జెమీమాకు ప్రత్యేక బహుమతి ఇచ్చిన గవాస్కర్..
జెమీమాకు ప్రత్యేక బహుమతి ఇచ్చిన గవాస్కర్..
భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ నుంచి టీమ్ ఇండియా మహిళా క్రికెట్ స్టార్ జెమీమా రోడ్రిగ్స్‌కు అరుదైన బహుమతి లభించింది. గతంలో ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ బ్యాట్ ఆకారంలో ఉన్న ప్రత్యేక గిటార్‌ను గవాస్కర్ జెమీమాకు బహుమతిగా అందించారు. శుక్రవారం జరిగిన ఒక కార్యక్రమంలో ఈ గిటార్‌ను అందజేసి జెమీమాను ఆశ్చర్యపరిచారు. అనంతరం గవాస్కర్, జెమీమా కలిసి ఆ గిటార్‌తో ఫొటోలకు ఫోజులు ఇచ్చారు. ఈ చిత్రాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్‌గా మారాయి.
గతేడాది జరిగిన మహిళల వన్డే ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన సెమీఫైనల్‌లో జెమీమా 127 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడి భారత జట్టును ఫైనల్‌కు చేర్చిన విషయం తెలిసిందే. ఆ సమయంలో భారత్ కప్పు గెలిస్తే జెమీమా గిటార్ వాయిస్తుంటే తాను పాట పాడుతానని గవాస్కర్ హామీ ఇచ్చారు. ఆ తర్వాత ఫైనల్‌లో భారత జట్టు విజయం సాధించి కప్పు గెలుచుకుంది. ఇప్పుడు ఆ హామీని గుర్తు చేసుకుని గవాస్కర్ జెమీమాకు ఈ ప్రత్యేక గిటార్‌ను బహుమతిగా అందించి తన మాటను నిలబెట్టుకున్నారు.
