రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

వాలెంటైన్స్ డే బరిలో షాహిద్ కపూర్..

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news
Mounikadesk

వాలెంటైన్స్ డే బరిలో షాహిద్ కపూర్..

- ‘ఓ రోమియో’ ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్

బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్, సెన్సేషనల్ బ్యూటీ తృప్తి దిమ్రి జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఓ రోమియో’పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. టాలెంటెడ్ దర్శకుడు విశాల్ భరద్వాజ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంతో షాహిద్ కపూర్ నాలుగోసారి ఆయనతో జతకడుతున్నాడు. గతంలో వీరి కలయికలో వచ్చిన చిత్రాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్న నేపథ్యంలో ఈ సినిమాపై కూడా ఆసక్తి పెరిగింది. ప్రముఖ నిర్మాత సాజిద్ నడియాద్వాలా ఈ భారీ యాక్షన్ రొమాంటిక్ డ్రామాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాను ఫిబ్రవరి 13న వాలెంటైన్స్ డే కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఈ సందర్భంగా మూవీ నుంచి ఫస్ట్ గ్లింప్స్‌ను విడుదల చేసి అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపింది.

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news

ఈ చిత్రంలో షాహిద్ కపూర్ ఇప్పటివరకు కనిపించని విధంగా వైల్డ్ లుక్‌లో దర్శనం ఇస్తున్నారు. ఒళ్లంతా టాటూలు, రక్తపు మరకలతో కనిపిస్తున్న ఆయన లుక్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ సినిమాలో నానా పటేకర్, అవినాష్ తివారీ, విక్రాంత్ మస్సే, దిశా పటానీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా ఒక ప్రత్యేక పాత్రలో అలరించనుంది. స్వాతంత్ర్యం వచ్చిన తొలినాళ్లలో ముంబై అండర్ వరల్డ్ నేపథ్యంతో సాగుతున్న పవర్‌ఫుల్ క్రైమ్ అండ్ లవ్ కథగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. విడుదలైన గ్లింప్స్‌తోనే సినిమాపై అంచనాలు రెట్టింపయ్యాయి.

Comments

-Advertisement-