బాలల సంరక్షణ గృహాల్లో పిల్లల భద్రతే ప్రథమ ప్రాధాన్యం
బాలల సంరక్షణ గృహాల్లో పిల్లల భద్రతే ప్రథమ ప్రాధాన్యం
జిల్లా తనిఖీ బృందానికి దిశానిర్దేశం చేసిన జాయింట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్
పుట్టపర్తి, డిసెంబరు 23 (పీపుల్స్ మోటివేషన్):- జిల్లాలోని బాలల సంరక్షణ గృహాల్లో నివసిస్తున్న పిల్లల భద్రత, సంరక్షణ, సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం. మౌర్య భరద్వాజ్ సంబంధిత అధికారులను ఆదేశించారు.
మంగళవారం స్థానిక కలెక్టరేట్ సమావేశ హాలులో జాయింట్ కలెక్టర్ అధ్యక్షతన, జువనైల్ జస్టిస్ (కేర్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్) యాక్ట్–2015 ప్రకారం రిజిస్ట్రేషన్ పొందిన బాలల వసతి గృహాల తనిఖీ నిరిత్తం ఏర్పాటు చేసిన జిల్లా బాలల సంరక్షణ గృహాల తనిఖీ బృందం సమావేశం నిర్వహించారు. సీడబ్ల్యూసీ చైర్ పర్సన్ మేడా రామలక్ష్మి హాజరయ్యారు.
ఈ తనిఖీ బృందంలో జాయింట్ కలెక్టర్ చైర్మన్‌గా వ్యవహరిస్తూ, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్‌పర్సన్, జువనైల్ జస్టిస్ బోర్డ్ సభ్యుడు, మెడికల్ విభాగం నుంచి మెడికల్ ఆఫీసర్, మెంటల్ హెల్త్ ఎక్స్పర్ట్ సభ్యులుగా ఉండగా, జిల్లా బాలల సంరక్షణ అధికారి మెంబర్ సెక్రటరీగా వ్యవహరిస్తున్నారు.
ఈ సమావేశంలో జిల్లాలోని తొమ్మిది బాలల వసతి గృహాల్లో పిల్లల ప్రస్తుత పరిస్థితులపై బృంద సభ్యుల ద్వారా జేసి వివరాలు తెలుసుకున్నారు. తదుపరి తనిఖీ బృందం వసతి గృహాలను సందర్శించే సమయంలో పిల్లల రక్షణ వ్యవస్థలు, సిబ్బంది విద్యార్హతలు, పిల్లలకు అందిస్తున్న పోషకాహారం, విద్యా సదుపాయాలు, ఇండివిజువల్ కేర్ ప్లాన్స్ (ICP) అమలు, రికార్డుల నిర్వహణ, బాలికల భద్రతకు సంబంధించిన అంశాలను క్షుణ్ణంగా పరిశీలించాలని ఆదేశించారు. తనిఖీ అనంతరం వివరమైన నివేదికలను సిద్ధం చేసి జిల్లా కలెక్టర్‌కు సమర్పించవలసిందిగా జేసి పేర్కొన్నారు.
ఈ సమావేశంలో జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ ఇన్‌చార్జ్ ప్రాజెక్ట్ డైరెక్టర్ నాగమల్లేశ్వరి, మిషన్ వాత్సల్య, మిషన్ శక్తి జిల్లా కోఆర్డినేటర్ గీతాబాయి, జిల్లా బాలల సంరక్షణ అధికారి మహేష్, జువనైల్ జస్టిస్ బోర్డ్ మెంబర్ శ్రీనివాసులు, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ముని చంద్రిక, మెంటల్ హెల్త్ ఎక్స్పర్ట్ చంద్రమౌళి, సీఐఎఫ్ ఎన్‌జీఓ జిల్లా కోఆర్డినేటర్ కొండప్ప, జిల్లా బాలల సంరక్షణ విభాగం ప్రొటెక్షన్ ఆఫీసర్లు మురళీధర్, నాగలక్ష్మి, ఆనంద్, జగదీశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
