రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

మధ్యాహ్నం మాటిచ్చారు.. సాయంత్రానికి రోడ్లు మంజూరు చేశారు..

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news
Mounikadesk

మధ్యాహ్నం మాటిచ్చారు.. సాయంత్రానికి రోడ్లు మంజూరు చేశారు..

అంధ క్రికెటర్ల వేదనకు చలించిన ఉప ముఖ్యమంత్రి  పవన్ కల్యాణ్  

• జట్టు కెప్టెన్ దీపిక, సభ్యురాలు పాంగి కరుణ కుమారి కుటుంబాలకు టీవీ, ఫ్యాన్, ఇతర గృహోపకరణాలు, నిత్యావసరాలు, నూతన వస్త్రాలు, దుప్పట్లు పంపించిన ఉప ముఖ్యమంత్రివర్యులు 

• 24 గంటల్లో ప్రపంచకప్ విజేతల కుటుంబాలకు గృహోపకరణాలు

• అంధ క్రికెటర్ల ఇళ్లలో వస్తు కాంతులు

• తంబలహట్టి తండా, వంట్ల మామిడి గ్రామాలకు వెళ్ళి అందించిన జనసేన నాయకులు, యంత్రాంగం 

• నూతన గృహాల నిర్మాణంపై పర్యవేక్షించాలని పేషీకి దిశానిర్దేశం  

• ఇప్పటికే కెప్టెన్ దీపిక స్వగ్రామానికి రూ.6.2 కోట్లతో రెండు రోడ్లు మంజూరు

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news

ఎవరు సమస్య చెప్పుకున్నా మనసు పెట్టి విని, స్పందించి తక్షణ పరిష్కారం చూపించే దిశగా అడుగులు వేసే నాయకుడు రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ . అది ప్రభుత్వపరంగా చూపే పరిష్కారం అయినా, వ్యక్తిగతంగా ఇచ్చే భరోసా అయినా గంటల వ్యవధిలో పూర్తి చేయాలనుకుంటారు. కష్టం వింటే కరిగిపోతారు. అంధుల క్రికెట్ లో ప్రపంచ విజేతలుగా నిలిచిన మహిళా జట్టు సభ్యులను కలసిన సందర్భంలో వారి కుటుంబాల దైన్య స్థితి విని చలించిపోయారు. మ్యాచ్ ఫీజుతో కుటుంబ సభ్యుల ఆకలి తీరుస్తున్నామన్న జట్టు కెప్టెన్ దీపిక మాటలకు చలించిపోయారు. శ్రీసత్యసాయి జిల్లాకు చెందిన దీపిక, అల్లూరి సీతారామరాజు జిల్లాకు చెందిన పాంగి కరుణ కుమారి కుటుంబాల పరిస్థితిని తెలుసుకున్నారు. ఆ కుటుంబాలకు తక్షణ సాయం అందించాలని పవన్ కల్యాణ్  నిర్ణయం తీసుకున్నారు. 

శ్రీ సత్యసాయి జిల్లా తంబలహట్టి తండాలో దీపిక కుటుంబానికి, అల్లూరి సీతారామరాజు జిల్లా వంట్లమామిడిలో కరుణ కుమారి కుటుంబానికీ టీవీ, టేబుల్ ఫ్యాను, మిక్సర్ గ్రైండర్, కుర్చీలు, చాపలు, స్టీల్ ప్లేటులు, ప్రెషర్ కుక్కర్లు, ఇస్త్రీ పెట్టె, ఎల్.ఇ.డి. బల్బులు, పాత్రలు, దుప్పట్లు, దిండులు, కుటుంబం మొత్తానికి నూతన వస్త్రాలు, నిత్యావసర సరకులు లాంటివి అందించారు. కెప్టెన్ దీపిక కుటుంబానికి అనంతపురం, హిందూపురం అర్బన్ డెవలప్ మెంట్ అధారిటీ ఛైర్మన్  టి.సి. వరుణ్,  పొదిలి బాబూరావు, కుమ్మరి నాగేంద్ర,  ఆకుల ఉమేశ్,  అంకె ఈశ్వరయ్య, డి.మణిప్రియ,  శ్రీదేవి,  ఆనంద్ తదితర జనసేన నేతలు తంబలహట్టి తండాకు వెళ్లి పవన్ కళ్యాణ్  పంపిన వస్తు సామాగ్రిని అందజేశారు. పాడేరు ఘాట్ రోడ్డులోని వంట్లమామిడి గిరిజన గ్రామంలో నివసిస్తున్న కరుణకుమారి కుటుంబానికి రాష్ట్ర జానపద కళలు, సృజనాత్మక అకాడమీ ఛైర్మన్ వంపూరు గంగులయ్య, విశాఖ జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్  వన్నెంరెడ్డి సతీష్ కుమార్, జనసేన నేతలు పి.శివ ప్రసాద్,  కె.రామారావు, ఎన్ మురళీకృష్ణ చేతుల మీదుగా అందించారు.

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news

• మధ్యాహ్నం మాటిచ్చారు.. సాయంత్రానికి రోడ్లు మంజూరు చేశారు..

శుక్రవారం మధ్యాహ్నం జట్టు  పవన్ కల్యాణ్ ని కలిసిన సందర్భంలో దీపిక మాట్లాడుతూ మడకశిర నియోజకవర్గం పరిధిలోని తమ ఊరికి వెళ్లే రెండు రహదారులు ప్రయాణానికి యోగ్యంగా లేవని ఆవేదన వ్యక్తం చేశారు. మధ్యాహ్నం ఆమె మాటలు విన్న  పవన్ కళ్యాణ్  ఆ రెండు రహదారులు మంజూరు చేయాలని  సత్యసాయి జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు.  పవన్ కళ్యాణ్  ఆదేశాలతో కదిలిన అధికారులు హేమవతి పంచాయతీ పరిధిలో ఉన్న తంబలహట్టి తండా రోడ్లను పరిశీలించారు. హేమవతికి వెళ్లే రహదారికి రూ. 3.2 కోట్లు, గున్నేహళ్లికి వెళ్లే రోడ్డు నిర్మాణానికి రూ. 3 కోట్లు అవసరం అని అంచనాలు రూపొందించారు. ఈ రెండింటికీ  పవన్ కళ్యాణ్  ఆదేశాల మేరకు శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ పాలనాపరమైన అనుమతులు ఇచ్చారు.

• 24 గంటల్లో నూతన గృహోపకరణాలు, నిత్యావసరాలు ఏర్పాటు

దీపిక, కరుణ కుమారి వేదనకు చలించిపోయి వారి కుటుంబాలకు గృహోపకరణాలు, నిత్యావసరాలను తక్షణమే సమకూర్చాలని తన సిబ్బందిని ఆదేశించారు. ఈ మేరకు వాటిని కొనుగోలు చేసి ఆయా కుటుంబాలకు పంపించారు. ఇద్దరు తెలుగు క్రికెటర్లకు క్రీడాకారుల కోటా కింద నూతన గృహాలు నిర్మించి ఇచ్చేందుకు ఏర్పాట్లు చేయాలని  పవన్ కళ్యాణ్  అధికారులకు దిశానిర్దేశం చేశారు. నూతన గృహాల నిర్మాణం పూర్తయిన తర్వాత వాటికి తగిన విధంగా డైనింగ్ టేబుల్స్, మంచాలు లాంటి మరికొన్ని గృహోపకరణాలు సమకూర్చాలని నిర్ణయించారు.

Comments

-Advertisement-