టీ20 ప్రపంచకప్ జట్టులో చోటు దక్కకపోవడంపై శుభ్‌మన్ గిల్ స్పందన
టీ20 ప్రపంచకప్ జట్టులో చోటు దక్కకపోవడంపై శుభ్‌మన్ గిల్ స్పందన
భారత క్రికెట్ జట్టు వన్డే కెప్టెన్ శుభ్‌మన్ గిల్ త్వరలో జరగనున్న 2026 టీ20 ప్రపంచకప్ జట్టులో తనకు స్థానం దక్కకపోవడంపై తొలిసారి స్పందించాడు. న్యూజిలాండ్‌తో జరిగే తొలి వన్డే మ్యాచ్‌కు ముందు మీడియాతో మాట్లాడిన గిల్, సెలక్టర్ల నిర్ణయాన్ని తాను పూర్తిగా గౌరవిస్తున్నట్లు వెల్లడించాడు.
ఇటీవల కాలంలో పొట్టి ఫార్మాట్‌లో తన ప్రదర్శన ఆశించిన స్థాయిలో లేకపోవడం వల్లే జట్టులో చోటు దక్కలేదని గిల్ పరోక్షంగా అంగీకరించాడు. జట్టు సమతుల్యత, అవసరాలను దృష్టిలో పెట్టుకుని సెలక్షన్ కమిటీ ఈ నిర్ణయం తీసుకుందని పేర్కొన్నాడు. టీ20 జట్టులో కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్ కొనసాగుతుండగా, వైస్ కెప్టెన్ బాధ్యతలను తన స్థానంలో ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్‌కు అప్పగించిన విషయాన్ని కూడా ఆయన ప్రస్తావించాడు.
ఈ సందర్భంగా గిల్ మాట్లాడుతూ, జట్టులో ఎంపిక కావడం లేదా కాకపోవడం మన చేతుల్లో ఉండదని, తలరాతలో ఉన్నదే జరుగుతుందని వ్యాఖ్యానించాడు. దేశం కోసం ఆడే ప్రతి ఆటగాడు తన వంతు కృషి చేస్తాడని, తాను కూడా భవిష్యత్తులో అవకాశాలు వచ్చినప్పుడు అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వడానికి సిద్ధంగా ఉంటానని స్పష్టం చేశాడు. ప్రస్తుతం టీ20 ప్రపంచకప్‌కు ఎంపికైన భారత జట్టుకు శుభాకాంక్షలు తెలిపిన గిల్, దేశం కోసం వారు గొప్ప విజయాన్ని సాధించాలని ఆకాంక్షించాడు.
