బాల్య వివాహాలు చట్ట రీత్యా నేరం
బాల్య వివాహాలు చట్ట రీత్యా నేరం
జిల్లాలో బాల్య వివాహాల నిర్మూలన కు ప్రత్యేక కృషి
జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ అధికారి పి. విజయ
ఎమ్మిగనూరు, జనవరి 30 (పీపుల్స్ మోటివేషన్):-
జిల్లాలో బాల్య వివాహాల నిర్మూలన కు ప్రత్యేక కృషి చేస్తున్నట్లు జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ అధికారి పి. విజయ పేర్కొన్నారు.
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బాల్య వివాహ ముక్త భారత్ నవంబర్ 27 నుండి మార్చి 8వ తేదీ వరకు నిర్వర్తిస్తున్న వంద రోజుల ప్రణాళికలో లో భాగంగా డివిజన్ స్థాయిలో శుక్రవారం ఎమ్మిగనూరు మండలం గుడికల్ గ్రామంలోని రైతు భరోసా కేంద్రం లో ఎమ్మిగనూరు ఐసిడిఎస్ ప్రాజెక్టు ఆధ్వర్యంలో బాల్య వివాహ నిర్మూలనపై రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ అధికారి పి విజయ మాట్లాడుతూ బాల్య వివాహాలు చట్ట రీత్యా నేరం అని తెలిపారు.. బాల్య వివాహాలు జరిపితే, అమ్మాయిని తీసుకువెళ్లి, బాల సదనం లో ఉంచి, 18 ఏళ్లు నిండిన తర్వాతనే తల్లిదండ్రులకు అప్పగించడం జరుగుతుందన్నారు. బాల్య వివాహాలు చేస్తే పెళ్ళి చేసిన తల్లిదండ్రులకే కాదు, పెళ్ళిచూపులకు తీసుకువచ్చిన మధ్యవర్తితో మొదలుకుని పెళ్ళి చేసిన పురోహితుడు, ఫంక్షన్ హాల్ ఓనర్, పెళ్లి కార్డులు ముద్రించిన ప్రచురణకర్త , పెళ్లికి వచ్చిన అతిథులు అందరూ కూడా చట్టప్రకారం శిక్షకు అర్హులే అని తెలిపారూ. మండల స్థాయిలో తహసీల్దార్ బాల్య వివాహాల నిరోధక అధికారి గా వ్యవహరిస్తారని, గ్రామస్థాయిలో ఉన్న బాల్య వివాహ నిషేధ అధికారులు పంచాయతీ సెక్రెటరీ, విఆర్ఓ మహిళ పోలీసులు కచ్చితంగా G.O.31 ప్రకారము తమ విధులను నిర్వర్తించాలన్నారు.. గ్రామస్థాయిలో బాలబాలికల తల్లిదండ్రులు చదివించుకోలేని స్థితిలో ఉన్న బాలలకు విద్యా, వసతి, పునరావాసము కల్పించడానికి జిల్లా స్థాయిలో రెండు బాలసదనాలు ఉన్నాయని, ఇలాంటి వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
డి.ఎస్.పి భార్గవి మాట్లాడుతూ చిన్న వయసులో బాల్య వివాహాలు చేయడము వల్ల బాలికల బంగారు భవిష్యత్తుకు ఆటంకం ఏర్పడుతుందన్నారు. . ముఖ్యంగా బాల్య వివాహాలు చేయడానికి తల్లిదండ్రులు ప్రయత్నాలు మొదలుపెట్టే క్రమంలోనే ముందుగానే సమాచారం ఇవ్వడం వల్ల వెంటనే తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చి బాల్య వివాహాలు వారు చేయకుండా నిలుపుదల చేయవచ్చని తెలిపారు.. ఈ సమాచారం ముందుగా తెలపడం వల్ల బాలికలను రక్షించడానికి ఉపయోగపడుతుందని తెలియజేశారు. ఈ బాల్య వివాహం వల్ల వచ్చే అనర్థాల, ఇబ్బందులు, ఆ బాలికలు ఎదుర్కొనే శారీరక మరియు మానసిక ఇబ్బందుల గురించి వివరించారు.. చిన్న వయసులో బాల్యవివాహాలు చేస్తే లక్ష రూపాయలు జరిమాలతో పాటు రెండు సంవత్సరాల పాటు జైలు శిక్ష ఉంటుందని , కావున అమ్మాయికి కచ్చితంగా 18 సంవత్సరాలు అబ్బాయికి 21 సంవత్సరాలు పూర్తి కావాలన్నారు. బాల్య వివాహాలను నివారించేందుకు .
ఆర్ బి ఎస్ కె డిస్టిక్ కోఆర్డినేటర్ మాట్లాడుతూ గర్భస్థ లింగ నిర్ధారణ పరీక్షలు చేయడము చాలా చట్ట విరుద్ధమని, తెలిపారు. సమాజంలో ఆడ మగ అనే భేదం లేకుండా చూడాలన్నారు.
అనంతరం మహిళా పోలీస్ సిఐ శ విజయలక్ష్మి మాట్లాడుతూ బాలికలు, మహిళలు గాని తమను తాము రక్షించుకోవాలంటే కచ్చితంగా తమ సెల్ ఫోన్ లో శక్తి యాప్ ను డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. దీనివల్ల ప్రొటెక్షన్ ఏర్పడుతుందని తెలిపారు ముఖ్యంగా బాలికలు కష్టపడి బాగా చదివి ఉన్నతమైన స్థాయికి ఎదిగినప్పుడు తమ తల్లిదండ్రులతో పాటు సమాజంలో గాని దేశంలో గాని మంచిగా గుర్తింపు పొందడమే కాక ఒక ఆదర్శవంతంగా కూడా నిలబడతారన్నారు.
ఈ కార్యక్రమంలో ఎంఈఓ ఆంజనేయులుఎమ్మార్వో ఎంపీడీవో, సిడిపిఓ నర్సరీ నిస్సా బేగం, డి సి పి యు శారద వైఎస్సి సిఏ మేరి స్వర్ణలత మరియు సూపర్వైజర్లు సురేఖ, గురు శేఖరమ్మ, భాగ్యలక్ష్మి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
