సర్వేకు డబ్బులు తీసుకుంటే చర్యలు తప్పవు
సర్వేకు డబ్బులు తీసుకుంటే చర్యలు తప్పవు
రెవెన్యూ శాఖ పనితీరుపై ప్రజల్లో విశ్వాసం పెరగాలి
అర్జీల ను త్వరగా పరిష్కరించాలి, రైతులతో మర్యాదగా వ్యవహరించాలి
జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి
కర్నూలు, జనవరి 30 (పీపుల్స్ మోటివేషన్):-
జిల్లాలో రెవెన్యూ శాఖ పని తీరుపై ప్రజల్లో పాజిటివ్ పర్సెప్షన్ రావాలంటే ప్రతి అధికారి, సిబ్బంది బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆదేశించారు.
శుక్రవారం కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రీ సర్వే, ఎఫ్ - లైన్, ఐవిఆర్ఎస్ కాల్స్,పాజిటివ్ పబ్లిక్ పర్సెప్షన్ మెదలకు రెవెన్యూ అంశాలపై రెవెన్యూ అధికారులతో సమీక్షించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ...ఎఫ్–లైన్‌లో ఉన్న అన్ని అర్జీలను వేగవంతంగా, నిబంధనల ప్రకారం పరిష్కరించాలని, అర్జీదారులకు అనవసరంగా ఆలస్యం జరగకుండా చూడాలని, రైతుల భూములకు సంబంధించిన పనుల విషయంలో ముందస్తు నోటీస్ ఇచ్చిన తరువాతే ఫీల్డ్ లోకి వెళ్లాలని, రైతుల హక్కులు, గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత రెవెన్యూ సిబ్బందిపై ఉందని తెలిపారు. రైతులతో ఎప్పుడూ మర్యాదపూర్వకంగా, గౌరవంతో వ్యవహరించాలన్నారు. విలేజ్ సర్వేయర్లు, వీఆర్వోలు ప్రతి రోజు తప్పనిసరిగా హాజరు నమోదు చేయాలని, గ్రామంలో హాజరు నమోదు చేసిన తర్వాతనే ఫీల్డ్ కి వెళ్లాలని ఆదేశించారు. అలాగే తమ విధుల పురోగతిపై ప్రతి రోజు సంబంధిత తహశీల్దార్‌కు రిపోర్ట్ సమర్పించాలని ఆదేశించారు. హాజరు మరియు రిపోర్టింగ్‌లో నిర్లక్ష్యం చూపితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. రీ–సర్వే ప్రక్రియలో ఎటువంటి లోపాలు లేకుండా, పారదర్శకంగా విధులు నిర్వహించాలని, చిన్న పొరపాట్లు కూడా భవిష్యత్తులో పెద్ద సమస్యలకు దారితీయవచ్చని కలెక్టర్ సూచించారు. రీ సర్వే కి చేయడానికి డబ్బులు అడగకూడదని, ఫిర్యాదులొస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని, ఆ దిశగా రెవెన్యూ శాఖ సిబ్బంది సమన్వయంతో, బాధ్యతతో పనిచేయాలని కలెక్టర్ ఆదేశించారు.
ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్ మాట్లాడుతూ... రైతు - ప్రభుత్వం మధ్య ఉన్న సమస్యను డెస్కటాప్ ద్వారా పరిష్కరించాలని , రైతుల పొలాల దగ్గర సమస్యను ప్రభుత్వ సర్కులర్లు మరియు ఆదేశాలను పాటిస్తూ స్పీకింగ్ ఆర్డర్స్ను ఇవ్వాలని వారికి విషయాన్ని వివరంగా తెలియజేసి సమస్యను పరిష్కరించే చర్యలు తీసుకోవాలని , విస్తీర్ణం లో తేడాలు వచ్చినప్పుడు తప్పనిసరిగా వారి దగ్గర ఉన్న రికార్డులను పరిశీలించి ఎండార్స్మెంట్ ఇచ్చి వారు సంతృప్తి చెందేలాగా వివరించాలని తెలియజేశారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ సమావేశం లో ఆర్డిఓ అజయ్ కుమార్ , తహసిల్దార్ శేషఫణి , డిప్యూటీ తాసిల్దారులు, సర్వేయర్లు , విఆర్వోలు మొదలగు వారు పాల్గొన్నారు.
