ఉమ్మీద్ పోర్టల్ గడువు కేంద్రం మరొక రోజు పొడిగించింది.
General News
Latest news
Fast telugu news
Telugu short news
Telugu intresting news
Intresting facts
Telugu daily updates
Andhra Pradesh
Telangana news
By
Mounikadesk
ఉమ్మీద్ పోర్టల్ గడువు కేంద్రం మరొక రోజు పొడిగించింది.
- ఏపీ వక్ఫ్ బోర్డ్ దేశంలోనే అత్యుత్తమ పనితీరు కనబరిచింది.
- 100 శాతం డేటా అప్‌లోడ్ & అప్రూవల్ పూర్తి చేసింది.
- ప్రతి రోజును ‘ఇదే ఆఖరి రోజు’ అని భావించి శ్రమించారు.
- వక్ఫ్ సిబ్బంది యొక్క రాత్రింబవళ్ళ శ్రమే ఈ విజయానికి కారణం.
- వక్ఫ్ సిబ్బంది అంకిత భావమే రాష్ట్రాన్ని నంబర్ వన్ గా నిలిపింది.
- సీఎం చంద్రబాబు, మంత్రులు లోకేష్, ఫరూక్ ల సహకారం అత్యంత విలువైనది.
- షేక్ అబ్దుల్ అజీజ్, ఏపీ వక్ఫ్ బోర్డ్ చైర్మన్
ఉమ్మీద్ పోర్టల్ అమలు క్రమంలో దేశవ్యాప్తంగా వక్ఫ్ ఆస్తుల డిజిటలైజేషన్ జరుగుతున్న కీలక దశలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మొత్తం వక్ఫ్ డేటాను అప్‌లోడ్ చేసి, పూర్తి స్థాయిలో అప్రూవ్ చేయించుకున్న రాష్ట్రంగా దేశంలో అగ్రస్థానంలో నిలిచామని ఏపీ వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్ ప్రకటించారు. మన రాష్ట్ర డేటా మొత్తం అప్‌లోడ్ చేసి, పూర్తిగా అప్రూవ్ చేయించుకున్నామని, వక్ఫ్ బోర్డ్ సిబ్బంది రాత్రింబవళ్ళు కష్టపడి పనిచేశారని ఇది వారి విజయమేననని అభినందించారు. ప్రతి రోజును ‘ఇదే ఆఖరి రోజు’ అని భావించి చేసిన శ్రమే ఈ విజయానికి కారణమని తెలిపారు. దేశంలోని అనేక రాష్ట్రాల వద్ద పెద్ద మొత్తంలో పెండింగ్ ఉండగా, ఆంధ్రప్రదేశ్ మాత్రం అత్యంత వేగంగా, అత్యంత బాధ్యతతో ఈ ప్రక్రియను పూర్తి చేసినందుకు గర్వపడుతున్నామని అన్నారు. వక్ఫ్ బోర్డ్ సిబ్బందికి ప్రత్యేక అభినందనలు తెలియచేశారు. ఒత్తిడి ఉన్నా, గడువులు దగ్గరపడినా ఎవ్వరూ వెనక్కి తగ్గకుండా, వక్ఫ్ ఆస్తుల రక్షణ కోసం అందరూ ఒక కుటుంబంలా పనిచేశారని, వారి అంకితభావమే ఆంధ్రప్రదేశ్‌ను దేశంలో నెంబర్ వన్‌గా నిలిపింది అన్నారు. సీఎం చంద్రబాబు, మంత్రులు లోకేష్, ఫరూక్ ల సహకారం అత్యంత విలువైనదని, వారి విలువైన సహకారంతోనే మరింత చురుగ్గా పనిచేయగలిగామని అన్నారు. ఇకపై వక్ఫ్ ఆస్తుల రక్షణ, పారదర్శకత, డిజిటలైజేషన్‌లో మరింత బలోపేత చర్యలు చేపడతామని అన్నారు.
Comments
