రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

రైతులకు అన్యాయం జరగకుండా ప్రతి ధాన్యపు గింజ ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news
Mounikadesk

రైతులకు అన్యాయం జరగకుండా ప్రతి ధాన్యపు గింజ ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది 
General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news

మచిలీపట్నం, డిసెంబర్ 14:

రైతులకు అన్యాయం జరగకుండా ప్రతి ధాన్యపు గింజ ప్రభుత్వమే కొనుగోలు చేసి ఎక్కడ లేని విధంగా 24 గంటల్లో పైకం చెల్లిస్తుందని రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు గృహ నిర్మాణ శాఖ మంత్రివర్యులు కొలుసు పార్థసారథి పేర్కొన్నారు. 

ఆదివారం మంత్రివర్యులు రాష్ట్ర గౌడ సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ వీరంకి వెంకట గురుమూర్తి జన్మదిన వేడుకలలో భాగంగా తొట్ల వల్లూరులో ప్రభుత్వ వైద్యులు ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని, రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. 

ఈ సందర్భంగా మంత్రివర్యులు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ తాను రైతు బిడ్డ అని, రైతుల కష్టాలు తెలుసని, రైతులకు మేలు చేయాలని ఉద్దేశంతోనే తాను శనివారం కఠినంగా వ్యవహరించి ప్రభుత్వ నిబంధనల ప్రకారం ధాన్యం డబ్బులు రైతులకు చెల్లించే ఏర్పాటు చేశామన్నారు. 

శనివారం జరిగిన సంఘటనను వివరిస్తూ మంత్రివర్యులు కొంతమంది రైతులు రైస్ మిల్లర్ల నుండి తడిసిన ధాన్యం సంబంధించి నష్టపోతున్నట్లు తన దృష్టికి తీసుకొని వచ్చారన్నారు. ఈ విషయమై అధికారులతో మాట్లాడడం మాట్లాడటం జరిగిందన్నారు. తన సొంత ఊరు కారకంపాడు నుండి వస్తుంటే పక్క గ్రామం అయిన పెద్ద ముత్తేవి నుండి 3 లారీల ధాన్యం లోడ్ చేసుకుని వెళుతుంటే ఆ లారీలను ఆపి ఎక్కడి నుండి వస్తున్నాయి, ధాన్యం ఎంతకు కొనుగోలు చేశారు అని లారీ డ్రైవర్ను అందులోని వారిని అడిగితే తమకు తెలియదని తాము కేవలం రవాణాకు చెందిన వాళ్ళమని గుడివాడ రైల్వే షెడ్ లో వ్యాగిన్స్ లో లోడ్ చేసుకునేందుకు తీసుకెళుతున్నట్లు చెప్పారన్నారు. ఎవరు కొన్నారు వారిని పిలిపించాలని పక్క గ్రామమే కదా అని వారిని అడిగితే ప్రక్క గ్రామం నుండి వారు వచ్చారన్నారు. నాతో మొదట 1550 అని ఆ తరువాత 1450 రూపాయలకు కొనుగోలు చేసినట్లు చెప్పారన్నారు. అంత తక్కువకు కొనుగోలు ఎలా చేశారని చేసే అధికారం ఎవరిచ్చారని ప్రశ్నించానన్నారు. వెంటనే గోనెసంచిలో నుండి ధాన్యాన్ని బయటకు తీసి తేమ శాతం పరీక్షించే యంత్ర పరికరాన్ని తెప్పించి పరిశీలించగా 22% తేమ ఉందన్నారు

అడిగితే ధాన్యం రంగు మారిందని చెప్పారు. అక్కడే ఒక బేరగాడు ఉంటే ధాన్యాన్ని అరచేతిలో వేసుకుని నూరితే లోపల బియ్యం ఎక్కడ రంగు మారలేదన్నారు.

బియ్యం అంతా బాగానే ఉన్నా నూక రంగు మారితే మీకు వచ్చే నష్టమేంటని ప్రశ్నించామన్నారు. ఎవరు దీన్ని తక్కువ ధరకు కొనమని చెప్పారని అంటూ రైతు సేవా కేంద్రంలోని సాంకేతిక సిబ్బందిని పిలిపించామన్నారు. 

తేమ శాతం పరికరాన్ని అప్పటికప్పుడు తెప్పించామన్నారు. తేమశాతం పరిశీలిస్తే 22 శాతం ఉందని ధాన్యం బాగుందని ప్రభుత్వ నిబంధనల ప్రకారం తేమశాతం 17 కంటే ఎన్ని పాయింట్లు ఎక్కువ ఉంటే అన్ని కిలోల బియ్యం తగ్గించుకోవలసి ఉంటుందన్నారు. ఆ ప్రకారం 5 కిలోల బియ్యానికి కిలో 24 రూపాయల చొప్పున 120 రూపాయలు తగ్గించాల్సి ఉంటుందన్నారు. ఆ ప్రకారం 1450 రూపాయలు కొనుగోలు చేయడం ఏంటని మిల్లర్లతో మాట్లాడటం జరిగిందన్నారు. 1650 రూపాయలు చెల్లిస్తే గాని లారీలను వెళ్ళనివ్వమని గట్టిగా చెప్పడం జరిగిందన్నారు

ఈ సందర్భంగా సాక్షి దినపత్రిక విషయాన్ని పక్కదారి పట్టించడంతో తాను పరుషంగా మాట్లాడవలసి వచ్చిందన్నారు. 

గత ప్రభుత్వం లాగా రైతులకు డబ్బులు ఎగ్గొట్టే ఆలోచన తమ ప్రభుత్వానికి లేదని స్పష్టం చేశారు. అనా పైసలతో సహా నిబంధనల ప్రకారం ప్రతి రైతు పండించిన పంటకు ధర చెల్లించడమే తమ ప్రభుత్వ లక్ష్యం అన్నారు. 

దేశంలో ఎక్కడా లేనివిధంగా 24 గంటల్లోనే ధాన్యం డబ్బులు రైతులకు చెల్లిస్తున్న ప్రభుత్వం తమదేనన్నారు.

దాదాపు 20 వేల కోట్ల రూపాయల విధులను ధాన్యం డబ్బులు చెల్లింపు కోసం ముందుగానే సిద్ధం చేసుకున్నామన్నారు.

కొన్న ప్రతి బస్తాకు 24 గంటల్లో అవసరమైతే 4 నుంచి 5 గంటల్లో కూడా చెల్లింపు చేసిన దాఖలాలు ఉన్నాయన్నారు.

ధాన్యం డబ్బులు రైతుకు చెల్లించాలనే చిత్తశుద్ధితో రా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందన్నారు.

తాను పేదరికం నుంచి వచ్చానని తనకు రైతుల బాధలు తెలుసన్నారు.

రైతులకు ఎట్టి పరిస్థితుల్లోనూ నష్టం జరగకూడదన్నది ప్రధాన ఉద్దేశం అని ప్రతి రైతుకు మేలు జరగాలన్నదే తమ అభిమతం అన్నారు. 

 రైతులకు మిల్లర్లు గాని, బ్రోకర్లు గాని ఎవరు అన్యాయం చేసిన కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశించారన్నారు. 

ప్రభుత్వ అధికారులు పనితీరు, ప్రవర్తన పట్ల ప్రజల అభిప్రాయాలను పైనుండి ఎప్పటికప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి సేకరిస్తున్నారన్నారు.

తాను గట్టిగా మాట్లాడి రైతుకు 1450 నుంచి 1650 రూపాయలకు ఇప్పించడం తప్పు కాదన్నారు. 

దీంతో మిల్లర్లు గాని, అధికారులు గానీ ఎవరు కూడా రైతుకు అన్యాయం చేయాలంటే వెనుకంజ

Comments

-Advertisement-