‘రాజా సాబ్’ బాక్సాఫీస్ జాతర.. తొలిరోజే రూ. 112 కోట్లు
‘రాజా సాబ్’ బాక్సాఫీస్ జాతర.. తొలిరోజే రూ. 112 కోట్లు
రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, మారుతి దర్శకత్వంలో రూపొందిన హారర్ కామెడీ చిత్రం ‘ది రాజా సాబ్’ బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా తొలి రోజే కలెక్షన్ల సునామీని నమోదు చేసింది. తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ. 112 కోట్ల వసూళ్లను సాధించినట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది.
ఈ చిత్రంతో ప్రభాస్ ఖాతాలో మరో భారీ ఓపెనర్ చేరింది. బాహుబలి 2, సాహో, ఆదిపురుష్, సలార్, కల్కి చిత్రాల తర్వాత రూ. 100 కోట్లకు పైగా ఓపెనింగ్ సాధించిన ఆరో చిత్రంగా ‘రాజా సాబ్’ నిలిచింది. ఈ ఘనత సాధించిన ఏకైక భారతీయ హీరోగా ప్రభాస్ మరోసారి రికార్డు సృష్టించారు.
వసూళ్ల వివరాల ప్రకారం తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం రూ. 58 కోట్ల వసూళ్లు సాధించింది. కర్ణాటకతో పాటు ఇతర రాష్ట్రాల్లో రూ. 18 కోట్లు, ఓవర్సీస్ మార్కెట్లలో రూ. 36 కోట్ల వసూళ్లు నమోదు చేసింది.
మారుతి మార్క్ వినోదం, ప్రభాస్ క్రేజ్ కలసి ప్రేక్షకులను థియేటర్లకు భారీగా రప్పిస్తున్నాయి. తొలి రోజే ఈ స్థాయిలో వసూళ్లు రావడంతో రాబోయే రోజుల్లో బాక్సాఫీస్ వద్ద ‘రాజా సాబ్’ జోరు మరింత పెరిగే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
