రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

శ్రీవారి దర్శనం పేరుతో మోసాలు.

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news
Mounikadesk

శ్రీవారి దర్శనం పేరుతో మోసాలు.

ప్రజా ప్రతినిధుల నకిలీ సిఫార్సు పత్రాలతో మోసాలకు పాల్పడ్డ ఇద్దరు అరెస్ట్.

తిరుమలలో భక్తుల భక్తి భావాన్ని ఓ లాభాల మార్గంగా చేసుకుని నకిలీ పత్రాలతో మోసం చేస్తున్న ఇద్దరిని జిల్లా ఎస్పీ  ఎల్ సుబ్బరాయుడు ఐపీఎస్.,  ఆదేశాల మేరకు తిరుమల II టౌన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.


తిరుపతి జిల్లా 04:
పవిత్ర ప్రాంతం అయినటువంటి తిరుమలలో, స్వామి వారి దర్శనం కల్పిస్తామని భక్తులను మోసగించి ప్రజా ప్రతినిధుల పేరుతో నకిలీ MLA/MLC రికమెండేషన్ లెటర్లు తయారు చేసి అమాయక భక్తుల నుంచి డబ్బులు దోచుకుంటున్నట్టు సమాచారం రావడంతో, పోలీసులు నిఘా ఏర్పాటు చేశారు.

ఈ నేపథ్యంలో నాయుడుపేటకు చెందిన బల్లి ప్రవీణ్ కుమార్ మరియు దేవత చెంచు బాలాజీ అనే ఇద్దరు వ్యక్తులు గత కొంతకాలంగా MLA/MLCల పేర్లతో నకిలీ లెటర్ ప్యాడ్లు తయారు చేస్తూ, బ్రేక్ దర్శనం ఏర్పాటు చేస్తామంటూ భక్తుల నుండి రూ.10,000/- నుంచి రూ.20,000/- వరకు వసూలు చేస్తున్నట్టు తేలింది. సూళ్ళూరుపేట MLA  ఎన్. విజయశ్రీ, గూడూరు MLA  పాశం సునీల్ కుమార్, అలాగే MLC బల్లి కళ్యాణ్ చక్రవర్తిల పేర్లను దుర్వినియోగం చేస్తూ నకిలీ లెటర్లు తయారు చేసి హైదరాబాదు‌కు చెందిన భక్తులను మోసం చేస్తున్న సమయంలో పోలీసులు అరెస్టు చేశారు.

ఈ క్రమంలో వారి వద్ద నుంచి నకిలీ పత్రాల్లో ఉపయోగించిన డేటా, బ్యాంక్ పాస్ బుక్స్, రూ.1,000 నగదు వంటి ఆధారాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటికే గూడూరు I టౌన్ PS, తిరుమల II టౌన్ PSలో కేసులు నమోదు కాగా, నిందితులు మరికొన్ని మోసాలకు కూడా పాల్పడ్డట్టు విచారణలో తేలింది. ఇద్దరి నకిలీ చర్యలకు సహకరించిన పరికరాలు ల్యాప్టాప్, ప్రింటర్, మొబైల్ ఫోన్లు పోలీసుల ఇదివరకే స్వాధీనం చేసుకున్నారు.

ఈ ఘటనపై స్పందించిన తిరుమల పోలీసులు, శ్రీవారి దర్శనం కోసం ఎటువంటి మధ్యవర్తులను నమ్మవద్దని, దర్శనం మరియు సేవా టిక్కెట్లు కేవలం టీటీడీ అధికారిక వెబ్‌సైట్ లేదా కౌంటర్లలో మాత్రమే అందుబాటులో ఉంటాయని స్పష్టంగా హెచ్చరించారు. ఎవరైనా దర్శనం పేరుతో డబ్బులు అడిగితే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. తప్పుడు రికమెండేషన్ లెటర్లపై మోసాలు ఆపేందుకు ఎస్పీ గారి ఆదేశాల మేరకు కఠిన చర్యలు, నిఘా కొనసాగుతాయని తెలిపారు.

ఈ కేసు అరెస్టులకు తిరుమల పోలీసులతో పాటు టీటీడీ విజిలెన్స్ కూడా కీలక సహకారం అందించింది. మరెవరైనా ఇలాంటి మోసాలకు బలై ఉంటే వెంటనే పోలీసులను సంప్రదించాల్సిందిగా కోరారు.

సంప్రదించవలసిన నంబర్లు:

SHO One Town PS Tirumala: 94407 96769

SHO Two Town PS Tirumala: 94407 96772

Comments

-Advertisement-