలిన యంత్రాంగం తెనుములబండ నుంచి ఎలుగురాతిబండ వరకు 2 కిలోమీటర్ల మేర రూ. 2 కోట్లతో బీటీ రోడ్డు నిర్మాణానికి అంచనాలు సిద్ధం చేసి  పవన్ కళ్యాణ్  తెలిపారు. 

ఉప ముఖ్యమంత్రి ఆదేశాలకు అనుగుణంగా ఏఎస్ఆర్ జిల్లా కలెక్టర్ పరిపాలన అనుమతులు ఇచ్చారు. వేదిక మీద రోడ్డు గురించి విజ్ఞప్తులు చేయగా సభ ముగిసేలోగా రోడ్డు మంజూరు చేశారు ఉప ముఖ్యమంత్రి  పవన్ కళ్యాణ్ 

Comments

-Advertisement-