రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

ఇంటింటికీ వెళ్ళి చెత్త ను సేకరించాలి

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news
Mounikadesk

ఇంటింటికీ వెళ్ళి చెత్త ను సేకరించాలి

హౌసింగ్ లే ఔట్ లలో కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలి

ఇళ్ళ నిర్మాణాలకు సంబంధించి ప్రజల నుండి ఫిర్యాదులు రాకూడదు

-జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి

కర్నూలు, డిసెంబర్ 23 (పీపుల్స్ మోటివేషన్):-

గ్రామాల్లో తప్పనిసరిగా ఇంటింటికీ వెళ్ళి చెత్త ను సేకరించాలని జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి అధికారులను ఆదేశించారు.

మంగళవారం మంత్రాలయం మండలం కేంద్రంలో జిల్లా కలెక్టర్ పర్యటించారు.. ఈ సందర్భంగా రామచంద్ర నగర్ కాలనీలో పారిశుధ్యం, త్రాగునీటి సరఫరా, వీధి విద్యుత్ దీపాల సదుపాయాలపై కాలనీ వాసులతో ఆరా తీశారు..అనంతరం హౌసింగ్ లే ఔట్ ను పరిశీలించి, లబ్ధిదారులతో కలెక్టర్ సంభాషించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రామచంద్ర నగర్ కాలనీ వాసులతో మాట్లాడుతూ ఇంటింటి కీ వచ్చి చెత్త సేకరిస్తున్నారా, త్రాగునీటి సరఫరా ఎలా ఉంది, వీధి దీపాలు ఉన్నాయా అని కాలనీ వాసులను అడిగి తెలుసుకున్నారు. ప్రతి రోజు తెల్లవారుజామునే ఇంటింటికి వచ్చి పారిశుధ్య సిబ్బంది చెత్త సేకరిస్తున్నారని, తడి చెత్త, పొడి చెత్త వేరు చేసి వారికి అందిస్తున్నామని, అదే విధంగా త్రాగు నీటి సమస్య, వీధి దీపాల సమస్యలు లేవని కాలనీ వాసులు కలెక్టర్ కి తెలియచేశారు.. కాలనీలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఏర్పాటు చేయించాలని కాలనీ వాసులు కలెక్టర్ దృష్టికి తీసుకు రాగా, తగిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు..



అనంతరం కలెక్టర్ మండల కేంద్రంలో ఉన్న హౌసింగ్ లే అవుట్ ను పరిశీలిస్తూ, ఏమైనా సమస్యలు ఉన్నాయా అని లేఔట్ లో నివాసం ఉన్న వారిని ఆరా తీశారు.. త్రాగు నీటి సమస్య ఉందని, స్ట్రీట్ లైట్ లు, రోడ్డు వేయించాలని కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు..రోడ్డు వేయిస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు. త్వరితగతిన త్రాగు నీటి సమస్యను పరిష్కరించాలని, రెండు రోజుల్లో స్ట్రీట్ లైట్స్ ఏర్పాటు చేయాలని కలెక్టర్ డిపిఓ ను, ఆర్ డబ్ల్యూఎస్ అధికారులను ఆదేశించారు..హౌసింగ్ లే ఔట్ లలో అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ హౌసింగ్ పీడీని ఆదేశించారు..  

పాజిటివ్ పర్సెప్షన్ లో హౌసింగ్ అంశం పై ప్రజల నుండి పాజిటివ్ ఫీడ్ బ్యాక్ రావాలి

హౌసింగ్ అంశంపై ప్రజల నుంచి పాజిటివ్ ఫీడ్‌బ్యాక్ రావాలని కలెక్టర్ హౌసింగ్ ఇంజినీర్ లను, ఎంపిడిఓ ను, ఇంజనీరింగ్ అసిస్టెంట్ లను ఆదేశించారు.. ఇంజనీరింగ్ అసిస్టెంట్లు రిజిస్టర్ లు మెయింటైన్ చేసి ఏ దశలో ఎంత డబ్బు జమ అయింది? సిమెంట్ కి ఎంత, స్టీల్ కి ఎంత డబ్బు జమ అయింది? అనే వివరాలను రిజిస్టర్ లో నమోదు చేసి సంబంధిత లబ్ధిదారులతో సంతకం తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. ఈ సందర్భంగా ఇంజనీరింగ్ అసిస్టెంట్ నిర్వహిస్తున్న రిజిస్టర్ ను కలెక్టర్ పరిశీలించి, నమోదు అంశంపై పలు సూచనలు చేశారు.

కార్యక్రమంలో , హౌసింగ్ పిడి చిరంజీవి, మంత్రాలయం నియోజకవర్గ మండల స్పెషల్ అధికారి/ డి పి ఓ భాస్కర్,మంత్రాలయం టీడీపీ ఇంచార్జి రాఘవేంద్ర రెడ్డి, ఆదోని ఆర్డీఓ కార్యాలయం పరిపాలన అధికారి వసుంధర దేవి, మంత్రాలయం తహసిల్దార్ రమాదేవి, ఎంపిడిఓ నూర్జహాన్, 

తదితరులు పాల్గొన్నారు.

Comments

-Advertisement-