ప్రతి పరీక్షా కేంద్రం దగ్గర 144 సెక్షన్ అమలు చేయాలి
ప్రతి పరీక్షా కేంద్రం దగ్గర 144 సెక్షన్ అమలు చేయాలి
- ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పకడ్బందీ ఏర్పాట్లతో ప్రశాంతంగా ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు నిర్వహించాలి
- జిల్లాలో 75 సెంటర్లలో ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణ
- జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి
కర్నూలు, జనవరి 30 (పీపుల్స్ మోటివేషన్):-
ఫిబ్రవరి 23 వ తేది నుండి మార్చి 24 వ తేది వరకు నిర్వహించే ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పకడ్బందీ ఏర్పాట్లతో ప్రశాంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి సంబధిత అధికారులను ఆదేశించారు.
శుక్రవారం కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్ లో ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల నిర్వహణపై కలెక్టర్ సంబంధిత అధికారులతో సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు ఫిబ్రవరి 23 వ తేది నుండి మార్చి 24 వ తేది వరకు 75 సెంటర్ల లో నిర్వహించడం జరుగుతుందన్నారు. ఇంటర్మీడియట్ జనరల్ లో 43, 379 (మొదటి సంవత్సరం 23,140, రెండవ సంవత్సరం 20,239) మంది విద్యార్థులు హాజరు అవుతున్నారన్నారు.. అదే విధంగా ఇంటర్మీడియట్ వొకేషనల్ లో 5, 285 (మొదటి సంవత్సరం 3,271, రెండవ సంవత్సరం 2,014) మంది విద్యార్థులు హాజరు అవుతున్నారన్నారు. అదే విధంగా ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్ సొసైటీ ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు మార్చి 2 వ తేది నుండి మార్చి 13 వ తేది వరకు 6 సెంటర్ల లో నిర్వహించడం జరుగుతుందన్నారు. 1359 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరు కానున్నారని తెలిపారు. ఈ పరీక్షల నిర్వహణకు ఆయా శాఖల అధికారులు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఆదేశించారు..
ప్రశ్నా పత్రాల భద్రతకు ఆర్మ్డ్ గార్డ్స్ ఏర్పాటు తో పాటు పరీక్ష కేంద్రాల వద్ద గట్టి బందోబస్తు ఏర్పాటు చేయాలని కలెక్టర్ పోలీస్ అధికారులను ఆదేశించారు.. ప్రశ్నా పత్రాలు స్టోరేజ్ పాయింట్ నుంచి పరీక్ష కేంద్రాలకు వెళ్లే వరకు పోలీసు ఎస్కార్ట్ ఉండాలన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించాలని, పరిసరాల్లో జిరాక్స్ సెంటర్లు మూసి ఉంచాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రతి ఎగ్జామినేషన్ హాల్ లో త్రాగు నీరు ఏర్పాటు చేయాలన్నారు.. పరీక్ష కేంద్రాల్లో సరిపడా లైటింగ్ ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద పరిశుభ్రత ఉండేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ మున్సిపల్ అధికారులను ఆదేశించారు.. ఫస్ట్ ఎయిడ్ కిట్స్, అవసరమైన మందులు ఏర్పాటు చేయాలని కలెక్టర్ వైద్య ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. పరీక్ష కేంద్రాలకు బస్సు సౌకర్యం ఉండేలా తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆర్టీసీ అధికారులను ఆదేశించారు.పరీక్షా కేంద్రాల్లో నిరంతరాయంగా విద్యుత్ సరఫరా ఉండేలా చర్యలు తీసుకోవాలని apspdcl అధికారిని ఆదేశించారు.
సమావేశంలో ఆర్ఐఓ లాలప్ప, సర్వ శిక్ష అభియాన్ పిఓ లోక్ రాజ్ , డి ఈ ఓ సుధాకర్, కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ డి ఈ ఈ నరేష్, 3 టౌన్ ఎస్ఐ పీరయ్య, కలెక్టరేట్ ఏఓ శివరాముడు, అసిస్టెంట్ కమిషనర్ లేబర్ సాంబ శివ, ఏపీ ఎస్పీడీసీఎల్ డిఈ విజయ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

