ఎస్‌బీఐ కస్టమర్లకు రూ.2 లక్షల వరకు రుణం..
ఎస్‌బీఐ కస్టమర్లకు రూ.2 లక్షల వరకు రుణం..
- ఇలా పొందితే వెంటనే ఖాతాలోకి!
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఖాతా ఉన్న వారికి శుభవార్త. బ్యాంక్ తన అర్హత కలిగిన ఖాతాదారులకు ఎలాంటి పత్రాలు లేకుండా, పూర్తిగా డిజిటల్ విధానంలో రూ.2 లక్షల వరకు వ్యక్తిగత రుణం అందిస్తోంది. అకస్మాత్తుగా డబ్బు అవసరం వచ్చినప్పుడు ఈ సౌకర్యం ఎంతో ఉపయోగకరంగా మారనుంది.
బ్యాంక్ అమలు చేస్తున్న రియల్ టైమ్ ఎక్స్‌ప్రెస్ క్రెడిట్ పథకం ద్వారా అర్హులైన ఖాతాదారులు మరింత ఎక్కువ మొత్తంలో కూడా రుణం పొందే అవకాశం ఉంది. ఈ పథకం ముఖ్యంగా జీతం ఖాతా ఉన్న కస్టమర్ల కోసం రూపొందించబడింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, రక్షణ రంగం, కార్పొరేట్ రంగాల్లో పని చేసే వారు ఈ రుణానికి అర్హులు.
రుణం పొందేందుకు ఖాతాదారులు బ్యాంక్ మొబైల్ యాప్ ద్వారా దరఖాస్తు చేయాలి. ఆధార్ ఆధారిత ఓటీపీ ద్వారా ఈ సంతకం పూర్తవుతుంది. రుణ అర్హత, క్రెడిట్ స్కోరు పరిశీలన, ఆమోదం వంటి అన్ని ప్రక్రియలు ఆన్‌లైన్‌లోనే పూర్తవుతాయి. దీంతో రుణం చాలా తక్కువ సమయంలోనే ఖాతాలో జమ అవుతుంది.
ఈ రుణానికి కనీసం నెలకు రూ.15000 ఆదాయం ఉండాలి. నెలవారీ వాయిదా చెల్లింపులు మొత్తం ఆదాయంలో 50 నుంచి 60 శాతం లోపే ఉండాలి. క్రెడిట్ స్కోరు 650 నుంచి 700 కంటే ఎక్కువగా ఉండాలి. వడ్డీ రేట్లు రెండేళ్ల మార్జినల్ ఖర్చు ఆధారిత రేటుతో అనుసంధానమై ఉంటాయి. రుణ కాలం మొత్తం ఒకే వడ్డీ రేటు వర్తిస్తుంది.
బ్యాంక్ శాఖలకు తిరగాల్సిన అవసరం లేకుండా, ఇంటి నుంచే రుణం పొందే ఈ అవకాశాన్ని అర్హులైన ఖాతాదారులు వినియోగించుకోవాలని బ్యాంక్ సూచిస్తోంది.
