ప్రకాశం జిల్లా-దోర్నాల
ప్రకాశం జిల్లా-దోర్నాల.
- వెలిగొండ తో వెలుగులు
- ప్రాజెక్ట్ 2026 కల్లా పూర్తి చేస్తాం
- పనుల రోజువారి లక్ష్యాలు పెంచాం
- సమీక్ష సమావేశంలో జల వనరుల శాఖ మంత్రి నిమ్మల
- ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేతులు మీదుగా భూమి పూజ చేసుకున్న
వెలిగొండ ప్రాజెక్ట్ పనులు 2026 కి పూర్తి చేయాలని పట్టుదలతో పని చేస్తున్నట్లు రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. శుక్రవారం ఈ ప్రాజెక్టుకు సంబంధించిన
టన్నెల్ లో 18 కి. మీ లోపలి వరకు ఆయన ప్రయాణించి, క్లిష్టమైన లైనింగ్ పనులు పరిశీలించారు.
ఈ సందర్భంగా స్దానిక రైతులతో కలసి ప్రాజెక్టు పనుల పురోగతిపై ఇరిగేషన్ అధికారులు, ఏజెన్సీలతో ఆయన సమీక్ష నిర్వహించారు. ప్రాజెక్టు పరిధిలో ఇప్పుడు జరుగుతున్న పనులతో పాటు డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్ వరకు పూర్తి చేయడానికి మరో మూడు నుంచి నాలుగు వేల కోట్లు అవసరమవుతాయని మంత్రి స్పష్టం చేశారు. ఇన్ని పనులు ఉండగా.. ఈ ప్రాజెక్టు పూర్తయిపోయిందని.. జగన్మోహన్ రెడ్డి జాతికి అంకితం చేయడం ఎంత విడ్డూరమో ఆలోచించాలన్నారు. రాష్ట్ర చరిత్రలో దగా కి మోసానికి జగన్ బ్రాండ్ అంబాసిడర్ గా మంత్రి నిమ్మల ఎద్దేవా చేశారు.
వెలిగొండ ప్రాజెక్టు లో జగన్ చేసిన తప్పిదాలు మోసం, దగా, జిల్లా రైతులకు తెలియాలనే రైతులతో కలసి సమీక్ష నిర్వహించినట్లు ఆయన పేర్కొన్నారు .
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక హెడ్ రెగ్యులేటర్లో 2200 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులు పూర్తి చేశామని ఆయన స్పష్టం చేశారు. 18నెలల కాలంలోనే టన్నెల్స్ లో క్లిష్టమైన 3 కి.మీ లైనింగ్ పనులు పూర్తి చేసినట్లు చెప్పారు. ప్రస్తుతం 4 గ్యాంట్రీలతో రోజుకు 12 మీటర్ల లైనింగ్ పనులు చేస్తుండగా, గ్యాంట్రీల సంఖ్యను పెంచి లక్ష్యం మేరకు పనులు పూర్తి చేయాలని ఏజెన్సీని ఆదేశించామని ఆయన అన్నారు.
ఫీడర్ కెనాల్ లో 45వేల క్యూబిక్ మీటర్ల హార్డ్ రాక్ పనులు చేయాల్సి ఉండగా ఇప్పటికే 28వేల క్యూబిక్ మీటర్లు పనులు పూర్తి చేసినట్లు వివరించారు.
ఫీడర్ కెనాల్ లైనింగ్, రిటైనింగ్ వాల్ నిర్మాణం కోసం 456 కోట్లతో టెండర్లు ప్రక్రియ పూర్తి చేసినట్లు పేర్కొన్నారు.
ఈ డిసెంబర్ లోనే పనులు మొదలుపెట్టి, సీజన్ వచ్చేలోపు పూర్తి చేయాలని ఏజెన్సీని ఆదేశించామన్నారు.
తీగలేరు కెనాల్ కు సంబందించి 600మీటర్ల టన్నెల్ లైనింగ్ చేసి, గేట్లు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.
నల్లమల సాగర్ ముంపుతో 9.6 కి.మీ పర్మినెంట్ డైవర్షన్ రోడ్డు నిర్మాణ పనులు మొదలు పెట్టామన్నారు .
మొంథా తుఫాన్ కారణంగా దెబ్బతిన్న ఫీడర్ కెనాల్ గండ్లు పూడ్చి, జంట సొరంగాల్లో డీవాటరింగ్ పనులను పూర్తి చేసి, లైనింగ్ పనులు కొత్త లక్ష్యాలు నిర్దేశించి వేగంగా చూస్తున్నామన్నారు .
కూటమి హయాంలో పనుల పురోగతి ఇలా ఉండగా
వెలిగొండ ప్రాజెక్టు కు ఉత్తుత్తి ప్రారంభం చేసి, జాతికి అంకితం చేసిన జగన్ చరిత్రహీనుడుగా మిగిలిపోయాడన్నారు .
ఆర్దిక పరిస్దితి సహకరించకపోయినా, జగన్ విధ్వంసం చేసిన ఇరిగేషన్ రంగాన్ని చంద్రబాబు గాడిలో పెట్టారని ఆయన సోదాహరణంగా చెప్పారు.
వెలిగొండ ప్రాజెక్టును ప్రాధాన్యత ప్రాజెక్టుగా గుర్తించి, పూర్తి చేయాలని సిఎం చంద్రబాబు అనుక్షణం మమ్మల్ని ప్రోత్సహిస్తూ పరుగులు పెట్టిస్తున్నారని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు ముందు నిర్ణయించుకున్న లక్ష్యాలకు అనుగుణంగా
వెలిగొండ ప్రాజెక్టు పనులు పూర్తి చేసేలా నిరంతరం పర్యవేక్షణ చేస్తున్నామని మంత్రి రామానాయుడు చెప్పారు.
2026 నాటికి వెలిగొండ పూర్తి చేసి నల్లమలసాగర్ ను కృష్ణాజలాలతో నింపుతామని ఆయన స్పష్టం చేశారు.
