పార్టీకి-ప్రజలకు వారధి… క్రియా వాలంటీర్
General News
Latest news
Fast telugu news
Telugu short news
Telugu intresting news
Intresting facts
Telugu daily updates
Andhra Pradesh
Telangana news
By
Mounikadesk
పార్టీకి-ప్రజలకు వారధి… క్రియా వాలంటీర్
- ఎన్నో పోరాటాలు చేస్తే ఇక్కడిదాకా వచ్చాం
- సమష్టిగా ఇంకెన్నో అద్భుతాలు సాధించవచ్చు
- Pawan Kalyan వ్యక్తిత్వాన్ని ఆదర్శంగా తీసుకుని పని చేద్దాం
- ఉమ్మడి విశాఖపట్నం రూరల్ జిల్లా సమావేశంలో ఎమ్మెల్సీ, జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి Naga Babu
క్రియా వాలంటీరుగా పని చేసే వీర మహిళలు, జన సైనికులు జనసేన పార్టీకి-ప్రజలకు వారధి లాంటి వారని ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సభ్యులు, జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కె.నాగబాబు స్పష్టం చేశారు. పెందుర్తి నియోజకవర్గం శాసన సభ్యులు, ఉమ్మడి విశాఖపట్నం రూరల్ జిల్లా అధ్యక్షులు పంచకర్ల రమేష్ అధ్యక్షతన పెందుర్తిలో శుక్రవారం జరిగిన జనసేన కార్యకర్తల జిల్లా విస్తృత స్థాయి సమావేశంలో కె. నాగబాబు మాట్లాడారు. పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం, అభిమానం అనే మాటతో ఆగిపోకుండా ఆయన వ్యక్తిత్వాన్ని, ఆయన త్యాగాన్ని ఆదర్శంగా తీసుకుని పని చేస్తే సామాజిక లక్ష్యాలను సాధించవచ్చని వెల్లడించారు. క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమంలో స్వల్ప మార్పులు, చేర్పుల కారణంగా సభ్యత్వ నమోదు కాసింత ఆలస్యం అవుతోందని సాధ్యమైనంత త్వరలో పవన్ కళ్యాణ్ స్వయంగా ప్రకటించి సభ్యత్వ నమోదు మొదలుపెడతారని అన్నారు. పార్టీని మరింత బలోపేతం చేసుకునేందుకుగానూ సభ్యత్వ నమోదు సంఖ్య పెంచాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరిపై ఉంటుందని అన్నారు. గత దశాబ్ద కాలంలో ఎన్నో పోరాటాలు చేస్తే ఇక్కడిదాకా వచ్చామని, పార్టీ కోసం పని చేసిన ఏ వ్యక్తిని విస్మరించే ప్రసక్తే ఉండదని అన్నారు. ఓర్పుతో సమష్టిగా పని చేస్తే ఇంకెన్నో అద్భుతాలు సాధించవచ్చని చెప్పారు. కూటమి పొత్తు ధర్మంలో భాగంగా, రాష్ట్రస్థాయిలో ఉన్న అవకాశాలు, సర్దుబాట్లకు అనుగుణంగా పదవులు కేటాయిస్తున్నట్లు తెలిపారు. ఓపికతో పని చేసే ప్రతి ఒక్కరికీ అవకాశం లభిస్తుందన్నారు. కేవలం మన కోసం మనం అన్నట్టుగా కాకుండా, మన పరిసరాలు, మౌలిక సదుపాయాలు, భవిష్యత్తు తరాల కోసం పనిచేద్దాం అని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా స్థానిక నాయకులు, కార్యకర్తలు నాగబాబు గారిని గజమాలతో సత్కరించారు. పలువురు వినతి పత్రాల ద్వారా తమ సమస్యలను నాగబాబు దృష్టికి తీసుకు వచ్చారు. ఈ కార్యక్రమంలో ఎలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్, పంచకర్ల సందీప్, పీ.వీ.ఎస్.ఎన్. రాజు, గడ్డం బుజ్జీ, వంపూరి గంగులయ్య, రాయపురెడ్డి కృష్ణ, శివదత్, బట్టు సూర్యకుమారి, సింహాచలం, రమణ, లక్ష్మీ చౌదరి, కిరణ్ ప్రసాద్, నాగసుధ తదితరులు పాల్గొన్నారు.
Comments
