ప్రేమ, శాంతి, కరుణ సమ్మిళితం క్రిస్మస్ పండుగ
ప్రేమ, శాంతి, కరుణ సమ్మిళితం క్రిస్మస్ పండుగ
జిల్లా ప్రజలకు క్రిస్మస్ పండుగ ముందస్తు శుభాకాంక్షలు
రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖా మంత్రివర్యులు టి.జి.భరత్.
కర్నూలు, డిసెంబర్ 15 (పీపుల్స్ మోటివేషన్):-
ప్రేమ, శాంతి, కరుణ సమ్మిళితం క్రిస్మస్ పండుగ అని, క్రిస్మస్ పండుగ సందర్భంగా జిల్లా ప్రజలకు ముందస్తు శుభాకాంక్షలు రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖా మంత్రివర్యులు టి.జి.భరత్ తెలిపారు.
సోమవారం కలెక్టరేట్ సునయన ఆడిటోరియంలో "క్రిస్మస్" పండుగ సందర్భంగా మైనార్టీ సంక్షేమ శాఖ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన "హై-టి" కార్యక్రమంలో రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టి.జి.భరత్, జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి, తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టి.జి.భరత్ మాట్లాడుతూ డిసెంబర్ నెలలో ప్రపంచవ్యాప్తంగా జరిగే అతి పెద్ద పండుగ క్రిస్మస్ అని, క్రిస్మస్ అనే పండుగ ఒక మతానికి సంబంధించిన పండుగ కాదని, ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ఒక్కరు జరుపుకునే పండుగ అన్నారు.. పరస్పరం ప్రేమతో, శాంతి తో నడుచుకోవాలన్న ఏసుక్రీస్తు బోధనలను పాటించాలని మంత్రి సూచించారు.
కర్నూలు జిల్లాలో 129 పాస్టర్ లకు 7 నెలల గౌరవ వేతనాన్ని 45,15, 000/- లను ప్రభుత్వం ఇవ్వడం జరిగిందన్నారు.. జిల్లాలో 182 లక్షల రూపాయల విలువ చేసే చర్చి కి సంబంధించిన ప్రతిపాదనలు జిల్లా నుండి పంపడం జరిగిందన్నారు.. నగరంలో బీసీ, కాపు భవనాలకు , మైనారిటీకి సంబంధించిన యూనివర్సిటీ కి తన వంతు సహాయ సహకారాలు అందించడం జరిగిందని, అదే విధంగా నగరంలో క్రైస్తవులకు ఏ పని చేస్తే బాగుంటుందనే దాని మీద క్రైస్తవ సోదరులు చర్చించి తన దృష్టికి తీసుకొని వచ్చినట్లయితే అందుకు తగిన సహాయ సహకారాలు అందిస్తానన్నారు..
జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి మాట్లాడుతూ ఏసుప్రభు జీవితమే మానవాళికి ఒక సందేశం అన్నారు. ఎదుటివారిని ఎలా ప్రేమించాలి, సాటివారి పట్ల ఎలాంటి కరుణ కలిగి ఉండాలి అనే విషయాలను ప్రభువు బోధనల ద్వారా తెలుసుకోవచ్చని పేర్కొన్నారు. ఇతరులతో సమన్వయంగా ఎలా జీవించాలి, సమాజంలో సహాయం అవసరమైన వారికి ఎలా సహాయం చేయాలి వంటి విలువలు ఏసుప్రభు జీవితంలో స్పష్టంగా కనిపిస్తాయన్నారు. ఇవన్నీ ప్రతి ఒక్కరు తమ జీవితాల్లో ఆచరించాల్సిన విషయాలన్నారు. క్రిస్మస్ పండుగ సందర్భంగా అందరికీ ముందస్తు శుభాకాంక్షలు తెలియజేశారు...
జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్ మాట్లాడుతూ ప్రతి రంగంలోనూ ప్రజలు అందరికీ సమాన హక్కులు ఉన్నాయన్నారు.. యేసుప్రభువు బోధనలు ప్రేమ, కరుణ, సేవ భావనతో నిండి ఉన్నాయని, వాటిని ప్రతి ఒక్కరు తమ జీవితంలో ఆచరించాలని జాయింట్ కలెక్టర్ సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సంక్షేమం కొరకు అనేక ప్రభుత్వ పథకాలను ప్రవేశ పెట్టారన్నారు..
అనంతరం క్యాండిల్ లైట్ సర్వీస్ మంత్రి, కలెక్టర్, జాయింట్ కలెక్టర్ పాల్గొన్నారు..
కార్యక్రమంలో బొందిల్ల కార్పొరేషన్ చైర్మన్ విక్రమ్ సింగ్, హజ్ కమిటీ మెంబర్ మన్సూర్ అలీ ఖాన్, మైనారిటీ సంక్షేమ అధికారి సబీహా పర్వీన్, క్రైస్తవ మత పెద్దలు, సీనియర్ పాస్టర్లు, పాస్టర్లు, క్రైస్తవ సోదరులు తదితరులు పాల్గొన్నారు.


